02/06/2026
ఈరోజు ఉదయం సోమయ్య నగర్ జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో నిర్వహించినటువంటి జోనల్ మీటింగ్ లో సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఐఏఎస్ జి. సృజన గారు జగద్గిరిగుట్టలోని కాలనీలో ఉన్నటువంటి సమస్యల గురించి ఆరా తీయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన రాజీవ్ గృహకల్ప నుండి గౌరవ అధ్యక్షులు అంజన్న ధర్మారపు, ప్రధాన కార్యదర్శి భూపతి రెడ్డి గారు, ఉపాధ్యక్షులు వంగాల పరశురాం గారు, సహాయ కోశాధికారి ఎస్ ఎన్ రెడ్డి గారు, పాల్గొని గౌరవ జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ గారికి సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ గారికి ,రాజీవ్ గృహకల్ప కు సంబంధించినటువంటి త్రాగునీటి సమస్య పైన వారికి వివరించడం జరిగింది. రాజీవ్ గృహకల్ప లోని ప్రజానికం గత 18 సంవత్సరాల నుండి త్రాగునీరు కోసం గోసపడతా ఉన్నారు ,దయచేసి తమరు సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చి యుద్ధ ప్రాతిపదికన త్రాగునీరు సమస్యను తీర్చాలని, అదేవిధంగా త్రాగునీరు శాతాన్ని పెంచాలని రాత్రి వేళలో త్రాగునీరు సరఫరా చేయడం వలన కాలనీలో ఉన్నటువంటి మహిళలమ్మ తల్లులు చాలా ఇబ్బంది పడుతున్నారని, దానితోపాటు కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా పనిచేయడం లేదని, డ్రైనేజీ వ్యవస్థను తక్షణమే పునర్వ్యవస్థకించా లని, ప్రారంభమైనటువంటి పార్కుల పనులు త్వరితగతన పూర్తి చేయాలని గృహకల్ప లోని వీధులలో ఉన్నటువంటి రోడ్లను మంజూరు చేయాలని ,రాజీవ్ గృహకల్ప కు సంబంధించినటువంటి మహిళా సంక్షేమ సంఘం స్థలాన్ని సంక్షేమ సంఘం స్థలాన్ని పరిశీలించి వెంటనే మహిళా బిల్లింగ్ సంక్షేమ సంఘం బిల్డింగు మంజూరు చేయాలని ,వీధి దీపాలను కొత్తవి మంజూరు ఇవ్వాలని, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఈరోజు జరిగిన కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు అంజన్న .ధర్మారపు గారు మాట్లాడడం జరిగింది