
26/06/2024
*అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి* *:-** AISU*
*మైదుకూరు మండలం ఎంఈఓ పద్మ లతా మేడం గారికి వినతి పత్రం అందజేసిన ఆల్ ఇండియా స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి జగదీష్ మరియు నాగరాజు లు*
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైదుకూరు మండలం లోని అనుమతులు లేని ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకొని వాటి గుర్తింపును వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు అదేవిధంగా మండలం లోని ప్రైవేటు విద్యాసంస్థల్లో ధనార్చనే ధ్యేయంగా అక్రమ వసూళ్లకు పాల్పడుతూ విద్యార్థులు తల్లిదండ్రులను మోసం చేస్తూ నడుపుతున్నటువంటి విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు అదేవిధంగా మండలంలో గుర్తింపు లేని పాఠశాలలు రోజురోజుకీ విస్తరిస్తూ ఉన్నాయి , అటువంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని వారు హెచ్చరించారు అలాగే అడ్మిషన్ల సమయంలో విద్యార్థుల దగ్గర నుంచి వేలకు వేల రూపాయలు అడ్మిషన్ ఫీజు అని పాఠశాల ఫీజు అని బుక్స్ ఫీజులు బిల్డింగ్ ఫీజ్ అని రాపడుతున్నటువంటి ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు అంతేకాకుండా ప్రవేట్ మండలంలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలల్లో ఏటువంటి ఫైర్ పర్మిషన్ లేకుండా నడుపుతున్నటువంటి పాఠశాలలపై మరియు ఫిట్నెస్ లేని బస్సులు నడుపుతున్నటువంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు తెలిపారు అలాగే కొన్ని పాఠశాలలు టెక్నో స్కూల్స్ ,ఈ టెక్నో స్కూల్స్ ,మెడికల్, ఐఐటి జేఈఈ మెయిన్స్, అనే పేర్లతో లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ ఉన్నాయి వీటి పై తక్షణం స్పందించి వాటి గుర్తింపు రద్దు చేయాలని వారి డిమాండ్ చేశారు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్నటువంటి పాఠశాల పైన చర్య తీసుకోవాలి లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు