CPI LBNagar

CPI LBNagar LBNagar Constituency Committee

హయత్‌నగర్ ఇన్‌స్పెక్టర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు! 💐నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, హయత్‌నగర్ పరిధిలో కట్ట...
04/05/2026

హయత్‌నగర్ ఇన్‌స్పెక్టర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు! 💐

నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, హయత్‌నగర్ పరిధిలో కట్టుదిట్టంగా శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్న హయత్‌నగర్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ పల్సం నాగరాజు గౌడ్ గారి పుట్టినరోజు ను పురస్కరించుకుని ఈరోజు వారిని మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛం అందించి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన సీపీఐ ఎల్బీనగర్ నియోజకవర్గ కార్యదర్శి కామ్రేడ్ సామిడి శేఖర్ రెడ్డి గారు.

వృత్తిపట్ల ఎంతో అంకితభావం కలిగిన ఆయన.. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఎల్లప్పుడూ సంపూర్ణ ఆయురారోగ్యాలతో, ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.

ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ (AISF) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి సామిడి వంశీ వర్ధన్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బొంగు అరుణ్ కుమార్ గౌడ్, ఏఐవైఎఫ్ (AIYF) రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వెంకటేష్ మరియు ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఈనపల్లి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

01/05/2026

కష్టజీవుల త్యాగాలను స్మరించుకుంటూ… కార్మిక హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడుదాం!

వర్ధిల్లాలి కార్మిక ఐక్యత!

ఎల్బీనగర్ నియోజకవర్గమంతా రెపరెపలాడిన ఎర్రజెండా.. ఘనంగా 141వ మే డే వేడుకలు! ✊🚩ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా ఎల్బీన...
01/05/2026

ఎల్బీనగర్ నియోజకవర్గమంతా రెపరెపలాడిన ఎర్రజెండా.. ఘనంగా 141వ మే డే వేడుకలు! ✊🚩

ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని వివిధ కార్మిక అడ్డాలు, ఆసుపత్రులు, కాలనీల్లో ఏఐటీయూసీ (AITUC) మరియు సీపీఐ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కార్మిక జెండా పండుగను అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది.

హయత్‌నగర్ లేబర్ అడ్డా వద్ద గోల్కొండ నాగరాజు తదితరుల నేతృత్వంలో జరిగిన వేడుకల్లో, ఎల్బీనగర్ చౌరస్తాలో ఆటో ట్రాలీ యూనియన్ ఆధ్వర్యంలో, అలాగే వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కామ్రేడ్ సామిడి శేఖర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని కార్మిక జెండాలను ఆవిష్కరించారు.

అదే స్ఫూర్తితో.. చింతలకుంట శక్తినగర్ కాలనీలో ప్రెసిడెంట్ అజయ్ యాదవ్, ఆటోనగర్‌లో ఏఐటీయూసీ హయత్ నగర్ మండల గౌరవ అధ్యక్షుడు గోల్కొండ నాగరాజు, ఇసుక కార్మికుల అడ్డాలో ఏఐటీయూసీ హయత్ నగర్ మండల కార్యదర్శి పట్టేటి శేఖర్, మరియు సీపీఐ హయత్‌నగర్ మండల పార్టీ కార్యాలయంలో సీనియర్ నాయకులు అంబల రాములు గారు మే డే జెండాలను ఎగురవేసి శ్రమజీవుల త్యాగాలను స్మరించుకున్నారు.

కార్మిక వర్గ ఐక్యతను చాటిన ఈ వేడుకల్లో.. సీపీఐ హయత్‌నగర్ కార్యదర్శి శ్రీదేవి, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి సామిడి వంశీ వర్ధన్ రెడ్డి,మన్సూరాబాద్ డివిజన్ కార్యదర్శి కందుల సుధాకర్, ప్రజా నాట్యమండలి కళాకారులు సామ్యేల్, కవిత గార్లతో పాటు ఇతర నాయకులు జ్యోతి, పద్మ, సునీత, కృష్ణ, శ్రీకాంత్, సుబ్బారావు, రమేష్, గిరి, రామకృష్ణ, శ్రీను, వెంకట్, శ్యామల, కిరణ్, బీచ్‌పల్లి, శ్రీధర్ రెడ్డి, శంకర్, అంకన్న, సంజీవరెడ్డి మరియు పార్టీ మహిళా నాయకులు సౌజన్య, సుమతి, శివజ్యోతి, ఆదిలక్ష్మి, సుజాత, వెంకటమ్మ, యాదమ్మ, శోభ, రాణి, యశోద తదితరులు పాల్గొన్నారు.
వీరితో పాటు వివిధ కార్మిక సంఘాల నాయకులు, ఆటో డ్రైవర్లు, నిర్మాణ రంగ శ్రామికులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు.

కార్మిక ఐక్యత వర్ధిల్లాలి..

01/05/2026

141వ మే డే వర్ధిల్లాలి...

ప్రపంచ కార్మికులారా ఏకం కండి.. మే డే వర్ధిల్లాలి!రాబోయే కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని AITUC హయత్ నగర్ మండల సమితీ...
25/04/2026

ప్రపంచ కార్మికులారా ఏకం కండి.. మే డే వర్ధిల్లాలి!

