14/08/2026
కొవ్వూరులో ఘనంగా తిరంగా ర్యాలీ – దేశభక్తి చాటిన కూటమి శ్రేణులు
రాష్ట్ర కూటమి ఆదేశాల మేరకు స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కొవ్వూరు పట్టణంలో ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. కొవ్వూరు మున్సిపల్ కార్యాలయం నుంచి RDO కార్యాలయం వరకు జాతీయ జెండాలను చేతబూని, దేశభక్తి నినాదాలతో ర్యాలీ ఉత్సాహంగా సాగింది.
ఈ తిరంగా ర్యాలీలో కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ముప్పిడి వెంకటేశ్వరరావు గారు, టుమెన్ కమిటీ సభ్యులు శ్రీ కంఠమణి రామకృష్ణ రావు గారు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, యువత మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ సమైక్యతను చాటారు.
దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకుంటూ, వారి త్యాగాలను నేటి తరానికి గుర్తుచేస్తూ ఈ ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండా మనందరి గౌరవానికి, దేశ ఐక్యతకు ప్రతీక అని చాటుతూ ప్రతి ఒక్కరిలో దేశభక్తి స్ఫూర్తిని నింపారు.