CPIML Liberation - Anantapur

CPIML Liberation - Anantapur Official page of Communist party of India (Marxist - Leninist) Liberation, Anantapur committee

23/05/2026
23/05/2026

India’s Youth Are Angry!

కామ్రేడ్ దీపాంకర్ భట్టాచార్య
జాతీయ ప్రధాన కార్యదర్శి
సిపిఐ (యమ్ యల్) లిబరేషన్

పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలుప్రజలపై మోడీ ప్రభుత్వ మరో భారం!• పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు రూ.3కుపైగా పెంపు • తక్షణమే...
15/05/2026

పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు
ప్రజలపై మోడీ ప్రభుత్వ మరో భారం!

• పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు రూ.3కుపైగా పెంపు
• తక్షణమే అమల్లోకి తెచ్చిన కేంద్ర ప్రభుత్వం
• ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలు

“మోడీ... మాయ మొదలు!”
ప్రజలకు ఉపశమనం ఇస్తామని చెప్పి
మరోసారి సామాన్యుల జేబులపై దాడి!

కార్పొరేట్‌లకు లాభాలు...
ప్రజలకు భారాలేనా?

ప్రజలపై ధరల భారం మోపుతున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను ఖండిద్దాం!

సిపిఐ (యమ్ యల్) లిబరేషన్
రాష్ట్ర కమిటీ

*అనంతపురం “చీనీ రైతుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి”**చీనీ చెట్లు ఎండిపోతున్న పట్టించుకొని ప్రభుత్వ అధికారులు!* ...
15/05/2026

*అనంతపురం “చీనీ రైతుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి”*

*చీనీ చెట్లు ఎండిపోతున్న పట్టించుకొని ప్రభుత్వ అధికారులు!*

అనంతపురం జిల్లాలో గార్లదిన్నె, నార్పల, బీకే సముద్రం, శింగనమల, యల్లునూరు, పుట్లూరు, తాడిపత్రి కొనగుట్టపల్లి , దిగువ పల్లి , ఎగువపల్లి,యాడికి మండలాల్లో వేలాది ఎకరాల్లో సాగవుతున్న చీనీ పంట నేడు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. భూగర్భ జలాలు పూర్తిగా క్షీణించడంతో బోర్‌వెల్స్ ఎండిపోవడం, పైగా ఎండ 42 నుండి 45 డిగ్రీ ల వల్ల మరింత తీవ్రత పెరగడం వల్ల పంటలు రైతుల కళ్ల ముందే ఎండి పోతున్నాయి. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి సంవత్సరాల పాటు కష్టపడి పెంచుకున్న తోటలు చేతికొచ్చే సమయానికి నాశనం కావడం రైతులను తీవ్ర నిరాశ, ఆందోళనలోకి నెట్టింది.

ఇది సహజ విపత్తు మాత్రమే కాదు ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ప్రతిబింబం. ఎండబారిన రాయలసీమ ప్రాంతంలో నీటి వనరుల అభివృద్ధి, సాగునీటి ప్రణాళికలు, రిజర్వాయర్ల నిర్మాణం వంటి కీలక అంశాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దశాబ్దాలుగా నిర్లక్ష్యం ప్రదర్శించాయి. కృష్ణా నది నీటిని సరైన రీతిలో నిల్వ చేసి, చెరువులు నింపి ఉంటే ఈ పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది కాదు.
రైతులు 1000 నుంచి 2000 అడుగుల లోతులో బోర్లు త్రవ్వించుకోవడానికి లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అయినా నీరు దొరకకపోవడం వల్ల అప్పుల బారిన పడుతున్నారు. ఒకసారి తోట పంట ఎండిపోతే తిరిగి కొత్తగా సాగు చేయడానికి సంవత్సరాలు పడుతుంది. ఈ లోపు రైతు కుటుంబం ఆర్థికంగా పూర్తిగా కుదేలవుతుంది.
సింగనమల, తాడిపత్రి నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో 30కి పైగా గ్రామాలకు చెందిన సుమారు 600 మంది రైతుల 1500 నుండి 2000 ఎకరాల చీనీ తోటలు ఎండిపోతున్నాయి. చెరువులకు సకాలంలో నీళ్లు నింపకపోవడం, భూగర్భ జలాల సంరక్షణలో ప్రభుత్వం విఫలమవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రభుత్వం ట్యాంకర్ల ఖర్చును భరించి రైతులకు అండగా నిలిచింది. ఇప్పుడు ఎందుకు అదే సహాయం చేయడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపామని చెబుతూ కాలం గడుపుతున్నారు కానీ రైతులకు తక్షణ ఉపశమనం మాత్రం అందడం లేదు.

ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి తక్షణమే స్పందించి రెవెన్యూ, ఉద్యాన, వ్యవసాయ శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి. రైతులకు మాటల్లో కాదు, చేతల్లో భరోసా ఇవ్వాలి. లేదంటే “రైతు ప్రభుత్వం” అనే మాటలు కేవలం ప్రచార నినాదాలుగానే మిగిలిపోతాయి.

*డిమాండ్స్:*
• పి.ఎ.బి.ఆర్, హంద్రీనీవా, హెచ్‌ఎల్‌సీ కాలువల ద్వారా చెరువులకు నీళ్లు నింపి భూగర్భ జలాలను పునరుద్ధరించాలి
•ఎండిపోతున్న చీనీ తోటలను రక్షించేందుకు అత్యవసర చర్యలు చేపట్టాలి
• ఎండిపోతున్న చీనీ తోటలను రక్షించేందుకు అత్యవసర చర్యలు చేపట్టాలి
• నష్టపోయిన ప్రతి రైతులకు ఎకరాకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం ప్రకటించాలి

విప్లవ అభినందనలతో....
*హెచ్. వేమన*
జిల్లా కార్యదర్శి
సిపిఐ (యమ్ యల్) లిబరేషన్
ఉమ్మడి అనంతపురం జిల్లా

*అనంతపురంలో అఖిలపక్ష కార్మిక సంఘాల నిరసన ర్యాలీ – కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై ఆగ్రహం**ఈరోజు అనంతపురం నందు...
12/05/2026

*అనంతపురంలో అఖిలపక్ష కార్మిక సంఘాల నిరసన ర్యాలీ – కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై ఆగ్రహం*

*ఈరోజు అనంతపురం నందు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నోయిడాలో కార్మికులపై ప్రభుత్వం నిర్బంధాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వ సంస్థైన ఎల్ఐసి కార్యాలయం ముందు నిరసన ధర్నాన్ని నిర్వహించడం జరిగింది.*

అనంతపురం: 12 మే 2026
"""'''''""""""''''''''''''''''''''
నోయిడాలో కార్మికులపై జరుగుతున్న ప్రభుత్వ నిర్బంధ చర్యలను ఖండిస్తూ, ఈరోజు అనంతపురంలో అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించబడింది. అనంతరం కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎల్‌ఐసీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఏ ఐ సి సి టి టు జిల్లా అధ్యక్షుడు పరుశురాముడు , కన్వీనర్ పోల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, కార్మికుల హక్కులను హరించే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉన్నాయని విమర్శించారు. కార్మిక వర్గం దశాబ్దాల పోరాట ఫలితంగా సాధించుకున్న హక్కులను నిర్వీర్యం చేసే కుట్రలను కార్మిక లోకం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని హెచ్చరించారు.

