kamala_akka_followers

kamala_akka_followers Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from kamala_akka_followers, Political Party, Anantapur.

State SC (Mala) Corporation Director Konkari Kamalamma participated in the Virat Vishwakarma Jayanti celebrations in Ana...
17/09/2025

State SC (Mala) Corporation Director Konkari Kamalamma participated in the Virat Vishwakarma Jayanti celebrations in Ananthapuram today.........

09/10/2022

_ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు విషయంలో సందేహాలు ఎన్నో !_
_బదులు ఇవ్వగలరా ....జెసి సూటి ప్రశ్న_

_తాడిపత్రి_

తాడిపత్రి పట్టణంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు సంబంధించి మునిసిపాలిటీ పాలకవర్గం, తాడిపత్రి డిఎస్పీ కి మధ్య వివాదం నెలకొన్న విషయం విదితమే.... ఈ నెల 6న ముహూర్తం నిర్ణయించుకొని తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి... జిల్లా ఎస్పీ ఫకీరప్ప... డీఎస్పీ చైతన్య ఆధ్వర్యంలో భూమి పూజ జరిగింది...

రెండు రోజుల ముందు తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మునిసిపల్ స్థలంలో ఏ విధంగా పోలీస్ స్టేషన్ నిర్మిస్తారు అంటూ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు...30 యాక్ట్ అమల్లో ఉన్న అనుమతులు లేకుండా ధర్నా నిర్వహించారంటూ 100 మందికి పైగా టిడిపి కార్యకర్తలు పై పోలీసులు కేసు నమోదు చేశారు...

*ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు సంబంధించి జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ప్రజల పక్షాన బహిరంగ లేఖ ప్రశ్నావళి విడుదల చేశారు*...

1) స్వాతంత్రం పూర్వం నుండే గ్రామకంఠం పరిధిలో ఉన్న ఈ స్థలాన్ని ... గ్రామ నేస్తం కింద కొందరు వాడుకోవడానికి అధికార యంత్రాంగం అప్పట్లో అనుమతించింది... అప్పటినుండి కూడా ఆ స్థలం తాడిపత్రి మున్సిపాలిటీ లోనే ఉంది... కాదని ఎవరైనా నిరూపించగలరా...

2) ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు ఉన్నాయా ? ఏ జీవో నంబర్ ప్రకారం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది ? వివరాలు వెల్లడించ గలరా ?

3) పోలీస్ స్టేషన్ నిర్మాణాలకు సంబంధించి పోలీస్ శాఖ కు ఎటువంటి అధికారాలు ఉండవు? పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మాణాలు జరుగుతాయి... కాదని ఎవరైనా నిరూపించగలరా ?

4) ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నిర్మించాలనుకుంటే పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ బహిరంగ టెండర్ను ఆహ్వానిస్తుంది... ఆ టెండర్ ను ఎప్పుడు ఆహ్వానించారు? ప్రభుత్వం ఎంత బడ్జెట్ కేటాయించింది?

5) ఎన్ని లక్షల రూపాయలతో ఈ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను నిర్మిస్తున్నారు? టెండర్ను ఏ గుత్తేదారు చేజిక్కించుకున్నారు ?

6) కడపలో ఉన్న హౌసింగ్ కార్పొరేషన్ DE ని కనీసం సంప్రదించారా? ఆయన పర్యవేక్షణలో జరగాల్సిన నిర్మాణానికి ఆయనను ఎందుకు ఆహ్వానించలేదు ?

7) కనీసం ఈ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు సంబంధించి ప్లాన్ అప్రూవల్ మున్సిపాలిటీ లో ఏమైనా అధికారుల ఆమోదం పొందిందా ? వివరాలు బహిర్గతం చేయగలరా ?

8) మా తాడిపత్రి ప్రజలతో అక్రమ వసూళ్ల ద్వారా ఈ పోలీస్ స్టేషన్ నిర్మించడానికి DSP సంకల్పించారా ?

9) ఎమ్మెల్యే పెద్దారెడ్డి మెజార్టీ పట్టణ ప్రజల అభిప్రాయాలను తీసుకున్నారా ? మున్సిపల్ కౌన్సిలర్ గా గెలిచిన మీ తనయుడికి మునిసిపల్ ఆస్తులు దారాదత్తం చేసే బాధ్యతను అప్పగించారా ?

