Manohar Gandamalla

Manohar Gandamalla Social Engineer | Lifetime Congressi | Ambedkarite | Former NSUI President-MGU | Next PM of India Rahul Gandhi 🔥 | 𝐏𝐫𝐨𝐮𝐝 𝐈𝐧𝐝𝐢𝐚𝐧 🇮🇳

మిత్రో....ఈ విషయం తెలిసిందా..!!EVM లు కాకుండా బ్యాలెట్ పద్ధతిలో జరిగిన పంజాబ్ మున్సిపల్ ఎన్నికలలో,బిజెపి పార్టీ వారు 114...
30/05/2026

మిత్రో....
ఈ విషయం తెలిసిందా..!!
EVM లు కాకుండా బ్యాలెట్ పద్ధతిలో జరిగిన పంజాబ్ మున్సిపల్ ఎన్నికలలో,బిజెపి పార్టీ వారు 1142 స్థానాలలో డిపాజిట్లు కోల్పోయారట.🫩

ఈ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల కమిషన్, జ్ఞానేష్ కుమార్ పాత్ర లేకపోవడం చాలా బాధాకరం😛

సెప్టెంబర్ 2019లో డి. కె. శివకుమార్‌కు బీజేపీ తరపున ముఖ్యమంత్రి అయ్యే ఆఫర్ వచ్చింది.హిమంత బిస్వా శర్మ మరియు సువేందు అధిక...
29/05/2026

సెప్టెంబర్ 2019లో డి. కె. శివకుమార్‌కు బీజేపీ తరపున ముఖ్యమంత్రి అయ్యే ఆఫర్ వచ్చింది.

హిమంత బిస్వా శర్మ మరియు సువేందు అధికారికి ఇచ్చినటువంటి ఆఫరే ఆయనకూ ఇచ్చారు.

కానీ ఈ ప్రతిపక్ష నాయకుడి డీఎన్ఏ (DNA) కొంచెం భిన్నమైంది, ఆయన అమిత్ షాతో నేరుగా ఢీకొన్నారు.

ఫలితంగా ఈ వ్యక్తి చేతులకు బేడీలు పడ్డాయి.

50 రోజుల హింస... తిహార్ జైలులో ఉగ్రవాదులను కూడా ఉంచని ఒక ప్రత్యేక సెల్‌లో ఆయనను ఉంచారు.

ఆ సమయంలో సోనియా గాంధీ ఈయనను కలవడానికి జైలుకు వెళ్లారు.

మరియు ఈ రోజు 7 సంవత్సరాల తర్వాత, దక్షిణాది చాణక్యుడు కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

డి. కె. శివకుమార్ ప్రతిపక్ష పార్టీలన్నింటికీ ఒక సందేశం ఇచ్చారు.

అమిత్ షా, మోదీల జైలు మరియు ఈడీ (ED)ల భయాల కంటే ముందే కేవలం విజయం మాత్రమే ఉంది.

బీజేపీ హైకమాండ్ శివకుమార్‌తో డీల్ చేసుకోవాలని చూసింది, కానీ ఈయన ఒప్పుకోలేదు.

ఈడీ మనీ లాండరింగ్ కేసు పెట్టింది.

5 మార్చి 2024న సుప్రీంకోర్టు ఆ కేసే నకిలీదని తేల్చేసింది.
నిజంగానే అమిత్ షా జైలు భయానికి అవతలే విజయం ఉంది, కాకపోతే ఈ వ్యక్తి లాగా ధైర్యం ఉండాలి.

బీజేపీకి కర్ణాటకలోకి ఎంట్రీ ఇచ్చే అన్ని మార్గాలు మూసుకుపోయాయి... కాంగ్రెస్ 2029 పూర్తి లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.👊

CM, DyCM బ్రేక్‌ఫాస్ట్‌ మీటింగ్‌...సిద్ధూకు డీకే శివకుమార్‌ పాదాభివందనం 🙏బెంగళూరులోని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నివాసంలో జ...
28/05/2026

CM, DyCM బ్రేక్‌ఫాస్ట్‌ మీటింగ్‌...

సిద్ధూకు డీకే శివకుమార్‌ పాదాభివందనం 🙏

బెంగళూరులోని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నివాసంలో జరిగిన బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ హాజరుకాగా, ఇరువురు నేతల మధ్య అత్యంత ఆత్మీయ వాతావరణం కనిపించింది. సమావేశం సందర్భంగా సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ ఒకరినొకరు ఆత్మీయ ఆలింగనం చేసుకోగా, అనంతరం సిద్ధరామయ్యకు డీకే శివకుమార్‌ పాదాభివందనం చేసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.

అధిష్టానం ఆదేశాల మేరకే సీఎం పదవికి రాజీనామా చేశా - సిద్ధరామయ్య.కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి డీకే శివకుమార్...శివకుమార్ పొల...
28/05/2026

అధిష్టానం ఆదేశాల మేరకే సీఎం పదవికి రాజీనామా చేశా - సిద్ధరామయ్య.

కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి డీకే శివకుమార్...

శివకుమార్ పొలిటికల్ ప్రొఫైల్.. !