అలాగే దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ పేరుతో కార్పొరేట్ శక్తులకు అప్పగించడం ప్రజా ఆస్తుల దోపిడీకి దారితీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించాలని, ప్రతి కార్మికునికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

• కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ చట్టాలను వెంటనే రద్దు చేయాలి
• 8 గంటల పని విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలి
• ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలి
• కనీస వేతనం రూ.26,000 చెల్లించాలి
• కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి
ఈ కార్యక్రమంలో సీపీఐ (యమ్ యల్) లిబరేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు టి ఎస్ వలి, కార్యదర్శి వేమన, ఏ ఐ సి సి టి యు సంఘాల నాయకులు గౌస్ , శివ ప్రసాద్ , మహబూబ్, విద్యార్థి సంఘం కన్వీనర్ కె. బాలక్రిష్ణ , మరియు అసిఫ్ ఇతర కార్మిక సంఘాల నాయకులు , ప్రజాసంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

. వరి రైతులను ఆదుకోవాలి - ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఖండిద్దాం!అనంతపురం జిల్లా వ్యాప్తంగా వరి సాగు చేస్తున్న రైతాంగం నేడు ...
07/05/2026

.
వరి రైతులను ఆదుకోవాలి - ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఖండిద్దాం!

అనంతపురం జిల్లా వ్యాప్తంగా వరి సాగు చేస్తున్న రైతాంగం నేడు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది.

అన్నం పెట్టే అన్నదాతను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది!

రైతు కష్టం... వ్యాపారుల పాలు!

పెరిగిన భారాలు: సాగు ఖర్చులు, కూలీల రేట్లు, ఎరువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
*దోపిడీ: మార్కెట్‌లో 80 కేజీల బస్తా కేవలం **₹1200 – ₹1400**లకే కొనుగోలు చేస్తూ వ్యాపారులు రైతులను నిలువునా ముంచుతున్నారు.
* **ప్రభుత్వ వైఖరి:** వ్యాపారుల దోపిడీకి ప్రభుత్వం మౌనంగా మద్దతు పలుకుతోంది.
🚩 మా డిమాండ్లు:**
1️⃣ వరి ధాన్యానికి క్వింటాలుకు **₹2400 గిట్టుబాటు ధర**ను వెంటనే ప్రకటించాలి.
2️⃣ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను (Rice Procurement Centers) యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలి.
3️⃣ తీవ్ర నష్టాల్లో ఉన్న **కౌలు రైతులకు** ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాలి.
4️⃣ దళారులు, వ్యాపారుల దోపిడీని అరికట్టి రైతులకు న్యాయం చేయాలి.
రైతు వ్యతిరేక విధానాలపై గళమెత్తుదాం! అన్నదాత పోరాటంలో భాగస్వాములవుదాం!

**సిపిఐ (యం.యల్) లిబరేషన్ పార్టీ,**
**అనంతపురం జిల్లా కమిటీ.**

05/05/2026

Remembering Karl Marx
05 May 1818 - 14 March 1883

One of the greatest thinkers to have ever lived - on his 208th birth anniversary. "The philosophers have only interpreted the world, in various ways. The point, however, is to change it."

AISA

*అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రకటన**— సెంట్రల్ కమిటీ, సిపిఐ (యమ్.యల్) లిబరేషన్*అస్సాం, వెస్ట్ బెంగాల్, కేరళ, తమిళనాడు, పు...
04/05/2026

*అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రకటన*
*— సెంట్రల్ కమిటీ, సిపిఐ (యమ్.యల్) లిబరేషన్*

అస్సాం, వెస్ట్ బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అనేక ఆశ్చర్యకర పరిణామాలను తీసుకువచ్చాయి. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్, తమిళనాడులో వచ్చిన ఫలితాలు షాక్‌కు గురిచేశాయి. వెస్ట్ బెంగాల్ ఎన్నికల చరిత్రలో తొలిసారిగా బీజేపీ అధికారంలోకి రావడం జరిగింది. అలాగే తమిళనాడులో సినిమా నటుడు విజయ్ నాయకత్వంలో కొత్త పార్టీ TVK ఎదిగి, గత ఆరు దశాబ్దాలుగా కొనసాగుతున్న ద్రావిడ రాజకీయ ఆధిపత్యానికి ముగింపు పలికింది.

