Telugu Desam Party: Eluru

Telugu Desam Party: Eluru Official Page of TDP Eluru

03/08/2026

ఈ రెండేళ్లలో రాయలసీమను గ్రోత్ ఇంజిన్ గా మారుస్తున్నాం..
రాయలసీమలో సాగునీటి విప్లవం కోసం రెండేళ్లలో 12 వేల కోట్లు ఖర్చు పెట్టాం..

రాయలసీమను హార్టికల్చర్ గా హబ్ గా మారుస్తూ లక్షకోట్లతో ప్రత్యేక మిషన్ చేపట్టాం..
రాయలసీమలో 4.63 లక్షల కోట్ల పెట్టుబడులతో పారశ్రామిక అద్భుతాలు సృష్టిస్తున్నాం..







03/08/2026

ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి ఇంట్లో ఎవరూ లేని సమయంలో కులం పేరుతో తనను దూషించాడని, దాడి చేశాడని.. తన భర్తను చంపేస్తామని హెచ్చరించారని దళిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.




03/08/2026

ఇంతపెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ రావడం చూస్తే గూస్ బంప్స్ వస్తున్నాయి..
ఇంకా మంచి మంచి కంపెనీలను కూడా చంద్రబాబు గారు తీసుకొస్తారని నమ్ముతున్నాను.

ఈ ఎయిర్ పోర్ట్ తో చాలా మందికి ఎంప్లాయ్‌మెంట్ కూడా దొరుకుతుంది.. చాలా గ్రేట్ థింగ్!








03/08/2026

జగన్ ఎర్ర బస్సు రాదన్నాడు
సీబీఎన్ గారి విజన్ ఎయిర్ బస్ దింపింది.







•పొగాకు రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శుభవార్త చెప్పాయి. ప్రతి రైతుకు రూ.50 వేల వడ్డీలేని రుణం అందించనుండగా, రెండే...
03/08/2026

•పొగాకు రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శుభవార్త చెప్పాయి. ప్రతి రైతుకు రూ.50 వేల వడ్డీలేని రుణం అందించనుండగా, రెండేళ్లలో తిరిగి చెల్లించే అవకాశం కల్పించారు. సుమారు 50 వేల మంది రైతులకు లబ్ధి చేకూర్చే ఈ పథకం ద్వారా రాష్ట్రానికి రూ.250 కోట్ల కేంద్ర రుణ సాయం అందనుంది

•ఆంధ్రప్రదేశ్–ఆస్ట్రేలియా భాగస్వామ్యానికి కొత్త ఊపు లభించింది. క్లీన్ ఎనర్జీ, అధునాతన తయారీ, విద్య, విద్యార్థుల మానసిక ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి వంటి కీలక రంగాల్లో సహకారం పెంచేందుకు ఏపీ ప్రభుత్వం ఆస్ట్రేలియాలోని ప్రముఖ సంస్థలతో నాలుగు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది

•ఉత్తరాంధ్ర అభివృద్ధికి మైలురాయిగా నిలిచే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో ఆ ప్రాంత ప్రజల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. లక్షలాది మంది హాజరైన ఈ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ విమానాశ్రయంపై విస్తృత చర్చ జరగడం విశేషం

•జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య 150వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఘనంగా నివాళులర్పించారు. జాతీయ పతాకాన్ని రూపుదిద్దిన పింగళి వెంకయ్య దేశభక్తిని ప్రజల్లో పెంపొందించి, దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు

•రాష్ట్రానికి అదనంగా రూ.4,597 కోట్ల పన్నుల వాటా కేటాయించినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అదనపు నిధులు రాష్ట్ర అభివృద్ధికి మరింత బలాన్నిస్తాయని పేర్కొన్నారు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/QoDpO



భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ సభా వేదికపై అతిరథ మహారథులు కొలువుదీరారు. ప్రధాని శ్...
02/08/2026

భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ సభా వేదికపై అతిరథ మహారథులు కొలువుదీరారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మంత్రి శ్రీ నారా లోకేష్ గారు, కేంద్ర మంత్రులు, జీఎంఆర్ ప్రతినిధులు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించారు. అనంతరం ఉత్తరాంధ్ర ప్రజలను ఉద్దేశించి ఉత్తేజభరితంగా ప్రసంగించారు.








02/08/2026

భోగాపురం గురించి ఇలా మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు భోగాపురం ఎయిర్ పోర్ట్ కి నేనే కర్త కర్మ క్రియ అంటుంటే ఏమనాలి? జగన్ చేసేది క్రెడిట్ చోరీ కాదా?







ఎర్రబస్సుకూడా రాని భోగాపురానికి ఎయిర్ పోర్టు ఎందుకు అన్నాడు జగన్. అంతేకాదు దాన్ని   దిక్కుమాలిన ఆలోచన అని కూడా అన్నాడు. ...
02/08/2026

ఎర్రబస్సుకూడా రాని భోగాపురానికి ఎయిర్ పోర్టు ఎందుకు అన్నాడు జగన్. అంతేకాదు దాన్ని దిక్కుమాలిన ఆలోచన అని కూడా అన్నాడు. అటువంటి చోటికి ఎయిర్ బస్ తీసుకొచ్చి తన విజన్ ని మరోసారి నిరూపించారు చంద్రబాబుగారు. విషయం ఏమంటే ఇప్పుడు ఆ క్రెడిట్ ను కొట్టేయడానికి జగన్ సిగ్గులేకుండా ఎగబడుతున్నాడు. దట్ ఈజ్ చంద్రబాబుగారు.








02/08/2026

థింసా నృత్యం రికార్డులు

భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి విచ్చేసిన ప్ర‌ధాని మోదీకి 13 వేల మందికి పైగా గిరిజ‌న విద్యార్థినులు, మ‌హిళ‌లు థింసా నృత్యంతో స్వాగ‌తించారు. సంస్కృతి-చ‌రిత్ర‌-సంప్ర‌దాయం క‌ల‌గ‌లిసిన వేడుక‌లో థింసా నృత్యం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచి వ‌ర‌ల్డ్ రికార్డులు నెల‌కొల్పింది. థింసా ప్ర‌ద‌ర్శించిన వారికి సీఎం ధ‌న్య‌వాదాలు తెలిపారు.








Address

Eluru

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Eluru posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Eluru:

Shortcuts

Share