ITDP Jangaon

ITDP Jangaon జనగామ నియోజకవర్గం

ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ద్వారకాపురం, దిల్సుఖ్నగర్ & లక్ష్మీనగర్ కొత్తపేట్ కాలనీ ప్రతినిధులు లతో కలసి వందే...
15/08/2026

ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ద్వారకాపురం, దిల్సుఖ్నగర్ & లక్ష్మీనగర్ కొత్తపేట్ కాలనీ ప్రతినిధులు లతో కలసి వందేమాతరం గీతపాలన చేసి జాతీయజెండ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వెంకట్ గాంధీ గారు మరియు పార్టీ నాయకులు.

బోడుప్పల్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు**జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన టిడిపి మల్కాజ...
15/08/2026

బోడుప్పల్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు*
*జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన టిడిపి మల్కాజ్గిరి పార్లమెంట్ నాయకులు వసునూరి సన్నీ గారు*
*జాతీయ జెండా సృష్టికర్త అయిన పింగళి వెంకయ్య మన తెలుగువాడు కావడం మన తెలుగు జాతికి గౌరవం వారికి భారతరత్న ఇచ్చి కేంద్ర ప్రభుత్వం గౌరవించాలి - సన్నీ*
బోడుప్పల్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు ముఖ్యఅతిథిగా పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ నాయకులు వాసు సన్నీ గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సన్నీ గారు మాట్లాడుతూ ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితమే ఈ స్వతంత్ర భారతమని, వారి ఆశయాలు కనుగుణంగా భారతదేశాన్ని మరింత ముందు తీసుకపోవడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అలాగే జాతీయ జెండా సృష్టికర్త అయిన పింగళి వెంకయ్య గారు మన తెలుగు వాడు కావడం మనకు ఎంతో గర్వకారణం అని, ఆయనకు కేంద్ర ప్రభుత్వం భారత రత్న ఇచ్చి గౌరవించాలని కోరారు. ఈ వేడుకలు టిడిపి నాయకులు బద్దుల గాలయ్య, ఆశీర్వాదం గారు, శ్రీకాంత్ గారు, రామోల శ్రవణ్ గారు, అరుణ్, నాగరాజ్, మిశ్రా, శ్రీనివాస్ మరియు ఇద్దరు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

*80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించిన తెలుగు దేశం పార్టీ - వంచ శ్రీనివాస్ రెడ్డి*80వ స్వాతంత్ర్య దినోత్సవ...
15/08/2026

*80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించిన తెలుగు దేశం పార్టీ - వంచ శ్రీనివాస్ రెడ్డి*
80వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్బంగా ప్రజలకు, పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలియ జేస్తూ కరీంనగర్ తెలుగు దేశం పార్టీ పార్లమెంట్ నియోజక వర్గ కన్వీనర్ శ్రీ వంచ శ్రీనివాస్ రెడ్డి గారుపార్లమెంట్ నియోజక వర్గ కార్యాలయంలో జాతీయ జెండా ఎగుర వేసి "స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన సమర యోధులకు ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం వారు మాట్లాడుతూ "దేశభక్తి, జాతీయ సమైఖ్యత, దేశం పై మమకారాన్ని చాటుతూ, ప్రతి ఒక్కరు జాతీయ జెండా పట్ల గౌరవాన్ని, దేశ భక్తిని ,చాటుతూ నూతన ఉత్సహంతో ఈ వేడుకల్లో పాల్గొని స్వాతంత్య్రం సాధించుటకు మహనీయులు చేసిన త్యాగలను స్మరించుకుంటూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే భాద్యత మనందరిపైన ఉందని వంచ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
ఇట్టి కార్యక్రమంలో అడ్ హాక్ కమిటీ మెంబెర్ రొడ్డ శ్రీనివాస్, రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి దామెర సత్యం,మాజీ జెనరల్ సెక్రటరీ నాగుల బాలగౌడ్,మాజీ ఉపాధ్యక్షులు సందబోయిన రాజేశం,బీసీ సేల్ మాజీ కార్యదర్శి ఇట్టామల్లేశం,వాణిజ్య సేల్ మాజీ కార్య దర్శి ఎల్లిమిళ్ల కిషన్,రాష్ట్ర కార్యదర్శి ఐటీడీపి ఎర్రవెల్లి రవీందర్, తెలుగు యువత రాష్ట్ర మాజీ కార్యదర్శి ఎర్రవెల్లి వినీత్, నగర మాజీ అధ్యక్షులు రొడ్డ శ్రీధర్,పార్లమెంట్ మాజీ అధికార ప్రతినిధి లొంక భాస్కర్ శర్మ,దాసరి రామకృష్ణ రెడ్డి, కళ్యాడప్ నరేష్, ఆకుల కాంతయ్య, నూనె రజిత,వడ్కాపురం లక్ష్మిరాజ్యం, ఎన్నం రమేష్,పెరుమాండ్ల సతీష్ గౌడ్, బి. రాజేశం తదితర నాయకులు పాల్గొని విజయవంతం చేసారు.

