05/02/2026
*వైస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు*
*శ్రీ ఎస్వీ మెహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద ప్రెస్మీట్*
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్ర ముఖ్య మంత్రి అయిన రేవంత్ రెడ్డి గారితో కుమ్మక్కు అయ్యి రాయలసీమ ప్రయోజనాలని తాకట్టు పెట్టి రాయలసీమని ఎడారి చేయాలనుకుంటున్నారా?
చంద్రబాబు అప్పట్లో ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం కట్టిన ఏ ప్రాజెక్ట్ అనుమతి తీసుకున్నారు?
మీ కుమారుడు ఏమో ఒక్క టీఎంసీ నీటికోసం రాష్ట్రాలు, దేశాలు యుద్దాలు చేసుకున్న రోజులు ఉన్నాయి అని అంటారు, మీరేమో 4 టీఎంసీ లే కదా అని హేళన చేస్తున్నారు అని విమర్శించారు.
పోతిరెడ్డిపాడులో వైస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సాధించడం కోసం ఫిబ్రవరి 5వ తేదీన జరగబోయే భారీ బహిరంగ సభకి రాయలసీమ నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు
కార్యక్రమంలో నగర మేయర్ బి వై రామయ్య గారు, పార్టీ రాష్ట్ర నాయకులు,కార్పొరేటర్లు, జిల్లా నాయకులు పాల్గొన్నారు