Kothacheruvu

Kothacheruvu Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Kothacheruvu, Kothacheruvu.

This is the page for the people who belongs to Kothacheruvu/Puttaparthi/Bukkapatnam and the surrounding villages.All the news,events,special occasions related to the Kothacheruvu/Puttaparthi/Bukkapatnam mandal will be updated into this page.

13/05/2020
ఏపీలో కొత్తగా 33 కరోనా పాజిటివ్‌ కేసులు:అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 33 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వై...
12/05/2020

ఏపీలో కొత్తగా 33 కరోనా పాజిటివ్‌ కేసులు:
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 33 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు కరోనా కేసులు 2,051కి చేరింది. కొత్తగా చిత్తూరులో 10.. కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో తొమ్మిదేసి, కృష్ణా జిల్లాలో నాలుగు, తూర్పుగోదావరి జిల్లాలో ఒక కేసు నమోదయ్యాయి.

ఏపీలో కొత్తగా 38 కరోనా కేసులు :అమరావతి: రాష్ట్రంలో కొత్తగా 38 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ వెల్...
11/05/2020

ఏపీలో కొత్తగా 38 కరోనా కేసులు :

అమరావతి: రాష్ట్రంలో కొత్తగా 38 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2018కి చేరింది. తాజాగా కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో 9 చొప్పున కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 975 మంది చికిత్స పొందుతున్నారు. 998 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు కరోనా కారణంగా 45 మంది మృతి చెందారు.

మాతృమూర్తులకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు :ఒక క్లబ్ లో ఓ సారి ఓ  కార్యక్రమం లో,  “నీకు గతంలో మళ్ళీ వెళ్లి జీవించే అవకాశం య...
10/05/2020

మాతృమూర్తులకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు :

ఒక క్లబ్ లో ఓ సారి ఓ కార్యక్రమం లో, “నీకు గతంలో మళ్ళీ వెళ్లి జీవించే అవకాశం యిస్తే నీ జీవితంలో ఏ సమయాన్ని మళ్ళీ జీవించాలని కోరుకుంటావు ?” అని అడిగారు

చాలా మంది బాల్యమని, విద్యార్థి జీవితం అని, జాబ్ లో చేరిన రోజని ఇలా రకరకాలు చెప్పారు.
కాని, మంథా శ్రీనివాస్ అనే ఆయన యిలా చెప్పారు, “మళ్ళీ అలాంటి అవకాశం వస్తే, మా అమ్మ గర్భంలోకి వెళ్లి ఆ 9 నెలలు మళ్ళీ గడపాలని వుంది అని. నేనెవరో తెలియకపోయినా నే బీజం పోసుకున్నానని అమ్మా, నాన్నా మురిసిపోతారు. నన్ను చూడకపోయినా నాకోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఎవరో మహారాజో, చక్రవర్తో వస్తున్నట్లు ఈ ప్రపంచలోకి నా రాక కోసం మాసాలు, రోజులు, గంటలు, నిమిషాలు లెక్క కట్టుకుని మరీ మురిసిపోతుంటారు. తన జన్మకి ప్రమాదం వుందని తెలిసి కూడా, అదేమీ ఓ విషయమే కాదన్నట్టు నా రాక కోసం అమ్మ ఎదురు చూసే ఆ ఊహని ఆస్వాదిస్తూ, అమ్మ కడుపులో వెచ్చగా, సురక్షితంగా ఆ 9 నెలలు గడపాలని వుంది”

అది విన్న వారంతా ఆ గదిలో speechless అయిపోయాము. speechless మాత్రమే కాదు అందరూ ఓ భావోద్వేకంలోకి వెళ్లి పోయారు. యింకో ఆయన ఆ speech ఎలావుందో చెప్పటానికి స్టేజ్ మీదకి వెళ్లి మాట్లాడుతూ మాట్లాడుతూ గద్గదస్వరముతో మాట్లాడలేక పోయాడు.

భగవంతుని ఎవరూ చూడలేదు...కాని అమ్మే కదా ప్రత్యక్ష దైవం.

జన్మించక ముందు అమ్మ గర్భంలో వెచ్చదనం
జన్మించాక అమ్మ కమ్మని ఒడిలో వెచ్చదనం

అమ్మ పెట్టిన ముద్దు
అమ్మ పెట్టిన ముద్ద

పుట్టిన్రోజున అమ్మ హడావుడి
పొద్దున్నేలేపి తలంటు పోసి
కంట్లో కుంకుడుకాయ రసం వెళ్లి
కళ్ళు మండి నేను ఏడుస్తుంటే
అమ్మ కొంగుచివరని ముడిగా చేసి
దానిమీద నోటితో వెచ్చని గాలి ఊది
ఆ వెచ్చదనాన్ని నా కను రెప్ప మీద
పెడుతూ నను ఒదారుస్తూ అమ్మ
పడే గాభరా, కంగారు, ఆవేదన
కొత్త బట్టలు వేసి
నేనేదో దేవుడ్నైనట్టు బొట్టు పెట్టి
నాకు హారతిచ్చి, నోట్లో మిఠాయి పెట్టి
మురిసే పోయే అమ్మ
ఓ అద్భుత అనుభూతి! ఆనందం !