ఈ ఫలితాలు సాధారణ పరిస్థితుల్లో రాలేదని గుర్తించాలి. వెస్ట్ బెంగాల్‌లో 90 లక్షలకు పైగా, తమిళనాడులో 70 లక్షలకు పైగా ఓటర్లను ఎన్నికల ప్రక్రియ నుంచి తప్పించడం జరిగింది. అస్సాంలో నియోజకవర్గాల పునర్విభజన (delimitation) కూడా విచిత్రంగా జరిగింది. వెస్ట్ బెంగాల్‌లో SIR ప్రక్రియలో ‘లాజికల్ డిస్క్రిపెన్సీ’ పేరుతో అదనపు ఫిల్టర్లు పెట్టి, 30 లక్షలకు పైగా ఓటర్లను ఓటు హక్కు నుంచి దూరం చేశారు. అంతేకాకుండా, భారీగా కేంద్ర జోక్యం, అధిక స్థాయిలో పరామిలిటరీ బలగాల మోహరింపు మధ్య ఎన్నికలు నిర్వహించబడ్డాయి.

ఈ విధంగా ముందే ప్రణాళికాబద్ధంగా చేసిన ఎన్నికల లోపభూయిష్ట చర్యలు, అలాగే బంగ్లాదేశ్ నుంచి చొరబాటు జరుగుతోందనే భయాన్ని రెచ్చగొట్టి, ఇస్లామోఫోబియా వంటి అపోహలను వ్యాప్తి చేస్తూ ప్రజలను మత ఆధారంగా విభజించడం ఇవి అన్నీ కలిసి, మరోవైపు TMC ప్రభుత్వంపై ప్రజల్లో పెరిగిన అసంతృప్తి ఈ కారణాల వల్ల వెస్ట్ బెంగాల్‌లో బీజేపీకి అనూహ్య విజయం సాధ్యమైంది.

ఈ ఫలితాలతో ధైర్యం పొందిన బీజేపీ, దేశంలో సంపూర్ణ అధికార కేంద్రీకరణ, ప్రజల ఓటు హక్కులను మరింత కుదించడం, మైనారిటీ వర్గాలపై దాడులు, ప్రజా ఉద్యమాలను అణచివేయడం వంటి ప్రమాదకర రాజకీయ అజెండాను మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది.

ఈ పరిస్థితుల్లో వామపక్ష, ప్రజాస్వామ్య శక్తులు అన్ని ఒకటిగా చేరి, ప్రజలతో కలిసి ఈ ఫాసిస్టు ధోరణులనకు వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగించాలి.

*కేంద్ర కమిటీ*
*సిపిఐ (యమ్ యల్) లిబరేషన్*

Statement on the Assembly Election Results
The elections to Assam, West Bengal, Kerala, Tamil Nadu and Puducherry Assemblies have produced a string of shocking outcomes, especially in West Bengal and Tamil Nadu. For the first time in the electoral history of West Bengal, the BJP has come to power while Tamil Nadu witnessed the rise of a new party TVK under the leadership of filmstar Joseph Vijay Chandrasekhar ending the alternating political domination of the DMK and AIADMK over the last six decades.

It must be noted that the results have come in the wake of mass exclusion of voters to the tune of more than nine million in West Bengal and more than seven million in Tamil Nadu and extremely bizarre delimitation of constituencies in Assam. Extra filters were added in the West Bengal SIR process in the name of 'logical discrepancy' and more than three million voters were deprived in the process of their voting right. On top of this electoral purge, the elections were conducted in the shadow of massive central intervention and unprecedented induction of paramilitary forces.

