25/07/2026
ఖేలో ఇండియా జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలను ప్రారంభించిన చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్
జగిత్యాల జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘అస్మిత ఖేలో ఇండియా’ జిల్లా స్థాయి మహిళా అథ్లెటిక్స్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈ కార్యక్రమానికి జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా హాజరై, పోటీలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికితీయడానికి ‘అస్మిత’ లీగ్ ఒక అద్భుతమైన వేదిక అని కొనియాడారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో రాణించి జిల్లాకు, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ అరవ లక్ష్మి గారు, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ ముత్యం రెడ్డి గారు, ఫిజికల్ డైరెక్టర్ టి.జి. విశ్వప్రసాద్ గారు, అసోసియేషన్ ప్రతినిధులు, వ్యాయామ ఉపాధ్యాయులు మరియు పెద్ద సంఖ్యలో మహిళా క్రీడాకారిణులు పాల్గొన్నారు.