BJP Erragadda Division

BJP Erragadda Division Bharatiya Janatha Party

02/09/2026

రేవంత్ పాలనతో విసిగిపోయిన ప్రజలు
1000 రోజుల దుర్మార్గ పాలనకు పండుగ చేసుకుంటున్న రేవంతాలు..

02/09/2026

హామీలపై రేవంత్ అబద్ధాలు
అసలు వాస్తవాలు చెబుతున్న ప్రజలు

గద్దెనెక్కి వెయ్యి రోజులు.. రాష్ట్రాన్ని గుల్ల చేస్తున్న కాంగ్రెస్ రాబందులుఢిల్లీ పెద్దలకు కాసుల మూటలు, రాష్ట్ర ప్రజానీక...
02/09/2026

గద్దెనెక్కి వెయ్యి రోజులు.. రాష్ట్రాన్ని గుల్ల చేస్తున్న కాంగ్రెస్ రాబందులు

ఢిల్లీ పెద్దలకు కాసుల మూటలు, రాష్ట్ర ప్రజానీకానికి కన్నీటి కష్టాలు..

'మార్పు' ముసుగులో రేవంత్ సర్కార్ సాగిస్తున్న దోపిడీ.. ఈ విధ్వంసక పాలనలో ఆగమాగమవుతున్న తెలంగాణ ప్రజలు..

02/09/2026

1000 రోజుల కాంగ్రెస్ పాలనలో ఏవీ రాలేవు.. ఇంకేవి రావు కూడా.

అందుకే హస్తం పాలనలో ఏదైనా రాదిక... రాదిక

02/09/2026

1000 రోజుల కాంగ్రెస్ పాలనలో
జల్సాలో హస్తం నేతలు
కష్టాల కాష్టంలో ప్రజలు
6 హామీలు అబద్ధాలైనవి
1001 మోసాలు బయటపడ్డవి
కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలనపై.. తిరుగుబాటు మొదలైంది
తరుముడే మిగిలింది

రూ. 4 వేల పెన్షన్ ఇస్తానంటూ ఆఖరకు వృద్దులను సైతం వంచించిన రేవంత్ రెడ్డి ఇది ప్రజా పాలన కాదు.. ప్రజా వ్యతిరేక పాలన
02/09/2026

రూ. 4 వేల పెన్షన్ ఇస్తానంటూ
ఆఖరకు వృద్దులను సైతం వంచించిన రేవంత్ రెడ్డి
ఇది ప్రజా పాలన కాదు.. ప్రజా వ్యతిరేక పాలన

01/09/2026

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ గుండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, ఈరోజు లిబర్టీ చౌరస్తాలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కును అడ్డుకోవడం, బీజేపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అణచివేత వైఖరికి నిదర్శనం.

అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అణచివేత చర్యలకు పాల్పడినా బీజేపీ పోరాటాన్ని ఆపలేరు!

23/08/2026

ఇదే సుస్పష్టమైన తేడా...!

వందేమాతర గేయాన్ని గౌరవించడంలోనూ జాతీయవాద భావజాలాన్ని దేశభక్తిని బలంగా అనుసరించడంలో బిజెపికి కాంగ్రెస్ పార్టీకి ఉన్న వ్యత్యాసం చాలా స్పష్టంగా కనిపిస్తుంది.

భారతమాతను స్తుతించడంలో మత వాదాన్ని కాంగ్రెస్ చూస్తుంటే భారత జాతి ఔన్నత్యాన్ని బిజెపి బలపరుస్తుంది

23/08/2026

గత బీఆర్ఎస్ పాలనలో ధరణి ద్వారా జరిగిన భూ అక్రమాలను సముద్రంలో పడేస్తామని చెప్పిన కాంగ్రెస్, ఇప్పుడు ‘భూభారతి’ పేరుతో అంతకంటే తీవ్రమైన దోపిడీకి పాల్పడుతోంది. కేవలం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే సుమారు 4 లక్షల ఎకరాల భూములను రాత్రికి రాత్రే అక్రమంగా 22A (నిషేధిత జాబితా) లోకి చేర్చారు. ప్రభుత్వ, దేవాదాయ భూములు మాత్రమే ఉండాల్సిన 22A లోకి దశాబ్దాలుగా మున్సిపల్ అనుమతులు పొంది, పన్నులు కడుతూ నివాసముంటున్న ప్రైవేటు ఇళ్లు, స్థలాలను ఉద్దేశపూర్వకంగా చేర్చి సెటిల్‌మెంట్ల పేరిట భారీగా లంచాలు డిమాండ్ చేస్తున్నారు.

23/08/2026

గతంలో కేసీఆర్ ప్రభుత్వం 'ధరణి' ద్వారా వేల ఎకరాల్లో భూదోపిడి చేస్తే... మేము భూ దోపిడిని అడ్డుకుంటాం అని చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కారు.. భూభారతి ద్వారా లక్షల ఎకరాలు దోచుకుంటోంది."పీనుగులుతినేవాడు పోయి ఏనుగులు తినేవాడు వచ్చినట్లు" తయారైంది పరిస్థితి.

Address

Hyderabad
500018

Website

Alerts

Be the first to know and let us send you an email when BJP Erragadda Division posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share