It is this calculated act of electoral subversion, and the mobilisation of considerable sections of the electorate on communal lines using the bogey of infiltration from Bangladesh, and other Islamophobic myths, which, coupled with the accumulated anger of the people against the misrule of the TMC, has resulted in the BJP's unexpected scale of victory in West Bengal.
An emboldened BJP will try to use the poll outcome to further its sinister political agenda of complete capture and centralisation of power, further disenfranchisement and ethnic cleansing, and silencing of people's protests through heightened repression and political witch hunt. Left and progressive forces must close ranks and stand with the people to resist this fascist design.

-- Central Committee, CPIML Liberation | cpiml.org

*అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రకటన**— సెంట్రల్ కమిటీ, సిపిఐ (యమ్.యల్) లిబరేషన్*అస్సాం, వెస్ట్ బెంగాల్, కేరళ, తమిళనాడు, పు...
04/05/2026

*అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రకటన*
*— సెంట్రల్ కమిటీ, సిపిఐ (యమ్.యల్) లిబరేషన్*

అస్సాం, వెస్ట్ బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అనేక ఆశ్చర్యకర పరిణామాలను తీసుకువచ్చాయి. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్, తమిళనాడులో వచ్చిన ఫలితాలు షాక్‌కు గురిచేశాయి. వెస్ట్ బెంగాల్ ఎన్నికల చరిత్రలో తొలిసారిగా బీజేపీ అధికారంలోకి రావడం జరిగింది. అలాగే తమిళనాడులో సినిమా నటుడు విజయ్ నాయకత్వంలో కొత్త పార్టీ TVK ఎదిగి, గత ఆరు దశాబ్దాలుగా కొనసాగుతున్న ద్రావిడ రాజకీయ ఆధిపత్యానికి ముగింపు పలికింది.

ఈ ఫలితాలు సాధారణ పరిస్థితుల్లో రాలేదని గుర్తించాలి. వెస్ట్ బెంగాల్‌లో 90 లక్షలకు పైగా, తమిళనాడులో 70 లక్షలకు పైగా ఓటర్లను ఎన్నికల ప్రక్రియ నుంచి తప్పించడం జరిగింది. అస్సాంలో నియోజకవర్గాల పునర్విభజన (delimitation) కూడా విచిత్రంగా జరిగింది. వెస్ట్ బెంగాల్‌లో SIR ప్రక్రియలో ‘లాజికల్ డిస్క్రిపెన్సీ’ పేరుతో అదనపు ఫిల్టర్లు పెట్టి, 30 లక్షలకు పైగా ఓటర్లను ఓటు హక్కు నుంచి దూరం చేశారు. అంతేకాకుండా, భారీగా కేంద్ర జోక్యం, అధిక స్థాయిలో పరామిలిటరీ బలగాల మోహరింపు మధ్య ఎన్నికలు నిర్వహించబడ్డాయి.

ఈ విధంగా ముందే ప్రణాళికాబద్ధంగా చేసిన ఎన్నికల లోపభూయిష్ట చర్యలు, అలాగే బంగ్లాదేశ్ నుంచి చొరబాటు జరుగుతోందనే భయాన్ని రెచ్చగొట్టి, ఇస్లామోఫోబియా వంటి అపోహలను వ్యాప్తి చేస్తూ ప్రజలను మత ఆధారంగా విభజించడం ఇవి అన్నీ కలిసి, మరోవైపు TMC ప్రభుత్వంపై ప్రజల్లో పెరిగిన అసంతృప్తి ఈ కారణాల వల్ల వెస్ట్ బెంగాల్‌లో బీజేపీకి అనూహ్య విజయం సాధ్యమైంది.

ఈ ఫలితాలతో ధైర్యం పొందిన బీజేపీ, దేశంలో సంపూర్ణ అధికార కేంద్రీకరణ, ప్రజల ఓటు హక్కులను మరింత కుదించడం, మైనారిటీ వర్గాలపై దాడులు, ప్రజా ఉద్యమాలను అణచివేయడం వంటి ప్రమాదకర రాజకీయ అజెండాను మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది.

