BspAlampur

BspAlampur Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from BspAlampur, NagarKurnool.

*నాగర్ కర్నూల్ పార్లమెంటు  ఎన్నికలలో సంబంధించిన కళాకారుల  వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే గారు* ..ఈరోజు గద్వా...
22/04/2024

*నాగర్ కర్నూల్ పార్లమెంటు ఎన్నికలలో సంబంధించిన కళాకారుల వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే గారు* ..

ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు త్వరలో జరగబోయే నాగర్ కర్నూల్ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా *అభ్యర్థి డా!! ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారి* తరపున గద్వాల నియోజకవర్గంలోని ప్రచారానికి సంబంధించిన కళాకారుల వాహనాన్ని ను *ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు* జెండా ఊపి ప్రారంభించడం జరిగినది.

👉ఈ కార్యక్రమంలో జిల్లా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత గడ్డం కృష్ణారెడ్డి, జెడ్పిటిసి రాజశేఖర్, వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి ధరూర్ మండల పార్టీ అధ్యక్షుడు డి.ఆర్ విజయ్, మున్సిపల్ కో ఆప్షన్ నెంబర్ మోబిన్ , బిఆర్ఎస్ పార్టీ నాయకులు సతీష్ , వంట భాస్కర్, మోబిన్, పవన్ యాదవ్ , ఈశ్వర్, మన్యం, ప్రదీప్, కళాకారులు చరణ్ బృందం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

20/04/2024
బిసి రిజర్వేషన్ల పితామహుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి మహనీయులు బిందేశ్వర్ ప్రసాద్ మండల్ గారి వర్ధంతి సందర్భంగా వారికి నివా...
13/04/2024

బిసి రిజర్వేషన్ల పితామహుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి మహనీయులు బిందేశ్వర్ ప్రసాద్ మండల్ గారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు.....

*మీడియా ప్రకటన*తేదీ:08-04-2024నాగర్ కర్నూల్ *పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించాలి:భారాస నేత డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కు...
08/04/2024

*మీడియా ప్రకటన*
తేదీ:08-04-2024
నాగర్ కర్నూల్

*పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించాలి:భారాస నేత డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్*

*మ్యానిఫెస్టోలో అబద్దపు హామీలు నమ్మి మోసపోవద్దు*

అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ దొంగ హామీలు ఇచ్చి,అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను తుంగలో తొక్కిందని భారత రాష్ట్ర సమితి నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్ధి డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా సోమవారం నాగర్ కర్నూల్ లో పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చే అబద్ధపు హామీలు, మ్యానిఫెస్టోలు నమ్మి ప్రజలెవరూ మోసపోవద్దన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా గారడీల పాలన సాగిస్తున్నారని విమర్శించారు. పార్లమెంటు ఎన్నికలు వంద రోజుల అబద్దాల కాంగ్రెస్ ప్రభుత్వం,పదేళ్ల నిజమైన పాలన అందించిన భారాసల మధ్య జరుగుతున్నాయన్నారు.గత కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్టం సస్యశ్యామలం అయిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనలో కరువు వచ్చి పంటలు ఎండిపోతున్న,రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.

*ప్రాంతీయ పార్టీలను మట్టుపెట్టాలనే కుట్ర:సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,మాజీ మంత్రి*

కాంగ్రెస్, బీజేపి పార్టీలు రెండు కలిసి ప్రాంతీయ పార్టీలను మట్టుపెట్టాలని చూస్తున్నాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముందు చూపు లేకపోవడం వల్లే సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నయని ఆవేదన వ్యక్తం చేశారు.జాతీయ పార్టీలైన కాంగ్రెస్,భాజపా వల్లే ఉత్తర భారత దేశం అభివృద్ధిలో వెనుకబడిందని అన్నారు. ప్రాంతీయ పార్టీల మూలంగానే దక్షిణ భారత దేశం అభివృద్ధి చెందిందని తెలిపారు. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి లో గుడిపల్లి వరకు సాగునీరు ఇచ్చిన ఘనత కేసీఆర్ దేనని అన్నారు.10 ఏళ్లు అభివృద్ధి చేసిన రాష్ట్రాన్ని 100 రోజుల్లోనే కాంగ్రెస్ బ్రష్టు పట్టించిందని ఆరోపించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు.

*24 గంటలు విద్యుత్ ఇచ్చిన ఘనత కేసీఆర్ దే:మర్రి జనార్దన్ రెడ్డి,నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే*

రైతులకు 24 గంటల విద్యుత్ ఇచ్చిన ఘనత కేసీఆర్ దేనని నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. భారాస పాలనలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోలేక పోవడం వల్లే ఓడిపోయమన్నారు. రైతులకు సాగనీరు అందించడంలో మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కందనూలు చెరువు ఎండిపోవడానికి కా

నాగర్ కర్నూల్ ప్రశ్నిస్తోంది
06/04/2024

నాగర్ కర్నూల్ ప్రశ్నిస్తోంది

*మీడియా ప్రకటన*తేదీ:03-04-2024 వనపర్తి *అబద్ధపు హామీల కాంగ్రెస్ ను ఓడించాలి:డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్* *కాంగ్రెస్‌ పాలనల...
03/04/2024

*మీడియా ప్రకటన*
తేదీ:03-04-2024
వనపర్తి

*అబద్ధపు హామీల కాంగ్రెస్ ను ఓడించాలి:డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్*

