People's March Padayatra

People's March Padayatra 👣 109 Days | 1364 KM | people's march (2023) - Bhatti Vikramarka Mallu

05/04/2026

2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దడం మా లక్ష్యం.

సహజ వనరులు, నైపుణ్యం ఉన్న యువత, బలమైన మౌలిక సదుపాయాలతో ఇది సాధ్యమే.

10.7% వృద్ధి రేటుతో తెలంగాణ మరింత వేగంగా అభివృద్ధి చెందుతోంది.

హైదరాబాద్ ఐటీ, ఫార్మా, సర్వీసుల గ్లోబల్ హబ్‌గా నిలుస్తోంది.

ప్రగతే మా లక్ష్యం… విశ్వనగరం మన హైదరాబాద్.

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు గారి తనయుడు సూర్య – సాక్షిల వివాహ రిసెప్షన్ వేడుక హైదరాబాద్‌ శివార...
23/03/2026

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు గారి తనయుడు సూర్య – సాక్షిల వివాహ రిసెప్షన్ వేడుక హైదరాబాద్‌ శివారులో శుక్రవారం రాత్రి ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

అదేవిధంగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, దుదిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, గడ్డం వివేక్, మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు, జేడీ శీలం, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల, సిడబ్ల్యూసీ సభ్యులు రఘువీరా రెడ్డి, టీ సుబ్బిరామి రెడ్డి, గిడుగు రుద్రరాజు, సీపీఐ జాతీయ నాయకుడు కే నారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎంపీలు మల్లు రవి, సీఎం రమేష్, మాజీ ఎంపీలు కెవీపీ రామచంద్రరావు, ఉండవల్లి అరుణ్ కుమార్, లగడపాటి రాజగోపాల్, వి. హనుమంతరావు, విజయసాయిరెడ్డి, కేశినేని నాని, బీజేపీ జాతీయ నాయకుడు కే లక్ష్మణ్, వైఎస్సార్‌సీపీ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ, అంబటి రాంబాబు, బీఆర్‌ఎస్ నేతలు మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.

అలాగే ప్రముఖ సినీ నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్, డీజీపీ శివధర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు మరియు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై వధూవరులకు ఆశీస్సులు అందజేశారు.

ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అధికారులు భారీ సంఖ్యలో హాజరుకావడంతో కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.

23/03/2026

ప్రపంచంలోని ఏ అభివృద్ధి చెందిన దేశానికీ సాధ్యంకాని రీతిలో, కనివిని ఎరుగని ఒక మహాత్తర జీవిత బీమా పథకానికి ఈ బడ్జెట్ లో శ్రీకారం చుడుతున్నాం.

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం

తెలంగాణ బిడ్డలందరికీ సామాజిక భద్రత కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం. కుటుంబ పెద్దను కోల్పోయి ఏ పేద కుటుంబం కూడా ఆర్థికంగా రోడ్డున పడకూడదన్న ఉద్దేశంతో ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నాము.

సామాజిక అంతరాలతో సంబంధంలేకుండా పేద, మధ్యతరగతి, ధనిక అని తేడా చూడకుండా రాష్ట్రంలోని 1 కోటి 15 లక్షల కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 5లక్షల రూపాయల జీవిత బీమా అందించే విధంగా జూన్, 02, 2026 నుండి "ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం” ను నూతనంగా ప్రవేశపెడ్తున్నాము.

A revolutionary step toward universal social security! In a world-first initiative, the People's Government is launching a massive life insurance scheme to protect every family in Telangana
#ᴛʀᴇɴᴅɪɴɢɴᴏᴡ

16/03/2026

పాదయాత్రలో బాధలు విన్నాడు..
పరిపాలనలో బాసటగా నిలుస్తున్నాడు..

నా తెలంగాణ మట్టి బిడ్డలకు, నాతో నడిచిన అశేష జనవాహినికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.సరిగ్గా మూడేళ్ల క్రితం.. మార్చి 16...
16/03/2026

నా తెలంగాణ మట్టి బిడ్డలకు, నాతో నడిచిన అశేష జనవాహినికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.

సరిగ్గా మూడేళ్ల క్రితం.. మార్చి 16, 2023న మండుతున్న ఎండలు ఒకవైపు, గుండెల్లో రగులుతున్న ప్రజా సమస్యల ఆవేదన మరోవైపు. నన్ను కన్న ఈ నేల రుణం తీర్చుకోవాలనే తపనతో, అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు శ్రీకారం చుట్టాను.
అదిలాబాద్ అడవుల నుంచి ఖమ్మం గడ్డ వరకు ఆ 1364 కిలోమీటర్ల ప్రయాణం నా జీవితంలో మర్చిపోలేని ఒక మహాయజ్ఞం.

ఆనాడు పాదాలకు బొబ్బలు ఎక్కినా, శరీరం అలసిపోయినా నన్ను ముందుకు నడిపించింది మీ ఆత్మీయత మాత్రమే.

పల్లె పల్లెనా తల్లులు ఆశీర్వదిస్తూ పెట్టిన గోరుముద్దలు..

చెమట చిందిస్తూ పొలాల్లో కనిపించిన రైతన్న కరచాలనం..

ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ బిడ్డల చూపులు..

ఇవన్నీ నాలో నిరంతరం ఒకే సంకల్పాన్ని రగిలించాయి. ఎలాగైనా మన తెలంగాణలో సామాన్యుడి రాజ్యం రావాలని, పేదవాడి కళ్లల్లో ఆనందం చూడాలని అహర్నిశలూ శ్రమించాను.

ఈ రోజు మీ అందరి ఆశీస్సులతో మన ప్రజా ప్రభుత్వం కొలువుదీరింది. నేను నాడు పాదయాత్రలో ఏ కష్టాలనైతే కళ్లారా చూశానో, ఏ సమస్యలనైతే నా డైరీలో రాసుకున్నానో.. వాటన్నింటికీ పరిష్కారం చూపడమే నేడు నా ఏకైక లక్ష్యం. మన వనరులు మనకే దక్కాలి, మన ఆదాయం మన పేదలకే చేరాలి. తెలంగాణను ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దుతూనే, అట్టడుగున ఉన్న ప్రతి మనిషికి సంక్షేమ ఫలాలు అందించడమే ఈ ప్రభుత్వ ధ్యేయం.

నాడు ఎండనక, వాననక నా అడుగులో అడుగు వేసి, ఈ పీపుల్స్ మార్చ్‌ను ఒక ప్రజా ఉద్యమంగా మార్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకుడికి, అభిమానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు నాపై చూపిన నమ్మకం, నాపై కురిపించిన ప్రేమ వెలకట్టలేనివి.

మనం మొదలుపెట్టిన ఈ సంక్షేమ ప్రయాణం నిరంతరం కొనసాగుతుంది. ప్రజా సేవలో నా ఆఖరి శ్వాస వరకు మీ వెంటే ఉంటాను.

మీ భట్టి విక్రమార్క మల్లు
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి.

padayatra bharathjodoyatra fpy trendingnow trendingsong

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when People's March Padayatra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share