02/09/2026
వెయ్యి రోజుల వేల కలలు నెరవేరిన రోజులు.
పదేళ్ల నిరీక్షణలు పాలించిన ఈ వెయ్యి రోజుల్లో
నిలువ నీడ లేక దొర డబుల్ బెడ్రూం దగాకోరు మాటలకు విసిగిపోయి, రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లు వచ్చింది ఈ వెయ్యి రోజుల్లోనే.
పదేళ్లలో రాని ఇండ్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అన్నీ వచ్చాయి ఈ వెయ్యి రోజుల్లోనే.
వెయ్యి రోజుల నుంచి నిర్విరామంగా రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న మన రేవంతన్న ప్రభుత్వం.
🔸మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభం.
🔸 ₹500కే గ్యాస్ సిలిండర్ పథకం అమలు.
🔸గృహజ్యోతి ద్వారా 55 లక్షల కుటుంబాలకు పైగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.
🔸రాజీవ్ ఆరోగ్యశ్రీ/చేయూత ద్వారా ఆరోగ్య భద్రతను ₹10 లక్షల వరకు పెంపు.
🔸₹2 లక్షల వరకు రైతు రుణమాఫీ, 25.55 లక్షల మంది రైతులకు రూ.22,000 కోట్లకు పైగా రుణాలు మాఫీ.
🔸రైతు భరోసా మొత్తాన్ని ఎకరాకు ₹12,000కు పెంపు.
🔸సన్నవడ్లకు రూ.500 బోనస్.
🔸రైతుల నుంచి భారీగా ధాన్యం కొనుగోలు చేసి మార్కెట్ భరోసా కల్పించడం.
🔸గల్ఫ్ భరోసా, గల్ఫ్ దేశాల్లో మరణించిన తెలంగాణ బిడ్డల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం.
🔸ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదలకు సొంతింటి కోసం ₹5 లక్షల సహాయం.
🔸పదేళ్ల తర్వాత లక్షల్లో కొత్త రేషన్ కార్డుల జారీ, పేదలకు ఆహార భద్రత బలోపేతం.
🔸ఒక్కో వ్యక్తికి 6 కిలోల నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ.
🔸వేలాది ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చర్యలు.
🔸డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ నియామకాలకు ప్రాధాన్యం.
🔸పోలీస్ శాఖలో కానిస్టేబుల్, ఎస్‌ఐ నియామకాలు.
🔸తెలంగాణ వచ్చిన తర్వాత పేపర్ లీకులు లేకుండా గ్రూప్ 1 పరీక్ష నిర్వహించి నియామకాలు చేపట్టడం.
🔸యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు.
🔸ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చి విద్యను బలోపేతం చేయడం.
🔸కులగణన నిర్వహణ ద్వారా సామాజిక డేటా సేకరణ.
🔸ఎస్సీ వర్గీకరణకు పరిష్కారం, వర్గీకరణ అమలు చేసిన మొదటి రాష్ట్రం.
🔸మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, వ్యాపార అవకాశాల విస్తరణ.
🔸మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సుల యాజమాన్య అవకాశాలు కల్పించడం.
🔸ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యా విస్తరణ.
🔸విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ కార్యక్రమాలు.
🔸మూసీ నది పునరుజ్జీవన, పరివాహక ప్రాంత అభివృద్ధికి శ్రీకారం.
🔸ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి శ్రీకారం.
🔸హైదరాబాద్ మెట్రో విస్తరణకు భూసేకరణ.
🔸రీజినల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్ల నిర్మాణం ప్రారంభం.
🔸సంగారెడ్డి–జహీరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్, కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ వంటి పారిశ్రామిక ప్రాజెక్టులకు ప్రాధాన్యం.
🔸తెలంగాణను పెట్టుబడులు, ఐటీ, లైఫ్ సైన్సెస్, పరిశ్రమలకు ప్రధాన గమ్యస్థానంగా తీర్చిదిద్దే చర్యలు.
ఇలా చెప్పుకుంటూ పోతే రోజులు సరిపోవు, రాసుకుంటూ పోతే పుస్తకాలు సరిపోవు.
ఇవన్నీ కేవలం రెండున్నర సంవత్సరాల్లోనే చేసి చూపించింది మన రేవంతన్న ప్రజా ప్రభుత్వం.