*కాంగ్రెస్‌ పాలనలో కరువు, విద్యుత్ సమస్యలు*

*భారాస ను భారీ మెజార్టీతో గెలిపించాలి*

రాబోయే పార్లమెంటు ఎన్నికలు వంద రోజుల అబద్దాల కాంగ్రెస్ ప్రభుత్వం, పదేళ్లు నిజమైన పాలన అందించిన భారాస ల మధ్య జరిగే ఎన్నికలని, ఈ ఎన్నికల్లో భారాస విజయం ఖాయమని నాగర్ కర్నూలు పార్లమెంట్ భారాస అభ్యర్ధి డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో అబద్ధపు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ను నమ్మి ఓట్లేసిన ప్రజలు వంద రోజుల్లోనే మోసపోయారన్నారు. గత పదేళ్లు తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వాన్ని ప్రజలు ఇప్పుడు కోరుకుంటున్నారని తెలిపారు. రైతులు కష్టాల్లో ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టించుకోవడంలేదని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష పార్టీ నేతలను బెదిరించి కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలపై భారాస నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతూ భయబ్రాంతులకు గురిచే చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు ఉన్నాయన్న ఆయన సాగునీరు అందక పంటలు ఎండిపోయి రైతులు చావు అంచుల్లోకి వెళ్తున్నారని అవేదన చెందారు.

గతంలో ఎంపీ,ఎమ్మెల్యేగా పనిచేసిన మల్లు రవి ఈ ప్రాంతానికి చేసిన అభివృద్ధి ఏమిటో చూపించాలని డిమాండ్ చేశారు.భారాస ఎంపీగా గెలిచి పార్టీ మారిన రాములు ఐదేళ్లలో పార్లమెంటులో అడిగిన ప్రశ్నలు కేవలం ఆరు మాత్రమేనన్నారు. ఆయన కుమారుడిని బిజెపి ఎంపీగా గెలిపిస్తే 600 ప్రశ్నలు అడుగగలడానని ఎద్దేవా చేశారు.

అధికార పార్టీ నేతలు భారాస నాయకులను ఎన్ని ప్రలోభాలు పెట్టినా, బెదిరింపులకు పాల్పడినా రానున్న లోక్ సభ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు.

*సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,మాజీ మంత్రి*

బీఆర్ఎస్ నేతలను భయబ్రాంతులకు గురి చేసి, కాంగ్రెస్ లో చేర్చుకుంటూ భారాసను ఖాళీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనడమంటే తెలంగాణ ఉద్యమ కారులను అవమానించడమేనన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య కేవలం రెండు శాతం ఓట్లేనని తెలిపిన ఆయన కాంగ్రెస్ నాయకులు అధికారం రాగానే ఎగిరెగిరి

*మీడియా ప్రకటన*తేదీ:31-03-2024 గద్వాల *భారాస ను భారీ మెజార్టీతో గెలిపించాలి: డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్* *కాంగ్రెస్‌ పాలన...
31/03/2024

*మీడియా ప్రకటన*
తేదీ:31-03-2024
గద్వాల

*భారాస ను భారీ మెజార్టీతో గెలిపించాలి: డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్*

*కాంగ్రెస్‌ పాలనలో రైతులకు తీరని అన్యాయం*

తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని,రానున్న లోక్ సభ ఎన్నికల్లో భారాసను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నాగర్ కర్నూలు పార్లమెంట్ భారాస అభ్యర్ధి డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తలు,ఉద్యమకారుల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు.

రైతులు కష్టాల్లో ఉన్నారని కేసీఆర్ పొలాల్లో పర్యటిస్తుంటే  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం గులాబీ నేత కేకే ఇంటికి వెళ్ళి, కాంగ్రెస్ లోకి ఆహ్వనిస్తున్నారని విమర్శించారు.కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేక ప్రతిపక్ష పార్టీ నేతలను కాంగ్రెస్ లో చేర్చుకంటున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని మండిప‌డ్డారు.రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించినా ఇంతవరకు అమలు కాలేదన్నారు.

రాష్ట్రంలో కరెంట్ కోతలు ఉన్నాయన్నారు.సాగునీరు అందక పంటలు ఎండిపోయి రైతులు చావు అంచుల్లోకి వెళ్తున్నారని అవేదన చెందారు.కేసీఅర్ పాలనలో ఇలా ఉండేదా అని కార్యకర్తలను ఉద్దేశించి ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ఛైర్మెన్ గా అవకాశం ఇస్తానంటే వద్దన్న మాట వాస్తవమేనన్నారు.భారాస-బీఎస్పీ పొత్తులు విఫలం కావడంవల్లే బీఆర్ఎస్ లో చేరినట్లు తెలిపారు. బిజెపి కుట్రల వల్లే భారాస-బీఎస్పీ పొత్తులు విఫలమయ్యాయని అన్నారు.అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా బెదిరింపులకు పాల్పడినా మాట తప్పకుండా, మడమ తిప్పకుండా కేసీఆర్ వెంట నడుస్తానని అన్నారు.

సంక్షేమ గురుకులాల కార్యదర్శిగా గత ప్రభుత్వ హయాంలో ఎంతో మంది పేద పిల్లలను అంతర్జాతీయ స్థాయి విద్యను అందించేలా కృషి చేశానని తెలిపారు.బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బెదిరింపులకు ఎవరు భయపడాల్సిన అవసరం లేదన్న ఆయన కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ లను ఓడించి,నాగర్ కర్నూల్ లో భారాస గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కలిసి కట్టుగా పనిచేయలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి నాయకులు గడ్డం కృష్ణారెడ్డి,పటేల్ ప్రభాకర్ రెడ్డి,వెంకట్ రాములు, పద్మ వెంకటేశ్వర రెడ్డి ,ప్రభాకర్ రెడ్డి, మ

ప్రతి ఒక్కరికి ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు
31/03/2024

ప్రతి ఒక్కరికి ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు

Address

NagarKurnool
509209

Website

Alerts

Be the first to know and let us send you an email when BspAlampur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share