10) ఉన్నత అధికారి అయిన మున్సిపల్ కమిషనర్ ను పక్కన పెట్టి ఒక కాంట్రాక్టు ఉద్యోగి తప్పుడు సలహాలతోనే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నిర్మాణం అనే దుస్సాహసానికి ఎమ్మెల్యే పూనుకున్నారా ?

09/10/2022
2019 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి గెలిచి ఉంటే...1. మొదటి రోజు నుంచే పేదల ఫించను రూ. మూడు వేలు అయ్యేది. 2. మద్యం రేట్లు పెర...
06/10/2022

2019 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి గెలిచి ఉంటే...

1. మొదటి రోజు నుంచే పేదల ఫించను రూ. మూడు వేలు అయ్యేది.
2. మద్యం రేట్లు పెరిగేవి కావు.
3. జగన్ బ్రాండ్లు కాకుండా మంచి మద్యం దొరికి ఆరోగ్యాలు బాగుండేవి.
4. కరెంట్ చార్జీలు పెరిగేవి కావు.
5. కరెంట్ కోతలు ఉండేవి కావు
6. ఇసుక ధర పెరిగేది కాదు. ఇళ్ళు కట్టుకొనే వాడికి ఖర్చు తగ్గేది.
7. ఇసుక లభ్యత బాగా ఉండి నిర్మాణ పనులు పెరిగేవి. కూలి పని చేసే వాడికి నాలుగు పనులు అదనంగా దొరికేవి.
8. రాష్ట్రం అంతా నిర్మాణ పనులు బాగా జరుగుతూ ఉండి ఆ రంగం పై ఆధార పడిన వారికీ కాస్త ఆదాయం పెరిగేది.
9. రోడ్లు బాగుండేవి.
10. మొత్తం ఖర్చు ప్రభుత్వం భరించి టిడ్కో ఇళ్ళు పేదలకు ఉచితంగా ఇచ్చేవారు.
11. మరో పది లక్షల టిడ్ కో ఇళ్ళు కొత్తగా నిర్మాణం జరిగేవి.
12. గ్రామీణ ప్రాంతాల్లో పాతిక లక్షల పేదల ఇళ్ళ నిర్మాణం జరిగేది. ప్రభుత్వం వాటా ఇప్పటి కంటే ఎక్కువ ఉండేది.
13. పరిశ్రమలు పెట్టుబడులు భారీగా వచ్చి యువతకు ఎక్కువ ఉద్యోగాలు దొరికేవి.
14. పరిశ్రమలు పెట్టుబడుల వల్ల ప్రభుత్వ ఆదాయం పెరిగి పసుపు కుంకుమ మాదిరిగా పేదలకు ఇంకా ఎక్కువ సాయం అందేది.
15. అన్న క్యాంటీన్లు ఇంకా ఎక్కువ వచ్చేవి.
16. ధరలు అదుపులో ఉండి పేదల జేబులు ఖాళీ అయ్యేవి కావు.
17. పండగ కానుకలు కొనసాగే వి.
18. రైతులకు ధాన్యం అమ్మిన 15 రోజుల్లో డబ్బులు చేతికి అందేవి.
19. కౌలు రైతులకు మరింత సాయం అందేది.
20. తొంభై శాతం సబ్సిడీతో డ్రిప్ సాయం అందేది.
21. పంటల ధరలు పడిపోతే ప్రభుత్వం ఆదుకునేది.
22. విశాఖ కు ఐటీ కంపెనీలు, రాయలసీమకు ఉత్పత్తి కంపెనీలు భారీగా వచ్చేవి.
23. పోలవరం సహా సాగునీటి ప్రాజెక్టులు చాలా వరకూ పూర్తయ్యేవి.
24. అమరావతి నిర్మాణం పూర్తి అయ్యేది.
25. రౌడీ రాజ్యం, పోలీసు రాజ్యం ఉండేవి కావు.
26. బీసీ, కాపు కార్పొరేషన్లు సహా అనేక కార్పొరేషన్ల ద్వారా రుణాల మంజూరు జరిగేది.
27. ఉద్యోగులకు మరింత సాయం అందేది.
28. ముఖ్య మంత్రి ప్రజలకు అందుబాటులో ఉండేవారు.
29. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు కొనసాగేవి.
30. కోర్టుల్లో రోజూ మొట్టికాయలు తింటూ పరువు తీసుకొనే పరిస్థితి ఉండేది కాదు.

Address

Anantapur

Website

Alerts

Be the first to know and let us send you an email when kamala_akka_followers posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share