నే జన్మించక ముందు కూడా భూమి
సూర్యుని చుట్టూ భ్రమణం చేస్తూంది
ఈ రోజుకి నేను జన్మించిన తరువాత
భూమితో పాటు నేనూ కూడా యింకో
భ్రమణం సూర్యుని చుట్టూ పూర్తి చేశా
భ్రమణం నేను చేశానా ?
భ్రమిస్తున్నానా ? అలా?

అమ్మ గర్భంలోకి వచ్చాను
భూ గర్భంలోకి చేరుతాను
మళ్ళీ అదే వెచ్చదనం ?
మళ్ళీ వచ్చే వెచ్చదనం !

యిది ఉదాసీనత కాదు
యిది వైరాగ్యం కాదు
యిది వైకల్యం కాదు
మరి ఏమిటిది ?
యిది వేదన కాదు
వేడుకా కాదు
యిది ఒక ప్రయాణం

ఓ అద్భుత అనుభూతి
అమ్మ పంచిన ప్రేమ
నాన్న యిచ్చిన వూత
జీవిత భాగస్వామితో పయనం
పుత్ర పుత్రికోత్సాహం
స్నేహితులతో నవ్వుల పువ్వులు
హృదయాన్ని కొల్లగొట్టిన లవ్వులు
బాపూ బొమ్మలూ, కార్టూన్లు
వర్షం వెలిసిన మట్టి సువాసన
ముద్దపప్పు ఆవకాయ
పెసరట్టు మిరప బజ్జీలు
ఇరానీ చాయ్
వెన్నెట్లో గోదారీ
చిన్న,చిన్న సరదాలు
ఓ అద్భుత అనుభూతి ! ఆనందం

దాశరధి వ్రాసినట్లు
“గల గల పారుతున్న గోదారిలా...
రెప రెప లాడుతున్న తెరచాపలా...
ఈ చల్లని గాలిలా... ఆ పచ్చనీ పైరులా...
నీ జీవితం సాగనీ... హాయిగా... హే...

ఏపీలో కొత్తగా 50 కరోనా కేసులు:అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 50 కరోనా పాజిటివ్‌ కేసులున నమోదైనట్లు రాష్ట్ర వైద్య శ...
10/05/2020

ఏపీలో కొత్తగా 50 కరోనా కేసులు:

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 50 కరోనా పాజిటివ్‌ కేసులున నమోదైనట్లు రాష్ట్ర వైద్య శాఖ తెలిపింది. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,980కి చేరింది. కరోనా కారణంగా మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు కరోనా వైరస్‌ వల్ల 45 మంది మృతి చెందారు.

10/05/2020
ఏపీలో కొత్తగా 43 కరోనా పాజిటివ్‌ కేసులు:అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,930కి చేరింది. కొత్తగా 43...
09/05/2020

ఏపీలో కొత్తగా 43 కరోనా పాజిటివ్‌ కేసులు:

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,930కి చేరింది. కొత్తగా 43 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా నుంచి 887 మంది కోలుకోగా.. వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 999 మంది చికిత్స పొందుతున్నట్లు వైద్య శాఖ బులిటెన్‌లో పేర్కొంది. కరోనాతో మరో మృతి చెందారని, దీంతో మృతుల సంఖ్య 44కి చేరినట్లు తెలిపింది. గడిచిన 24 గంటల్లో 8,388 సాంపిల్స్‌ను పరీక్షించామని రాష్ట్ర వైద్య శాఖ ప్రకటించింది.

ఏపీలో కొత్తగా 54 కరోనా కేసులు:అమరావతి: గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 54 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఏ...
08/05/2020

ఏపీలో కొత్తగా 54 కరోనా కేసులు:
అమరావతి: గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 54 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఏపీ ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. దీంతో మొత్తంగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,887కు చేరింది. ఇప్పటి వరకు 842 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి కాగా.. 1,004 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా వల్ల ఇప్పటి వరకు రాష్ట్రంలో 41 మంది మరణించారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ కొత్తగా 56 కరోనా కేసులు, తొలిసారిగా విజయనగరంలో కరోనా కేసులు:అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్...
07/05/2020

ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ కొత్తగా 56 కరోనా కేసులు, తొలిసారిగా విజయనగరంలో కరోనా కేసులు:

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,833కి చేరింది. ఇవాళ కొత్తగా 56 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో మరో ఇద్దరు మృతి చెందారని పేర్కొంది. దీంతో కరోనా మరణాలు 38కి చేరాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి 780 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 1,015 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో 8,087 సాంపిల్స్‌ను పరీక్షించినట్లు వైద్య శాఖ తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ లో వివిధ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ డేట్స్
07/05/2020

ఆంధ్రప్రదేశ్ లో వివిధ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ డేట్స్

ఏపీలో కొత్తగా 60 కరోనా పాజిటివ్‌ కేసులు (6 మే 2020) : అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,777కి చేరిం...
06/05/2020

ఏపీలో కొత్తగా 60 కరోనా పాజిటివ్‌ కేసులు (6 మే 2020) :

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,777కి చేరింది. రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 60 కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో 36 మంది మృతి చెందారని పేర్కొంది. కరోనా బారినుంచి 729 మంది కోలుకుని డిశ్చార్జి అయినట్లు తెలిపింది.

Address

Kothacheruvu
515133

Website

Alerts

Be the first to know and let us send you an email when Kothacheruvu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share