Telugu Desam Party: Markapuram

Telugu Desam Party: Markapuram Official Page of TDP Markapuram

నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఏపీ యాత్రీకుల‌ క్షేమ సమాచారాలపై విద్య‌, ఐటీ, ఎల‌క్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ శాఖ‌ల మంత్రి నారా లో...
27/08/2026

నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఏపీ యాత్రీకుల‌ క్షేమ సమాచారాలపై విద్య‌, ఐటీ, ఎల‌క్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ శాఖ‌ల మంత్రి నారా లోకేష్ అధికారుల‌తో మాట్లాడి తెలుసుకున్నారు. నలుగురు సురక్షితంగా ఉన్నారని... కుప్పం ప్రాంతానికి చెందిన బాల సుబ్రహ్మణ్యం, ఈషా ఫౌండేషన్ గ్రూప్ కు చెందిన శశికుమార్, రాజ్యలక్ష్మీలు ఆచూకీ లభించలేదని ఢిల్లీలో ఏపీ భవన్ అధికారులు మంత్రికి వివ‌రించారు. వారి ఆచూకీ కనుగొనేందుకు కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరపాలని, సురక్షితంగా ఉన్న వారిని వెంటనే మ‌న రాష్ట్రానికి తరలించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ ప‌ర్య‌వేక్షిస్తున్నారు.


27/08/2026

శ్రీశైలం, తుంగభద్ర ప్రాజెక్టులు ప్రమాదంలో పడితే ఐదేళ్లు పట్టించుకోలేదు జగన్. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టుల భద్రతకు కోట్లు వెచ్చించాం.



భారతదేశంలో అత్యంత ప్రతిభావంతులైన యువ నాయకులు, చేంజ్ మేకర్లు, బిజినెస్ మైండ్స్ కు  ఫార్చ్యూన్ ఇండియా 40 అండర్ 40 పేరిట ము...
27/08/2026

భారతదేశంలో అత్యంత ప్రతిభావంతులైన యువ నాయకులు, చేంజ్ మేకర్లు, బిజినెస్ మైండ్స్ కు ఫార్చ్యూన్ ఇండియా 40 అండర్ 40 పేరిట ముంబైలో అవార్డులను ప్రదానం చేసింది. ఈ కార్యక్రమానికి కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి చిరాగ్ పాశ్వాన్, రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్యఅతిధులుగా హాజరై విజేతలకు అవార్డులను ప్రదానం చేశారు. దేశంలో డైరీ వాల్యూయాడెడ్ ఉత్పత్తుల్లో ప్రత్యేకత సాధించిన హెరిటేజ్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ నారా బ్రాహ్మణికి కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్ లో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఆర్ పిఎస్ జి గ్రూప్ వైస్ చైర్మన్ శాశ్వత్ గోయెంకా అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానాలిచ్చారు. దేశంలోని మిగతా రాష్ట్రాలకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ వేగంగా పెట్టుబడుల ఆకర్షణకు రెండు ప్రధాన కారణాలను మంత్రి లోకేష్ తెలిపారు. స్పీడ్, సర్వీస్, స్టెబిలిటీ తమ విజయ రహస్యమని తెలిపారు.






27/08/2026

మానవ వనరుల శాఖకు నేను సంరక్షకుడిని మాత్రమే. స్పీడ్, సర్వీస్, స్టెబిలిటీ, పెట్టుబడుల ఆకర్షణే మా విజయ రహస్యాలు. ప్రపంచమంతా చెప్పుకునేలా ఒక మోడల్ ఏపీని సృష్టించాలనేదే మా లక్ష్యం :
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్






27/08/2026

తమరి ఐదేళ్ల పాలనలో బీసీల తలరాత మార్చలేదు జగన్ గారూ.. చంద్రయ్య, సుబ్బయ్య, అమర్నాథ్ గౌడ్ .. చెప్పుకుంటూ పోతే బీసీల అంతమే లక్ష్యంగా ఐదేళ్లు తమరు పనిచేశారు



27/08/2026

క్రిమినల్స్, హంతకులు, ఛీటర్స్, లూటర్స్ అందరికీ మద్దతుగా నిలిచేది గొడ్డలి పార్టీ గ్యారేజ్..



27/08/2026

గత వైసీపీ హయాంలో జరిగిన కల్తీ మద్యం కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (ED) చర్యలు తీసుకుంటుంటే.. ఆ తప్పులను కూడా కూటమి ప్రభుత్వంపైకి నెట్టాలని వైసీపీ చూస్తోంది. వారి తప్పుడు ప్రచారాలు, కూటమి పార్టీల మధ్య చిచ్చుపెట్టే కుట్రల పట్ల మనందరం అప్రమత్తంగా ఉండాలి





•ప్రపంచస్థాయి ప్రమాణాలతో, తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా అమరావతి శాసనసభ భవన నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చే...
27/08/2026

•ప్రపంచస్థాయి ప్రమాణాలతో, తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా అమరావతి శాసనసభ భవన నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది

•రాష్ట్రవ్యాప్తంగా జనవరి 1 నుంచి "సంజీవని ప్రాజెక్టు" అమలు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు

•నిడమర్రు రైల్వే గేట్ వద్ద ఆధునిక వెజిటబుల్ మార్కెట్ నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు

•మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు

•ఫార్చ్యూన్ ఇండియా 40 అండర్ 40 అవార్డుల కార్యక్రమంలో కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌తో కలిసి మంత్రి నారా లోకేష్ విజేతలకు అవార్డులు అందజేశారు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/WqSdH




•ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక చింతనలను మమేకం చేస్తూ గోదావరి పుష్కరాలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు•అన...
26/08/2026

•ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక చింతనలను మమేకం చేస్తూ గోదావరి పుష్కరాలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు

•అనేక సవాళ్లను అధిగమించి, భగీరథ ప్రయత్నంతో వెలిగొండ ఫేజ్-1ను పూర్తి చేసి కరువు నేలకు కృష్ణమ్మ జలాలను అందిస్తున్నామని సీఎం తెలిపారు

•పోలవరం ప్రాజెక్టుకు మెరుగైన రహదారి అనుసంధానం కోసం NH-365BB లోని బుట్టాయిగూడెం-ఎల్ఎన్డీ పేట, పట్టిసీమ-కొవ్వూరు సెక్షన్ల అభివృద్ధికి కేంద్రం రూ.840.41 కోట్లు మంజూరు చేసినట్లు సీఎం పేర్కొన్నారు

•ఏపీలో పునరుత్పాదక ఇంధన రంగానికి ఊతమిస్తూ "సుజ్లాన్" సంస్థ రూ.10,500 కోట్ల పెట్టుబడులతో ముందుకు రావడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు

•బళ్లారి మండలం కుడితినిలో తనకు ఘన స్వాగతం పలికిన స్థానిక తెలుగు ప్రజలకు, యువతకు, టీడీపీ అభిమానులకు మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/PYWs




బళ్లారిలోని జిందాల్ విజయ్ నగర్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌కు కర్ణాటక మంత్రి నాగేంద్ర, ...
25/08/2026

బళ్లారిలోని జిందాల్ విజయ్ నగర్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌కు కర్ణాటక మంత్రి నాగేంద్ర, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీలు బీకే పార్థసారథి, అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, అమిలినేని సురేంద్రబాబు, పల్లె సింధూర రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు పల్లె రఘునాథ్ రెడ్డి, ఏపీఐఐసీ డైరెక్టర్ చల్లా లక్ష్మీ ప్రసాద్, టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉమర్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.


Address

Markapuram
Markapur
523316

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Markapuram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share