27/08/2026
భారతదేశంలో అత్యంత ప్రతిభావంతులైన యువ నాయకులు, చేంజ్ మేకర్లు, బిజినెస్ మైండ్స్ కు ఫార్చ్యూన్ ఇండియా 40 అండర్ 40 పేరిట ముంబైలో అవార్డులను ప్రదానం చేసింది. ఈ కార్యక్రమానికి కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి చిరాగ్ పాశ్వాన్, రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్యఅతిధులుగా హాజరై విజేతలకు అవార్డులను ప్రదానం చేశారు. దేశంలో డైరీ వాల్యూయాడెడ్ ఉత్పత్తుల్లో ప్రత్యేకత సాధించిన హెరిటేజ్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ నారా బ్రాహ్మణికి కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్ లో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఆర్ పిఎస్ జి గ్రూప్ వైస్ చైర్మన్ శాశ్వత్ గోయెంకా అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానాలిచ్చారు. దేశంలోని మిగతా రాష్ట్రాలకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ వేగంగా పెట్టుబడుల ఆకర్షణకు రెండు ప్రధాన కారణాలను మంత్రి లోకేష్ తెలిపారు.