Prajaseva welfare society

Prajaseva welfare society Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Prajaseva welfare society, Mandamarri, Mancherial.

ప్రజా సేవ వెల్ఫేర్ సొసైటీ – మంధమర్రి 💚
“మీ చిన్న సహాయం… ఎవరో ఒకరి పెద్ద ఆశ” ✨
🍲 ఆకలితో ఉన్నవారికి ఆహారం
📚 పిల్లల విద్యకు తోడ్పాటు
🙌 కష్టాల్లో ఉన్న కుటుంబాలకు అండగా
👉 మీరు కూడా పేదలకు సహాయం చేయాలనుకుంటే వెంటనే సంప్రదించండి!

📝 ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు బుక్స్ పంపిణీ 📝మందమరి కళ్యాణి కని పాఠశాల విద్యార్థులకు ప్రజాసేవ వెల్...
29/08/2026

📝 ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు బుక్స్ పంపిణీ 📝
మందమరి కళ్యాణి కని పాఠశాల విద్యార్థులకు ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీలత ఇంచార్జ్ రజిత గారి సమక్షంలో జరిగింది.
ఈ సందర్భంగా ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ అజీమోద్దీన్ మాట్లాడుతూ...

“విద్యార్థుల భవిష్యత్తుకు పరీక్షలు ఎంతో ముఖ్యమైనవి. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేందుకు విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో, మా వంతు సహాయంగా ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు మందమరి కళ్యాణి కని పాఠశాల విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేయడం జరిగింది.
విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నాము.”
అలాగే, ఇలాంటి సేవా కార్యక్రమాలకు సహాయం చేయాలని ఆసక్తి ఉన్న దాతలు, సేవాభిమానులు ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీని సంప్రదించాలని కోరారు. వారి సహకారాన్ని అవసరమైన వారికి చేరేలా సద్వినియోగం చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నందిపాటి రాజ్ కుమార్, కార్యదర్శి గాండ్ల సంజీవ్ పటేల్, ఎండి జావిద్ పాషా, అన్వేష్, సూర్య, ఇమామ్ స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
🌿 ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ
🤝 సేవే మా లక్ష్యం – సమాజమే మా కుటుంబం

24/08/2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు ప్రసిద్ధి గారు

ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ 🌿🎉 ప్రసిద్ధి గారి పుట్టినరోజు సందర్భంగా నిత్యావసర వస్తువుల పంపిణీ 🎉ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్...
24/08/2026

ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ 🌿

🎉 ప్రసిద్ధి గారి పుట్టినరోజు సందర్భంగా నిత్యావసర వస్తువుల పంపిణీ 🎉

ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో రేగుంట సాయి పూజిత దంపతుల కుటుంబానికి నెల రోజుల పాటు సరిపడే నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

💬 ఈ సందర్భంగా ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ అజీమొద్దీన్ మాట్లాడుతూ—

రేగుంట సాయి పూజిత దంపతులు వృత్తిరీత్యా టైర్ పంక్చర్ షాప్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్న క్రమంలో గుండెకు చిల్లు పడటంతో అనారోగ్యానికి గురయ్యారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉండటంతో స్థానికులు ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీని సంప్రదించారు.
ఈ విషయం తెలుసుకున్న వెంటనే స్పందించిన సొసైటీ సభ్యులు రాందేవ్ ట్రేడర్స్ నిఖిల్ గారిని సంప్రదించగా, ఆయన ఆ కుటుంబానికి నెల రోజుల పాటు సరిపడే నిత్యావసర సామాగ్రిని స్వయంగా కొనుగోలు చేసి అందించారు.అనంతరం ఆ సామాగ్రిని ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ బాధ్యులు ఆ కుటుంబానికి అందజేశారు.
భవిష్యత్తులో కూడా ఈ కుటుంబానికి తమ సొసైటీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు.

🙏 ప్రత్యేక ధన్యవాదాలు:
ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రసిద్ధి గారికి, రాందేవ్ ట్రేడర్స్ నిఖిల్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

👥 ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు:
మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నందిపాటి రాజ్ కుమార్, జావిద్ పాషా, పృద్వి, శశిధర్ తదితరులు పాల్గొన్నారు.
🤝 ప్రజాసేవే మా లక్ష్యం – సేవే మా సంకల్పం.

🌿 ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ 🌿🕊️ కీ.శే. మేకల శ్రీనివాస్ యాదవ్ గారి వర్ధంతి సందర్భంగా ఆహార పంపిణీ..📍 మంచిర్యాల జిల్లా – మంద...
23/08/2026

🌿 ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ 🌿
🕊️ కీ.శే. మేకల శ్రీనివాస్ యాదవ్ గారి వర్ధంతి సందర్భంగా ఆహార పంపిణీ..
📍 మంచిర్యాల జిల్లా – మందమర్రి.
కీ.శే. మేకల శ్రీనివాస్ యాదవ్ గారి వర్ధంతి సందర్భంగా, వారి కుటుంబ సభ్యుల సహకారంతో మందమర్రిలోని నిరుపేదలకు ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ అజీమోద్దీన్ మరియు ఉపాధ్యక్షుడు సుద్దాల ప్రభుదేవా మాట్లాడుతూ:
“ప్రత్యేక సందర్భాలను కేవలం వేడుకలకే పరిమితం చేయకుండా, పేదలకు ఆహారం అందించడం ద్వారా మానవతా సేవ చేయవచ్చు. మీ పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు మరియు ఇతర ప్రత్యేక సందర్భాల్లో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీని సంప్రదించి, మీ వంతు సహకారంతో నిరుపేదలకు ఆహారం పంపిణీ చేయండి.
మనమందరం కలిసికట్టుగా కృషి చేస్తే ‘ఆకలితో ఎవరూ బాధపడని సమాజం’ నిర్మించవచ్చు.”
🙏 కీ.శే. మేకల శ్రీనివాస్ యాదవ్ గారి వర్ధంతి సందర్భంగా ఈ సేవా కార్యక్రమానికి సహకరించిన వారి కుటుంబ సభ్యులకు ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నంది పాట రాజ్ కుమార్, మహమ్మద్ జావిద్ పాషా, సునీల్, రాజు తదితరులు పాల్గొన్నారు. మీ
🌿 ప్రజాసేవే మా లక్ష్యం – ఆకలితో ఉన్నవారికి అన్నం అందించడమే మా బాధ్యత. 🌿

14/08/2026
Paper cutting s
10/08/2026

Paper cutting s

27/07/2026

Happy birthday MARTHA LAVANYA garu

ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ నందిపాటి రాజ్ కుమార్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 💐...
26/07/2026

ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ నందిపాటి రాజ్ కుమార్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 💐🎉
మీరు ఆయురారోగ్యాలతో, ఆనందంతో, సుఖసంతోషాలతో నిండి, మరెన్నో సంవత్సరాలు సమాజ సేవలో ముందుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
హ్యాపీ బర్త్‌డే రాజ్ కుమార్ గారు! 🎂🎈

Address

Mandamarri
Mancherial
504231

Website

Alerts

Be the first to know and let us send you an email when Prajaseva welfare society posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Prajaseva welfare society:

Shortcuts

Share