తలారి రంగయ్య వైఎస్సార్సీపీ

  • Home
  • India
  • Kalyandrug
  • తలారి రంగయ్య వైఎస్సార్సీపీ

తలారి రంగయ్య వైఎస్సార్సీపీ అనంతపురం మాజీ M.P, కళ్యాణదుర్గం నియోజకవర్గం YSRCP అభ్యర్థి .

11/08/2026
రాధాస్వామి గారి సేవలు చిరస్మరణీయంకన్నీటి వీడ్కోలు పలికిన మాజీ ఎంపీ తలారి రంగయ్యకుందుర్పి జడ్పీటీసీ సభ్యులు రాధాస్వామి గా...
17/05/2026

రాధాస్వామి గారి సేవలు చిరస్మరణీయం

కన్నీటి వీడ్కోలు పలికిన మాజీ ఎంపీ తలారి రంగయ్య

కుందుర్పి జడ్పీటీసీ సభ్యులు రాధాస్వామి గారి అకాల మరణం అత్యంత బాధాకరమని, ఆయన నిష్క్రమణ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, స్థానిక ప్రజలకు తీరని లోటని మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య గారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

అనారోగ్యంతో కన్నుమూసిన రాధాస్వామి గారి భౌతికకాయాన్ని కరిగానిపల్లిలోని ఆయన నివాసం వద్ద తలారి రంగయ్య గారు సందర్శించారు. రాధాస్వామి గారి పార్థివదేహానికి పూలమాలలు వేసి, అశ్రునయనాలతో కన్నీటి వీడ్కోలు పలికారు.

ఈ సందర్భంగా తలారి రంగయ్య గారు మాట్లాడుతూ...

"రాధాస్వామి గారు కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్న లీడర్. కుందుర్పి మండల అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ఆయన నిరంతరం శ్రమించారు. ఆయన నిస్వార్థ సేవలు ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. ఆయన చూపిన సేవా మార్గం మనందరికీ స్ఫూర్తిదాయకం" అని కొనియాడారు.

అనంతరం, రాధాస్వామి గారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారిని ఓదార్చారు. ఈ కష్టసమయంలో పార్టీ మరియు తాను వ్యక్తిగతంగా కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇస్తూ, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక YSRCP నాయకులు, కార్యకర్తలు మరియు పార్టీ అభిమానులు పాల్గొని నివాళులర్పించారు.

DR Talari Rangaiah

శ్రీ భోగేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ ఎంపీ తలారి రంగయ్యకర్నూలు జిల్లా చిప్పగిరి గ్రామంలో వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్ర...
13/05/2026

శ్రీ భోగేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ ఎంపీ తలారి రంగయ్య

కర్నూలు జిల్లా చిప్పగిరి గ్రామంలో వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశ్రీశ్రీ భోగేశ్వర దేవాలయాన్ని మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం YSRCP సమన్వయకర్త తలారి రంగయ్య సందర్శించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, స్థానిక నాయకులు ఘనస్వాగతం పలికారు.

అనంతరం తలారి రంగయ్య ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, శివుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందించి, వేదాశీర్వచనం చేశారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఈ ప్రాంత ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆ భోగేశ్వరుడిని ప్రార్థించినట్లు మాజీ ఎంపీ రంగయ్య తెలిపారు.

ఈ కార్యక్రమంలో బ్రహ్మాసముద్రం, శెట్టూరు, కళ్యాణదుర్గం రూరల్ కన్వీనర్లు పాలబండ్ల చంద్రశేఖర్ రెడ్డి, MS హనుమంతరాయుడు, గోళ్ళ సూరి, బ్రహ్మాసముద్రం అబ్జర్వర్ గణేష్, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి రామాంజినేయులు యాదవ్, మునిసిపల్ విభాగం అధ్యక్షులు దొడగట్ట మురళి, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక YSRCP నాయకులు పాల్గొన్నారు.

DR Talari Rangaiah
YS Jagan Mohan Reddy

శ్రీ శ్రీ శ్రీ బొబ్బలకుంట ఆంజనేయ స్వామి జాతర మహోత్సవంలో పాల్గొననున్న తలారి రంగయ్య గారు  మాజీ పార్లమెంట్ సభ్యులు మరియుకళ్...
02/02/2026

శ్రీ శ్రీ శ్రీ బొబ్బలకుంట ఆంజనేయ స్వామి జాతర మహోత్సవంలో పాల్గొననున్న తలారి రంగయ్య గారు

మాజీ పార్లమెంట్ సభ్యులు మరియుకళ్యాణదుర్గం YSRCP సమన్వయకర్త తలారి రంగయ్య గారు ఆపిలేపల్లి గ్రామంలో పర్యటించనున్నారు.

తేదీ : 02-02-2026 (సోమవారం)
సమయం : మధ్యాహ్నం 1:00 గంటకు
వేదిక : అపిలేపల్లి గ్రామం, కుందుర్పి మండలం.

అపిలేపల్లిలో వెలసిన శ్రీ శ్రీ బొబ్బలకుంట ఆంజనేయ స్వామి జాతర మహోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకోనున్నారు.

ఇట్లు,

YSRCP కార్యాలయం,
కళ్యాణదుర్గం.

Address

సరోజ కంపౌడ్ , పోస్ట్ ఆఫీస్ వెనకాల కళ్యాణదుర్గం
Kalyandrug
515761

Website

Alerts

Be the first to know and let us send you an email when తలారి రంగయ్య వైఎస్సార్సీపీ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share