ఈ పరిస్థితుల్లో వామపక్ష, ప్రజాస్వామ్య శక్తులు అన్ని ఒకటిగా చేరి, ప్రజలతో కలిసి ఈ ఫాసిస్టు ధోరణులనకు వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగించాలి.

*కేంద్ర కమిటీ*
*సిపిఐ (యమ్ యల్) లిబరేషన్*

*మే డే వర్ధిల్లాలి!**రాష్ట్ర వ్యాప్తంగా AICCTU - CPIML లిబరేషన్* ఆధ్వర్యంలో ప్రపంచ కార్మికుల దినోత్సవం 2026 మే 1 అంతర్జా...
02/05/2026

*మే డే వర్ధిల్లాలి!*

*రాష్ట్ర వ్యాప్తంగా AICCTU - CPIML లిబరేషన్* ఆధ్వర్యంలో ప్రపంచ కార్మికుల దినోత్సవం

2026 మే 1 అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా AICCTU, వ్యవసాయ కూలీ సంఘం , సిపిఐ (యమ్ యల్) లిబరేషన్ నాయకులు పాల్గొన్నారు

కేంద్రంలో మోడీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, కార్పొరేట్ అనుకూల కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లును తెచ్చిందని వాటిని రద్దు చేయాలని, కార్మిక చట్టాలను యదావిధిగా అమలు చేయాలని, వి.బి గ్రామ్ జీ చట్టాన్ని రద్దు చేసి, ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేసి, 200 రోజులు పని, 600 రూ. కనీస వేతనం ఇవ్వాలని,12 గంటల పని విధానాన్ని రద్దు చేసి 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని, పెళ్ళైన ప్రతీ కుటుంబానికి జాబ్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రంలో ఆర్.ఎస్.ఎస్ – బి.జె.పి, మోడీ విధానాలను తూచా తప్పకుండా రాష్ట్రంలో అమలు చేస్తున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వ కార్మిక, ప్రజా విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు, ప్రజలు తమ హక్కులు సాదించుకోవాలంటే ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు.

*AICCTU మరియు సిపిఐ (యమ్ యల్) లిబరేషన్, రాష్ట్ర కమిటీలు*

#మేడే #కార్మికులదినోత్సవం

*మే డే 2026 ప్రతిజ్ఞ**ఏప్రిల్ 1 నుండి మోదీ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన కొత్త కార్మిక చట్టాల (Labour Codes) తర్వాత మనం జరు...
30/04/2026

