26/06/2024
*అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి* *:-** AISU*
*మైదుకూరు మండలం ఎంఈఓ పద్మ లతా మేడం గారికి వినతి పత్రం అందజేసిన ఆల్ ఇండియా స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి జగదీష్ మరియు నాగరాజు లు*
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైదుకూరు మండలం లోని అనుమతులు లేని ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకొని వాటి గుర్తింపును వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు అదేవిధంగా మండలం లోని ప్రైవేటు విద్యాసంస్థల్లో ధనార్చనే ధ్యేయంగా అక్రమ వసూళ్లకు పాల్పడుతూ విద్యార్థులు తల్లిదండ్రులను మోసం చేస్తూ నడుపుతున్నటువంటి విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు అదేవిధంగా మండలంలో గుర్తింపు లేని పాఠశాలలు రోజురోజుకీ విస్తరిస్తూ ఉన్నాయి , అటువంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని వారు హెచ్చరించారు అలాగే అడ్మిషన్ల సమయంలో విద్యార్థుల దగ్గర నుంచి వేలకు వేల రూపాయలు అడ్మిషన్ ఫీజు అని పాఠశాల ఫీజు అని బుక్స్ ఫీజులు బిల్డింగ్ ఫీజ్ అని రాపడుతున్నటువంటి ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు అంతేకాకుండా ప్రవేట్ మండలంలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలల్లో ఏటువంటి ఫైర్ పర్మిషన్ లేకుండా నడుపుతున్నటువంటి పాఠశాలలపై మరియు ఫిట్నెస్ లేని బస్సులు నడుపుతున్నటువంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు తెలిపారు అలాగే కొన్ని పాఠశాలలు టెక్నో స్కూల్స్ ,ఈ టెక్నో స్కూల్స్ ,మెడికల్, ఐఐటి జేఈఈ మెయిన్స్, అనే పేర్లతో లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ ఉన్నాయి వీటి పై తక్షణం స్పందించి వాటి గుర్తింపు రద్దు చేయాలని వారి డిమాండ్ చేశారు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్నటువంటి పాఠశాల పైన చర్య తీసుకోవాలి లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు
20/06/2024
కడప: 19-6-24
మండల విద్యాశాఖ అధికారిని విదుల నుండి తొలగించాలి.....
RSO,PSYF,AISU విద్యార్థి యువజన సంఘాలు డిమాండ్...
స్థానిక కడప నగరంలోని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (RSO) రాష్ట్ర అధ్యక్షులు జగన్, ఆలిండియా స్టూడెంట్ యూనియన్ (AISU) రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శులు జగదీష్ నాగరాజు ప్రోగ్రెసివ్ స్టూడెంట్ యూత్ ఫెడరేషన్ (PSYF) రాష్ట్ర కన్వీనర్ కత్తి ఓబులేసు నిరసన తెలియజేసి అసిస్టెంట్ డైరెక్టర్ ఏడి మునీర్ ఖాన్ సార్ గారికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రొద్దుటూరు పట్టణంలోని గత 13 సంవత్సరాలుగా ఒకే మండలానికి పరిమితమై మండల విద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్న ఎంఈఓ సావిత్రి మేడం గారు కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలకు వత్తాసు పలుకుతూ ఎటువంటి ప్రభుత్వ నిబంధనలు పాటించని పాఠశాలలను విజిట్ చేయకుండా వాటిని కాపాడుకుంటూ విద్యా వ్యవస్థకు తూట్లు పొడుస్తుందని వారు తెలియజేశారు అదేవిధంగా అకడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంతవరకు కార్పొరేట్ ప్రవేట్ స్కూల్స్ ను తనిఖీలు చేసిన పాపాన పోలేదు ఎందుకు వారంటే అంత అభిమానం అర్థం కాని పరిస్థితి అని వారు తెలియజేశారు, గతంలో కూడా ఉపాధ్యాయుల జీతాలు చేయడంలో
నిర్లక్ష్యం వహించి వారి జీతాలు డబ్బును ఇన్కమ్ టాక్స్ కు గురిచేసింది ఆమె నిర్లక్ష్యంపై ఉపాధ్యాయ సంఘాలు ధర్నాలు నిర్వహించారని వారు తెలియజేశారు, గత పది రోజులు కిందట విద్యార్థి యువజన సంఘాలుగా డీఈఓ అనురాధనా మేడం గారికి జిల్లావ్యాప్తంగా అక్రమ అడ్మిషన్లు గుర్తింపు లేని పాఠశాలలపై నోట్ బుక్స్ విక్రయాలపై చర్యలు తీసుకోవాలని తెలియజేయడం జరిగింది నిన్నటి దినమున విద్యార్థి సంఘాలు ఐనా మేము ప్రొద్దుటూరు పట్టణంలో కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలలు పుస్తకాలు అక్రమంగా అమ్ముకుంటున్నారని DEO అనురాధ మేడం గారికి తెలియజేయడంతో మేడం గారు స్పందించి ఎంఈఓ గారికి విద్యార్థి సంఘాలు కంప్లైంట్ ఇచ్చినారు ప్రొద్దుటూరు పట్టణంలో కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల్లో ఎక్కడైనా అక్రమంగా పుస్తకాల అమ్ముతుంటే విజిట్ చేయండి అని తెలియజేయడంతో ఎంఈఓ మేడం గారు ప్రొద్దుటూరు పట్టణంలోని భాష్యం స్కూల్ తనిఖీ నిర్వహించి అక్కడ రూమ్స్ చెక్ చేయగా ఒక రూములో పుస్తకాలు వుండడంతో