25/03/2026
తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి: ఇంధన కొరతపై వస్తున్న పుకార్లను దయచేసి నమ్మకండి.
దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ పెట్రోల్ మరియు డీజిల్ కొరత ఏమీ లేదు.
చమురు కంపెనీలు మరియు డీలర్ల అసోసియేషన్లు తగినంత ఇంధన నిల్వలు ఉన్నాయని, ఎటువంటి అంతరాయం లేకుండా సరఫరా కొనసాగుతోందని స్పష్టంగా ప్రకటనలు విడుదల చేశాయి.
గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ Narendra Modi గారి ప్రభుత్వం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది.
ఆందోళనతో అవసరానికి మించి ఇంధనాన్ని కొనుగోలు చేయడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మీకు అవసరమైనంత మేరకే కొనుగోలు చేయండి.