*మే డే 2026 ప్రతిజ్ఞ**

ఏప్రిల్ 1 నుండి మోదీ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన కొత్త కార్మిక చట్టాల (Labour Codes) తర్వాత మనం జరుపుకుంటున్న మొదటి అంతర్జాతీయ కార్మిక దినోత్సవం లేదా మే డే ఇది. కార్మిక హక్కుల ప్రమాణాలను పెంపొందించడానికి మరియు వాటి అమలును మెరుగుపరచడానికి బదులుగా, ఈ కొత్త చట్టాలు భారతదేశంలోని విస్తృత కార్మిక వర్గాన్ని ఒక రకమైన 'కార్పొరేట్ జంగిల్ రాజ్'కు, అంటే యజమానుల నిర్బంధ నియంతృత్వానికి గురిచేస్తున్నాయి. ఎనిమిది గంటల పని దినం అనేది ఇకపై విశ్వవ్యాప్త హక్కు కాదు; కాంట్రాక్ట్ పని మరియు గిగ్ ఎకానమీ (Gig Economy) కాలంలో అది ఇప్పుడు ఒక విలాసంగా మారిపోయింది. పని గంటలు పెరగడం వల్ల అదనపు వేతనం (Overtime) రాకపోగా, అది కేవలం శ్రమ దోపిడీకి మాత్రమే దారితీస్తోంది. యూనియన్ల ఏర్పాటు ఇప్పుడు గతంలో కంటే కష్టతరమైంది, సామూహిక బేరసారాల శక్తి (Collective Bargaining Power) పూర్తిగా క్షీణించింది, అదే సమయంలో యజమానులు ఉద్యోగులను ఎప్పుడైనా తొలగించే అధికారాన్ని పొందారు.
ఈ కొత్త 'బానిసత్వ చట్టాల' అమలు, అమెరికా-ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య యుద్ధం వల్ల తలెత్తిన ఆకస్మిక ఆర్థిక సంక్షోభం మరియు అంతరాయాలతో ఏకకాలంలో జరిగింది. ఇంధన సంక్షోభం కారణంగా అనేక పరిశ్రమలు ఉత్పత్తిని తగ్గించడం లేదా మూసివేయడం ప్రారంభించాయి. గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుండి వలస కార్మికులు మళ్లీ ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, జార్ఖండ్ మరియు పశ్చిమ బెంగాల్‌లోని తమ స్వగ్రామాలకు తిరిగి వెళ్లవలసి వస్తోంది. వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ NCR ప్రాంతంలో మరియు దేశవ్యాప్త పారిశ్రామిక కేంద్రాలలో కాంట్రాక్ట్ కార్మికుల భారీ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. NCR ప్రాంతంలోని అత్యల్ప వేతనాలు పొందే, అభద్రతతో కూడిన కార్మికులు తమ మనుగడ కోసం ఎందుకు పోరాడుతున్నారో అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు, కానీ ఉత్తరప్రదేశ్‌లోని మోదీ-యోగి 'డబుల్ ఇంజిన్' సర్కార్‌కు ఈ కార్మిక నిరసనలు 'దేశద్రోహ కుట్ర'గా కనిపిస్తున్నాయి! కార్మికుల పక్షాన నిలిచే కార్యకర్తలను 'మాస్టర్‌మైండ్‌లు'గా చిత్రీకరిస్తూ, వారు కార్మికులను రెచ్చగొడుతున్నారని మరియు భారతదేశం యొక్క ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని ఆరోపిస్తూ అక్రమంగా అరెస్టు చేస్తున్నారు. రైతు ఉద్యమంపై అమానుష అణచివేతను ప్రయోగించడానికి సాహసించని ప్రభుత్వం, కార్మికుల నిరసనలను మాత్రం పాశవిక బలంతో అణచివేయడానికి ప్రయత్నిస్తోంది.