రాబోయే కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని AITUC హయత్ నగర్ మండల సమితీ ఆధ్వర్యంలో 141వ మే డే ఉత్సవాల పోస్టర్‌ను ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కామ్రేడ్ సామిడి శేఖర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై విడుదల చేశారు.

ఎన్నో త్యాగాలతో సాధించుకున్న మన హక్కులను కాపాడుకోవడానికి కార్మికులంతా ఒకటై.. రాబోయే మే డే ఉత్సవాల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.

ఏ‌ఐ‌టి‌యూ‌సి హయత్ నగర్ మండల గౌరవ అధ్యక్షులు గోల్కొండ నాగరాజు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల అధ్యక్షులు దాసరి కిరణ్, ప్రధాన కార్యదర్శి పట్టేటి శేఖర్, సి‌పి‌ఐ హైకోర్టు కాలనీ డివిజన్ అధ్యక్షులు సి.హెచ్. వెంకట్, DHPS నియోజకవర్గ కార్యదర్శి పి. సురేందర్, హయత్ నగర్ అడ్డా బాధ్యులు శ్రీను తో పాటు నాయకులు వీరస్వామి, రవి, కృష్ణ మరియు కార్మిక శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

శ్రమజీవుల ఐక్యత వర్ధిల్లాలి.. ఇన్‌క్విలాబ్ జిందాబాద్!

24/04/2026

ప్రశ్నించే గొంతుకలను అరెస్టులతో ఆపలేరు!

ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన హక్కుల సాధన కోసం జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్న సమ్మెకు భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఎల్బీనగర్ నియోజకవర్గం సమితి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోంది.
ఈ క్రమంలోనే, సమ్మె చేస్తున్న కార్మికులకు అండగా నిలిచేందుకు హయత్‌నగర్ డిపో వద్దకు వెళ్లిన సీపీఐ ఎల్బీనగర్ నియోజకవర్గ కార్యదర్శి కామ్రేడ్ సామిడి శేఖర్ రెడ్డి గారిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి అబ్దుల్లాపూర్మెట్ స్టేషన్‌కు తరలించారు.
శేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ కనీసం నాయకులను శాంతియుతంగా మాట్లాడనివ్వకుండా, గొంతు నొక్కేలా పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దారుణం అన్నారు.
నిర్బంధాలు, అరెస్టులు చూసి ఎర్రజెండా ఎప్పుడూ భయపడదు, ఇలాంటి అణచివేత చర్యలు మా పోరాట స్ఫూర్తిని మరింత రగిలిస్తాయి తప్ప ఆపలేవు అని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు సీపీఐ వారికి అండగా ఉండి పోరాడుతూనే ఉంటుందని కార్మికుల పక్షాన నిలబడటం నేరమైతే, ఆ నేరం చేయడానికి మేమెప్పుడూ సిద్ధమే అని స్పష్టం చేశారు.

పోలీసుల దమనకాండను తీవ్రంగా ఖండిస్తున్నాం.. విప్లవం వర్ధిల్లాలి

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా వెళ్లి అరెస్టైన సిపిఐ నాయకులను పరామర్శించేందుకు అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్‌ను స...
24/04/2026

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా వెళ్లి అరెస్టైన సిపిఐ నాయకులను పరామర్శించేందుకు అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్ర చారి గారు, అనంతరం హయత్‌నగర్‌లో ఆర్టీసీ కార్మికులతో సమావేశమై వారి సమస్యలపై చర్చించారు.




14/04/2026

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్బంగా హయత్నగర్ మండల కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో బాగంగా......

వీరన్నగుట్ట వద్ద ప్రారంభమైన ఇంటింటికి సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) రాష్ట్ర సమితి పిలుపుమేరకు ఎల్బీనగర్ నియోజకవర...
10/04/2026

వీరన్నగుట్ట వద్ద ప్రారంభమైన ఇంటింటికి సిపిఐ

భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) రాష్ట్ర సమితి పిలుపుమేరకు ఎల్బీనగర్ నియోజకవర్గం లెక్చరర్స్ కాలనీ డివిజన్‌లోని వీరన్నగుట్ట వద్ద 'పోరాటాల సీపీఐకి చేయూతనివ్వండి' అనే నినాదంతో శుక్రవారం 'ఇంటింటికి సీపీఐ' కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ ఆందోజు రవీంద్ర చారిగారు , ఎల్బీనగర్ నియోజకవర్గ కార్యదర్శి కామ్రేడ్ సామిడి శేఖర్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు.
​ఈ కార్యక్రమంలో లెక్చరర్స్ కాలనీ డివిజన్ కార్యదర్శి సామిడి వంశీ వర్ధన్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు బొంగు అరుణ్ కుమార్ గౌడ్, సీపీఐ హయత్‌నగర్ మండల కార్యదర్శి శేషరాజుపల్లి శ్రీదేవి, మండల సహాయ కార్యదర్శులు కర్నె సుజాత, మర్రి శోభన్ తదితర నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.

Address

LBnagar
Hyderabad
500035

Website

Alerts

Be the first to know and let us send you an email when CPI LBNagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share