*మహబూబ్నగర్ పట్టణంలోని టిడిపి ఆఫీసు ఆవరణలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు**దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శు...
15/08/2026

*మహబూబ్నగర్ పట్టణంలోని టిడిపి ఆఫీసు ఆవరణలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు*
*దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు*
*సకల వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగాలి టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు బక్కని నరసింహులు..*
భారతదేశం 80వ స్వాతంత్ర్య సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణంలోని టిడిపి కార్యాలయంలో ఘనంగా జెండా ఆవిష్కరణ,తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలోని అన్ని కులాలు, మతాలు, వర్గాల ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని గుర్తుచేసుకుంటూ, దేశాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.
దేశాభివృద్ధికి ప్రేమ, సౌభ్రాతృత్వం, వివేకం, సహనం, పరోపకారం, త్యాగం వంటి విలువలను అలవర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశంలోని సహజ వనరులు అందరికీ సమానంగా అందేలా చర్యలు తీసుకోవాలని, స్వామినాథన్ కమిషన్ సూచనల ప్రకారం భూమిలేని నిరుపేదలకు ప్రభుత్వ సీలింగ్ భూములు, భూదాన్ భూములను పంపిణీ చేయాలని కోరారు.
పూర్వీకులు నిర్మించిన చెరువులు, కుంటలు, పాఠశాలలు, ఇతర ప్రజా వనరులను పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. సహజ వనరుల్లో కీలకమైన గుట్టలు, కొండలను కాపాడుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రజా సంక్షేమం, ప్రకృతి పరిరక్షణ, గ్రామీణాభివృద్ధి, విద్య, మహిళా సాధికారత, అంటరానితనం నిర్మూలన వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ పలు కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. ‘జన్మభూమి’, ‘ప్రజల వద్దకు పాలన’ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు పాలనను చేరువ చేసే ప్రయత్నాలు జరిగాయని పేర్కొన్నారు.
తెలంగాణలో పార్టీ అధికారంలో లేకపోయినా పార్టీ సభ్యత్వం కలిగి ఉండి ప్రమాదవశాత్తు మరణించిన వారికి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి నాయకత్వంలో 515 మందికి రూ.10,14,960 ఆర్థిక సహాయం అందించడం జరిగిందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు స్థాపించిన ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా, శ్రీమతి నారా భువనేశ్వరి గారి ఆధ్వర్యంలో తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ విద్యార్థులకు చేయూత అందించడం జరిగిందన్నారు. 560 మంది విద్యార్థినీ, విద్యార్థులకు ఉచిత విద్య అందించడం గర్వించదగిన విషయమని పేర్కొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ నియోజకవర్గ ఏరియా ఆసుపత్రికి రూ.50 లక్షలతో ఆక్సిజన్ ప్లాంట్ సమకూర్చినట్లు తెలిపారు. అలాగే మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం కోస్గి మండలంలో శ్రీమతి భువనేశ్వరి గారి ఆధ్వర్యంలో 23-01-2017న పాడి పశువుల కొనుగోలుకు 179 మందికి రూ.78 లక్షల ఆర్థిక సహాయం అందించినట్లు వివరించారు.
అదేవిధంగా నిర్వహించిన పశు ఆరోగ్య శిబిరంలో 165 పశువులకు చికిత్స, 106 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.
తెలుగుదేశం పార్టీ సకల వర్గాల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తుండటం అభినందనీయమని పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని సమానత్వం, సోదరభావం, సామాజిక న్యాయంతో దేశాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు బక్కని నరసింహులు గారితో పాటుగా ఆర్ బాలప్ప,బుజగౌని సాయన్న గౌడ్,శ్రీ వెంకటయ్య సాగర్,కేశవులు, మురళి,కిట్టు,చెన్నయ్య,యాకూబ్ సాబ్,శ్రీనివాస్ గౌడ్ గారుమొదలగు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది

మిర్యాలగూడ తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో 80వ స్వాసంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మిర్యాలగూడ నియోజకవర...
15/08/2026

మిర్యాలగూడ తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో
80వ స్వాసంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మిర్యాలగూడ నియోజకవర్గం ఇంచార్జి కేంద్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమం లో పట్టణ పార్టీ కన్వీనర్ వడ్డెబోయిన శ్రీనివాస్
మైనారిటీ నాయకులు నసీరొద్దీన్ బాబా ఏచూరి అనంతరాములు ఉప్పలపాటి గోపాలకృష్ణ మచ్చా సైదులు గంధం శ్రీనివాస్, ఐటిడిపి నాయకులు రావిరాల నాగేందర్, గర్దాస్ ప్రభాకర్ చవల వెంకటేశ్వర్లు అనుముల సైదులు శ్రీకాంత చారిపొనుగోటి వెంకటేశ్వర్రావు సీనియర్ నాయకులు కస్తూరి సత్యనారాయణ నుసుమ్ నగేష్ పోగుల సైదులు గౌడ్ బంటు మణి నాయకులు అభిమానులు పాల్గొన్నారు.

నామాలగుండు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘన...
15/08/2026

నామాలగుండు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగినది.

చిలకల్ గూడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘన...
15/08/2026

చిలకల్ గూడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగినది.

అడ్డగుట్టలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘ...
15/08/2026

అడ్డగుట్టలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగినది.

వారాసిగూడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనం...
15/08/2026

వారాసిగూడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగినది.

Address

Bhongir
506167

Website

Alerts

Be the first to know and let us send you an email when ITDP Jangaon posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share