పెట్టుబడిదారీ ప్రపంచంలో ప్రాథమిక కార్మిక హక్కులను సాధించుకోవడానికి మరియు ఒక క్రమబద్ధమైన వ్యవస్థను నెలకొల్పడానికి అంతర్జాతీయ కార్మిక వర్గం దశాబ్దాల పాటు సాగించిన పట్టుదల కలిగిన పోరాటాలు, త్యాగాలు అవసరమయ్యాయి. ఎనిమిది గంటల పని దినం అనేది పెట్టుబడిదారీ వ్యవస్థ ఇచ్చిన కానుక కాదు; అది 1886 మే నెలలో చికాగో హేమార్కెట్ అమరవీరుల సర్వోన్నత త్యాగం మరియు సుదీర్ఘ పోరాటాల ఫలితంగా సాధించుకున్న హక్కు. కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ మరియు ఐరోపా, అమెరికాలోని ఇతర సోషలిస్టు మార్గదర్శకుల నాయకత్వంలో 'ఫస్ట్ ఇంటర్నేషనల్' (1864-1872) ఆధ్వర్యంలో అంతర్జాతీయ సంఘీభావం పెరిగిన తర్వాత, హేమార్కెట్ ఊచకోత మరియు కార్మిక నాయకుల ఉరిశిక్షలు అంతర్జాతీయ కార్మిక పోరాటాలకు గొప్ప ఊపునిచ్చాయి. 1889 నాటికి మే డే అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా గుర్తింపు పొందింది.
భారతదేశంలో కూడా ఎనిమిది గంటల పని దినం కోసం పోరాటం అదే సమయంలో ప్రారంభమైంది. రైల్వేల నుండి వస్త్ర పరిశ్రమ వరకు, కార్మికులు సమ్మెలు చేయడం మరియు యూనియన్లను ఏర్పాటు చేయడం ప్రారంభించారు. 1918 నాటికి మద్రాస్ లేబర్ యూనియన్ రూపంలో భారతదేశంలో మొదటి వ్యవస్థీకృత కార్మిక సంఘం ఏర్పడింది మరియు 1920 నాటికి 'ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్' (AITUC) కింద మొదటి జాతీయ కేంద్రం ఉద్భవించింది. 1881 ఫ్యాక్టరీల చట్టం నుండి 1923 వర్క్‌మెన్ కాంపెన్సేషన్ చట్టం మరియు 1926 ట్రేడ్ యూనియన్ల చట్టం వరకు - ఆ కాలంలో రూపొందించబడిన కార్మిక చట్టాలన్నీ కార్మిక వర్గం యొక్క పెరుగుతున్న చైతన్యం మరియు పోరాటాల ఫలితమే. 1930 మరియు 1940లలో కమ్యూనిస్ట్ పార్టీ, అంబేద్కర్ యొక్క ఇండిపెండెంట్ లేబర్ పార్టీ, అలాగే కాంగ్రెస్ లోపల మరియు వెలుపల ఉన్న శక్తివంతమైన వామపక్ష సోషలిస్ట్ ధోరణుల పెరుగుదలతో ఈ ప్రక్రియ మరింత వేగవంతమైంది.
కొత్త కార్మిక చట్టాల అమలు మరియు కార్మిక వ్యతిరేక అణచివేతతో, భారత కార్మిక వర్గ ఉద్యమం సాధించిన చారిత్రాత్మక విజయాలను తుడిచిపెట్టడానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విప్లవాత్మక కమ్యూనిస్టులు కాంట్రాక్ట్ కార్మికుల, ముఖ్యంగా యువత మరియు మహిళా కార్మికుల పోరాటాలను ఒక శక్తివంతమైన రాజకీయ ప్రవాహంగా మలచడం ద్వారా మరియు రైతులు, విద్యార్థులు, కార్మికుల మధ్య సేంద్రీయ సంఘీభావాన్ని పెంపొందించడం ద్వారా ఈ కుట్రను తిప్పికొట్టాలి. స్వాతంత్ర్యానికి పూర్వం హిందుత్వ మతవాదం మరియు బ్రిటిష్ వలసవాదం మధ్య ఉన్న సహకారం లాగే, నేటి భారతీయ ఫాసిస్టుల సామ్రాజ్యవాద అనుకూల స్వభావం మరోసారి బహిర్గతమైంది. మోదీ ప్రభుత్వం మరియు ఆర్ఎస్ఎస్ (RSS) అమెరికా-ఇజ్రాయెల్ కూటమితో కుమ్మక్కైన తీరు స్పష్టంగా కనిపిస్తోంది. కార్మిక హక్కుల కోసం సాగే పోరాటం, ఫాసిస్టు వ్యతిరేక మరియు సామ్రాజ్యవాద వ్యతిరేక ప్రతిఘటనగా ఎదగాలి మరియు ఈ నవతరం స్వాతంత్ర్య ఉద్యమంలో భారతదేశాన్ని ముందుకు నడిపించాలి.

*కామ్రేడ్ దీపాంకర్ భట్టాచార్య*
జాతీయ ప్రధాన కార్యదర్శి
సిపిఐ (యమ్ యల్) లిబరేషన్

Address

Venugopal Nagar
Anantapur
5150001

Alerts

Be the first to know and let us send you an email when CPIML Liberation - Anantapur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share