11/03/2026
జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కర్నూలు పార్లమెంట్ లో ఆలూరు నియోజకవర్గం మొదట స్థానం!!
జనసేన పార్టీ సభ్యత్వం మీ కుటుంబానికి భరోసా
75 సాధకులు చురుకుగా సభ్యత్వాలు చూపిస్తూ వారందరికీ అభినందనలు
జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా 200 పైగా సభ్యత్వాలు నమోదు చేసిన ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం చెందిన అరవింద్ కుమార్ యాదవ్, కురువ ఉదయ్ కుమార్, ఆలూరు మండలం చెందిన బోయ రంజిత్ కుమార్, దేవనకొండ మండలం చెందిన సరోజ, హోళగుంద మండలం బోయ అశోక్ వారికి అభినందనలు - శ్రీ తెర్నేకల్ వెంకప్ప, జనసేన పార్టీ ఇంచార్జి, ఆలూరు నియోజకవర్గం.
అలాగే ఈ నెల 17వ తేదీ వరకు పొడిగించిన సభ్యత్వం కార్యక్రమంలో భాగం.. ఇంకా మిగిలిన జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తలందరూ.. ఇంతకు ముందు సభ్యత్వం చేసిన వారు రెన్యువల్ చేసుకొని, కొత్తగా నమోదు చేసుకునే వారు తమ పరిధిలోని జనసేన సాధక్ లను సంప్రదించి సభ్యత్వం చేసుకోగలరని తెలిపారు.
సభ్యత్వం నమోదు మరియు రెన్యువల్ కోసం కావలసిన వివరాలు:-
కొత్తగా సభ్యత్వం తీసుకోవాలనుకున్న వారు:-
1. మీ ఆధార్ కార్డు
2. మీ ఫోటో
3. మీ నామినీ ఆధార్ కార్డు
4. ₹400/-.
5. పర్మనెంట్ ఫోన్ నంబర్
రెన్యువల్ చేసుకోవాల్సిన వారు:-
1. ఆధార్ నెంబర్
2. 400 సభ్యత్వ రుసుము
JanaSena Party Pawan Kalyan
Nadendla Manohar Naga Babu