KRJ Bharath

KRJ Bharath Member Of The Legislative Council Chittoor district,
Kuppam constituency - YSRCP assembly coordinator.

ప్రజల మనిషిగా, సేవాభావం కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందిన మాజీ మంత్రి శ్రీ గాదె వెంకటరెడ్డి గారి మరణం బాధాకరం. రాజకీయ జీ...
29/05/2026

ప్రజల మనిషిగా, సేవాభావం కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందిన మాజీ మంత్రి శ్రీ గాదె వెంకటరెడ్డి గారి మరణం బాధాకరం. రాజకీయ జీవితమంతా ప్రజల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేసిన ఆయన సేవలు ఎన్నటికీ మరువలేనివి. సాధారణ కార్యకర్తల నుంచి ప్రజల వరకు అందరితో ఆత్మీయంగా మెలిగిన ఆయన వ్యక్తిత్వం ప్రత్యేకమైనది. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను.

తాడేపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని  కుప్పం నియోజకవర్గ వైయస్ ఆర్ కాంగ్...
28/05/2026

తాడేపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని కుప్పం నియోజకవర్గ వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మరియు శాసనమండలి సభ్యులు KRJ భరత్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, జూన్‌ 4 నుంచి జూన్‌ 12 వరకు చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో నిర్వహించబోవు నిరసన కార్యక్రమాలు గురించి అలాగే SIR పై అవగాహన కల్పిస్తూ జూన్ 15 నుండి జూలై 14 వరకు BLAలకు క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై ఇవ్వబోవు ప్రత్యేక శిక్షణపై మరియు చర్చించడం జరిగింది.

కుప్పం నియోజకవర్గ సమస్యలు, పార్టీ బలోపేతం మరియు ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చించారు. పార్టీ శ్రేణులు ధైర్యంగా ప్రజల్లో ఉండాలని, వైఎస్సార్‌సీపీ సిద్ధాంతాలను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైఎస్ జగన్ గారు సూచించారు. నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని KRJ భరత్ గారు తెలిపారు







పవిత్ర బక్రీద్ పర్వదినం మనందరిలో త్యాగం, ప్రేమ, మానవత్వం వంటి గొప్ప విలువలను మరింత బలపరచాలి. 🌙దానధర్మాల ద్వారా సమాజంలో ఐ...
28/05/2026

పవిత్ర బక్రీద్ పర్వదినం మనందరిలో త్యాగం, ప్రేమ, మానవత్వం వంటి గొప్ప విలువలను మరింత బలపరచాలి. 🌙

దానధర్మాల ద్వారా సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వం పెంపొందించాలని సందేశమిచ్చే ఈ పవిత్ర పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక బక్రీద్ శుభాకాంక్షలు. అల్లాహ్ మీ ప్రార్థనలను స్వీకరించి, మీ కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉండాలని కోరుకుంటున్నాను.

27/05/2026

SIR జరిగిన రాష్ట్రాలు తమిళనాడులో 74లక్షల ఓట్లు, మధ్యప్రదేశ్ లో 34లక్షల ఓట్లు, గుజరాత్ లో 68లక్షల ఓట్లు, వెస్ట్ బెంగాల్ లో 91లక్షల ఓట్లు తొలిగించగా..తమిళనాడులో స్టాలిన్ గారు పోటీ చేసిన Kolathur నియోజకవర్గంలో 83వేల ఓట్లు తొలిగిస్తే వారు 8వేల తేడాతో ఓడిపోయారు, ఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో 38వేల ఓట్లు తొలిగిస్తే అరవింద్ కేజిరివాల్ వారు 4వేల తేడాతో ఓడిపోయారు, బాబాణిపూర్ నియోజకవర్గంలో 47వేల ఓట్లు తొలిగిస్తే మమతా బెనర్జీ గారు 15వేల తేడాతో ఓడిపోయారు..వారికి సమయం లేకనో పట్టించుకోపోవడం వలనో డ్రాప్ అయిన ఓట్లని తిరిగి ఎక్కించలేక తీవ్రంగా నష్టపోయారు..

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనది, దానిని కాపాడుకోవడం ప్రతి నాయకుడి బాధ్యత. ప్రతి ఊరిలో మన ఓటర్లు అనుకునేవాళ్లవి కేవలం 50 ఓట్లు తీసేస్తే చాలు.. నియోజకవర్గం మొత్తంలో మనవి 50 వేల ఓట్లు డ్రాప్ అయిపోతాయి. కాబట్టి ప్రతి ఊరిలో కూడా ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాని ప్రాముఖ్యతను గుర్తించే పార్టీ శ్రేణులను అప్రమత్తం చేస్తూ జూన్ 15 నుండి జూలై 14 వరకు BLAలకు క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం..