ఆ గదిని బాస్యం యాజమాన్యం వారి తాళాలతో సీజ్ చేసి పాత కర్చీఫ్ గుడ్డతో సీజ్ చేయడం వల్ల వారి దగ్గర మరొక కీస్ వున్నట్టు వారు మరల ఆ పుస్తకాలను అమ్మకం చేసుకొని ఉంటారని అనే అవమానాలకు దారి తీస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు, గతంలో ఉపాధ్యాయులను జీతాలను పెండింగ్లో పెట్టి వారి టాక్స్ కట్టయ్యే విధంగా చేయడంతో ఉపాధ్యాయులు కూడా ధర్నా నిర్వహించడం జరిగిందని వారు తెలియజేశారు, అదేవిధంగా గత 13 సంవత్సరాల గా ఒకే మండలానికి ఎం ఈ ఓ గా ఉండటం ఐదు సంవత్సరాలు గడిచిన ఎంఈఓ ను బదిలీ చేయకపోవడంలో దీనిలో ఏమి రహస్యం దాగి ఉందని వారు విమర్శించారు, ప్రొద్దుటూరు పట్టణంలో కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి బుక్స్ ఫీజు యూనిఫామ్ ఫీజు రకరకాల ఫీజులతో వేధిస్తుంటే ఇంతవరకు ఆమె సొంతంగా ఒక్క స్కూల్ ను విజిట్ చేసి చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని వారు తెలియజేశారు, కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాల పైన ఒక మండల విద్యాశాఖ అధికారిగా ఎందుకు అంత ప్రేమ అని వారు ఆవేదన వ్యక్తం చేశారు, అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఆమె వృత్తి ధర్మం పాటించకపోవడం పాఠశాలల యజమాన్యం దగ్గర ముడుపులు స్వీకరిస్తూ విద్యా వ్యవస్థకు తూట్లు పొడుస్తున్న ఎంఏఓ సావిత్రి మేడం గారిపై జిల్లా ఉన్నత విద్యాశాఖ అధికారులు విచారణ జరిపి తక్షణం ఆమెను విధుల నుంచి తొలగించి వారి ప్లేసులో కొత్త మండల విద్యాశాఖ అధికారి నియమించి ప్రొద్దుటూరు పట్టణంలోని అన్ని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని విద్యావ్యవస్థను కాపాడాలని లేనిపక్షంలో విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలను చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు తదితరులు పాల్గొన్నారు......
18/06/2024
జిల్లా విద్యాశాఖ అధికారి గారికి వినతి పత్రం ఫీ 'జులం'పై సమర్పించడమైన ది
👉 *అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ పై చర్యలు తీసుకోవాలి. ఆల్ ఇండియా స్టూడెంట్ యూనియన్ AISU*
👉 ప్రైవేటు,కార్పొరేటు విద్యా సంస్థల దోపిడీలను అరికట్టాలి. అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ మరియు ప్రైవేట్ స్కూల్స్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది
👉 విద్యార్థుల తల్లిదండ్రులు నిలువ దోపిడీ చేస్తున్న కార్పొరేట్ స్కూల్ యాజమాన్యాలు పట్టించుకోని విద్యాశాఖ అధికారులు.
జిల్లాలో ప్రైవేటు,కార్పొరేటు విద్యా సంస్థలు విద్యార్థుల తల్లిదండ్రులను నిలువు దోపిడీలకు పాల్పడుతున్నాయని, అడ్మిషన్ల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యా హక్కు చట్టాన్ని లెక్కచేయకుండా నడుస్తున్నాయని అయిన విద్యా శాఖ అధికారులు నిద్ర మత్తులో వున్నారని ఆల్ ఇండియా స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు జగదీష్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజ్ తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.....
జిల్లా లో ప్రైవేటు,కార్పొరేటు విద్యా సంస్థలు ఎదేచ్చగా విచ్చల విడిగా బస్ ఫీజు , యూనిఫామ్ ఫీజు, డెవలప్మెంట్ ఫీజు, బుక్స్ ఫీజు నా పేరుతో విద్యను వ్యాపారం చేస్తూ ఉన్నారు .విద్యా హక్కు చట్టానికి భిన్నంగా వేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను నిలువుదోపిడీ లకు పాల్పడుతున్నారు అన్నారు.విద్యా హక్కు చట్టానికి తూట్లు పొడుస్తున్నారు అని అన్నారు.బహిరంగంగా ప్రైవేటు,కార్పొరేటు విద్యా సంస్థలు విచ్చలవిడి తనానికి పాల్పడుతున్న విద్యా శాఖా అధికారులు మొద్దు నిద్రలో వున్నారని అన్నారు.కడప జిల్లా లోని కడప ప్రొద్దుటూరు బద్వేల్ మైదుకూరు జమ్మలమడుగు పోరుమామిళ్ల ఒంటి ప్రాంతాలలో అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నా ప్రవేట్ మరియు కార్పొరేట్ స్కూల్స్ పై ఫీజులు నియంత్రణ చట్టం తేవాలని,అధిక ఫీజులు అరికట్టాలని విద్య హక్కు చట్టం పరిశ్రమలు చేయాలని నిబంధనలకు విరుద్ధంగా పాలపడుతున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలపై విద్యాశాఖలు చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో ఉద్యమ కార్యచరణ చేపడతామని తెలిపారు.
Undefined property: Phalcon\Config::$details
Trying to get property 'infeed_layout' of non-object
"
data-ad-slot="
Undefined property: Phalcon\Config::$details
Trying to get property 'infeed' of non-object
">