చంద్రబాబు అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైయస్ ఆర్ సీపీ మద్దతుదారుల ఓట్ల తొలగించడానికి ప్రయత్నిస్తాడు..వారికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మనం అప్రమత్తంగా ఉండాలి. ఓటర్ల జాబితా పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఉండేలా పార్టీ శ్రేణులు సమర్థవంతంగా పనిచేయాలి.


27/05/2026

వెన్నుపోటుకు రెండేళ్లు..
జూన్‌ 4 నుంచి జూన్‌ 12 వరకు చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున నిరసనలు..
✅జూన్‌ 4న మండల కేంద్రాల్లో వైయ‌స్ఆర్‌సీపీ నిరసనలు.
✅జూన్‌ 8 లేదా 9న నియోజకవర్గ హెడ్‌క్వార్టర్స్‌లో టౌన్‌హాల్‌ సదస్సులు..
✅జూన్‌ 12న ప్రతీ నియోజకవర్గ కేంద్రంలో చంద్రబాబు వెన్నుపోటు పాలనకు నిరసనగా ర్యాలీలు.

రాయలసీమ రాజకీయ చరిత్రలో, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన పేరు “పులివెందుల పెద్దాయన” దివంగత స్వర్గీయ వైఎస్‌ రాజార...
23/05/2026

రాయలసీమ రాజకీయ చరిత్రలో, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన పేరు “పులివెందుల పెద్దాయన” దివంగత స్వర్గీయ వైఎస్‌ రాజారెడ్డి గారు. ప్రజల కష్టసుఖాల్లో తోడుగా నిలుస్తూ, నమ్ముకున్న ప్రతి కుటుంబానికి అండగా ఉండి, కరువు కాటకాలు, విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు ధైర్యం చెప్పిన మహానుభావుడు ఆయన. నాయకత్వం అంటే కేవలం పదవి కాదని, ప్రజలకు అండగా నిలబడటమే అసలైన సేవ అని తన జీవితం ద్వారా నిరూపించారు.

1925లో వెంకటరెడ్డి, మంగమ్మ దంపతులకు జన్మించిన వైఎస్‌ రాజారెడ్డి గారు చిన్ననాటి నుంచే ప్రజాసేవా భావంతో ఎదిగారు. పులివెందుల ప్రజల మధ్య తిరుగుతూ వారి సమస్యలను తెలుసుకొని, పరిష్కార మార్గాలను చూపిస్తూ అందరి మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. “ఏ సమస్య వచ్చినా పెద్దాయన దగ్గరకు వెళితే పరిష్కారం దొరుకుతుంది” అనే నమ్మకం ప్రజల్లో ఏర్పడటమే ఆయన గొప్పతనానికి నిదర్శనం.

పులివెందుల గ్రామ సర్పంచ్‌గా 1988 నుంచి 1995 వరకు సేవలందించిన ఆయన, ఆ కాలంలో గ్రామ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీధిలైట్లు, రోడ్లు, మంచినీటి చెరువులు, విద్యాసంస్థలు ఏర్పాటు చేయడంలో ముందుండి పులివెందుల రూపురేఖలు మార్చారు. ప్రజల అవసరాలను అర్థం చేసుకొని అభివృద్ధి పనులను చేపట్టిన దూరదృష్టి గల నాయకుడు ఆయన. ముఖ్యంగా మంచినీటి సమస్య తీవ్రంగా ఉన్న సమయంలో ఎన్నో కష్టనష్టాలు భరిస్తూ ప్రజలకు నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవడం ఆయన ప్రజాప్రేమకు నిదర్శనం.

ప్రజల కోసం ఆయన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉండేవి. పేద, బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలుస్తూ వారికి ధైర్యం చెప్పే పెద్దమనసు ఆయనది. అందుకే ఈనాటికీ పులివెందుల ప్రజలు వైఎస్‌ రాజారెడ్డి గారిని ఒక నాయకుడిగా మాత్రమే కాదు, తమ కుటుంబ పెద్దగా, దేవుడిలా భావిస్తూ స్మరించుకుంటున్నారు.

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్‌ ఆర్ గారి రాజకీయ ప్రస్థానానికి వెన్నుదన్నుగా నిలిచింది కూడా పెద్దాయన ఆశయాలే. వైఎస్సార్‌ను ముఖ్యమంత్రిగా చూడాలన్న ఆయన కల, ఆశయం తరువాత నిజమై ప్రజా చరిత్రలో స్వర్ణాక్షరాలతో నిలిచిపోయింది.

పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలలను ఏర్పాటు చేసి విద్యా అభివృద్ధికి కూడా విశేష కృషి చేశారు. ఆయన చూపిన సేవామార్గంలోనే వైఎస్‌ జగన్‌ గారు, వైఎస్‌ అవినాష్‌ గారు మరియు కుటుంబ సభ్యులు ప్రజాసేవలో ముందుకు సాగుతున్నారు.

ప్రజల కోసం జీవితాంతం అంకితభావంతో పనిచేసిన మహానేత, స్వర్గీయ వైఎస్‌ రాజారెడ్డి గారి 28వ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను, ఆశయాలను స్మరించుకుంటూ వారికి మా హృదయపూర్వక ఘన నివాళులు.

కుప్పం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు నమస్కారం.. పార్టీ క్యాడర్ ఐడీ కార్డుల వెరిఫికేషన్ & ప్రింటి...
23/05/2026

కుప్పం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు నమస్కారం.. పార్టీ క్యాడర్ ఐడీ కార్డుల వెరిఫికేషన్ & ప్రింటింగ్ ప్రక్రియ తుది దశకు చేరూకుంది..

🔗 వెంటనే ఈ లింక్ ఓపెన్ చేసి మీ వివరాలు వెరిఫై చేసుకోండి:
https://myysrcp.com/verify

✅ OTP నమోదు చేయండి
✅ ID Card Preview చెక్ చేయండి
✅ పేరు & ఫోటో అవసరమైతే సరిచేసుకోండి
✅ “Submit for Printing” పై క్లిక్ చేయండి
గమనిక:- ఫోటో మరియు పేరు మాత్రమే ఎడిట్ చేయగలరు. త్వరగా వెరిఫికేషన్ పూర్తి చేస్తేనే ఐడీ కార్డుల ప్రింటింగ్ ప్రక్రియ వేగంగా పూర్తవుతుంది..

నేను నా ఐడి కార్డు సరిచూసుకొని ఓకే చేసుకున్నాను ✅.
కావున కుప్పం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, కుటుంబ సభ్యులందరూ మీ ఐడి కార్డులను వెంటనే సరిచూసుకొని ఓకే చేసుకోండి. ఏవైనా వివరాల్లో తప్పులు ఉంటే ఆలస్యం చేయకుండా సరిచేసుకోండి.

YSR Congress Party - YSRCP
YS Jagan Mohan Reddy
Peddireddy Ramachandra Reddy


21/05/2026

నేను మంచోడిని కాబట్టే… మా తాత రాజారెడ్డి గారిని హతమార్చిన వాళ్లు ఇప్పటికీ ప్రశాంతంగా బతుకుతున్నారు.
నేను చెడ్డోడిని అయి ఉంటే… మా కుటుంబానికి అంతటి అన్యాయం చేసిన వాళ్లు ఇలా స్వేచ్ఛగా తిరిగేవారా?

మా నాన్న గారు డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి గారు నాకు నేర్పింది ఒక్కటే, ప్రతీకార రాజకీయాలు కాదు, ప్రజలకు మంచి చేసి వారి గుండెల్లో స్థానం సంపాదించుకోవాలని. చంద్రబాబులా కుట్రలు, హత్యా రాజకీయాలు కాదు,
సేవా రాజకీయాలే మా సిద్ధాంతం.
-వైయస్ జగన్ గారు, వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు

కుప్పం నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీ తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు.అమ్మవారి కృపతో ప్రతి ఇంట ఆనందం,...
20/05/2026

కుప్పం నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీ తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు.
అమ్మవారి కృపతో ప్రతి ఇంట ఆనందం, ఆయురారోగ్యాలు, సుఖశాంతులు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..



అర్ధ శతాబ్దం ప్రేమ, నమ్మకం, అనుబంధానికి ప్రతీకగా నిలిచిన మీ దాంపత్య జీవితం…ఇలాగే సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఆనందంగా కొనస...
16/05/2026

అర్ధ శతాబ్దం ప్రేమ, నమ్మకం, అనుబంధానికి ప్రతీకగా నిలిచిన మీ దాంపత్య జీవితం…
ఇలాగే సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఆనందంగా కొనసాగాలని కోరుకుంటూ…
ఆదిదంపతులకు హృదయపూర్వక 50వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
Happy 50th Wedding Anniversary 🎉

Address

Kuppam

Website

Alerts

Be the first to know and let us send you an email when KRJ Bharath posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to KRJ Bharath:

Share