కర్ణాటక CMగా బాధ్యతలు చేపట్టనున్న DK శివకుమార్ పూర్తి పేరు దొడ్డలహళ్లి కెంపేగౌడ శివకుమార్. 1962 మే 15న కనకపుర ప్రాంతంలో వొక్కలిగ సామాజిక వర్గంలో జన్మించారు. 1989లో సతనూరు నుంచి తొలిసారి MLA అయ్యారు. ఆపై కన్నడ రాజకీయాల్లో ట్రబుల్ షూటర్గా ఎదిగారు. శివకుమార్-ఉషా దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఐశ్వర్య, ఆభరణ.. కుమారుడు ఆకాశ్ ఉన్నారు. 2023 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం DKకు రూ. 1,400CRకు పైగా ఆస్తులున్నాయి.

27/05/2026

నీ ప్రవర్తనకు ఉగ్రవాది అనే పదం చాలా చిన్నది...! నీలాంటి లఫూట్ నాయాలకు ప్రజలు ఎలా ఓట్లు వేశారో ఏమో...
నువ్వు ఏ కోవకు చెందిన వాడివో ప్రజలే నిర్ణయిస్తారులే....

రాజీవ్ గాంధీ.... భారతదేశాన్ని ఆధునిక ప్రపంచం వైపు పరుగులు పెట్టించిన దార్శనికుడు ♥️🙏దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధ...
21/05/2026

రాజీవ్ గాంధీ.... భారతదేశాన్ని ఆధునిక ప్రపంచం వైపు పరుగులు పెట్టించిన దార్శనికుడు ♥️🙏

దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఆయన గొప్పతనాన్ని గుర్తు చేసుకోవడం ప్రతి భారతీయుని కర్తవ్యం. 1984లో ఇందిరా గాంధీ హత్య తర్వాత, 40 ఏళ్ల వయసులో భారతదేశ ప్రధానమంత్రి అయిన రాజీవ్ గాంధీ, దేశ చరిత్రలో ఒక కొత్త యుగానికి నాంది పలికారు. విమాన పైలట్‌గా తన వృత్తిని ప్రారంభించిన ఆయన, రాజకీయాల్లోకి వచ్చాక కూడా యువత్వం, ఆధునిక దృక్పథం మరియు దూరదృష్టితో దేశాన్ని ముందుకు నడిపించారు.

రాజీవ్ గాంధీ పాలన కాలం భారతదేశానికి “యువ యుగం”గా పిలువబడుతుంది. “కంప్యూటర్లు భారత భవిష్యత్తు” అని ఆయన చెప్పిన మాటలు చరిత్రలోకి నిలిచిపోయాయి. ఆయన ప్రోత్సాహంతోనే దేశంలో సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ పుట్టుకకు పునాదులు వేయబడ్డాయి. టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు, గ్రామీణ ప్రాంతాల్లోకి ఫోన్ సౌకర్యం విస్తరణ... ఇవన్నీ ఆయన కాలంలోనే మొదలయ్యాయి. ఈ పునాదుల మీదనే తర్వాతి కాలంలో భారత్ IT శక్తిగా ఎదిగింది.

గ్రామ స్థాయి ప్రజాస్వామ్యాన్ని బలపరచడానికి పంచాయతీ రాజ్ వ్యవస్థను శక్తివంతం చేశారు. మహిళలు, దళితులు, వెనుకబడిన వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పించడంలో ఆయన చేసిన కృషి అమూల్యమైనది. నవోదయ విద్యాలయాల స్థాపన ద్వారా గ్రామీణ ప్రతిభావంతులకు నాణ్యమైన విద్య అందించే మార్గం చూపారు. విదేశాంగ విధానంలో కూడా ఆయన ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకున్నారు. పాకిస్తాన్‌తో సంబంధాలు మెరుగుపరచడం, చైనాతో సాధారణీకరణ, శ్రీలంకలో శాంతి స్థాపనకు ప్రయత్నాలు.. ఇవన్నీ ఆయన దూరదృష్టిని ప్రతిబింబిస్తాయి.

రాజీవ్ గాంధీ సరళత, నిజాయితీ మరియు కులం-మతం భేదాలు లేని దృక్పథం కోసం ఎప్పుడూ గుర్తుండిపోతారు. ఆయన భారత్‌ను 21వ శతాబ్దపు ఆధునిక దేశంగా ఊహించారు. ఆర్థిక సంస్కరణలకు మొదటి అడుగులు వేయడం, యువకులు-మహిళలు-శాస్త్రవేత్తలను ప్రోత్సహించడం ఆయన పాలనలోని ముఖ్యాంశాలు..

1991 మే 21న శ్రీపెరంబదూర్‌లో జరిగిన దారుణ బాంబు పేలుడులో ఆయన మనల్ని వీడిపోయినప్పటికీ, ఆయన స్వప్నాలు ఇప్పటికీ భారతదేశాన్ని ముందుకు నడుపుతున్నాయి. డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, గ్రామ స్వరాజ్యం వంటి అనేక కార్యక్రమాలు రాజీవ్ గాంధీ ఆలోచనల నుంచి పుట్టినవే.

రాజీవ్ గాంధీ కేవలం ఒక ప్రధాని మాత్రమే కాదు...ఆధునిక భారత్‌కు స్ఫూర్తి. నాయకత్వం అంటే వయసు కాదు, దృక్పథం అని ఆయన జీవితం మనకు గుర్తు చేస్తుంది. ఆయన గొప్పతనం ఎప్పటికీ భారతీయుల హృదయాల్లో జీవించి ఉంటుంది.

నేడు రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మహానేతను గుర్తు చేసుకుంటూ ఘన నివాళులర్పిస్తున్నాము 💐💐🙏

జై హింద్! రాజీవ్ గాంధీ అమర్ రహే!

తమిళనాడులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి...విజయ్ నేతృత్వంలోని TVK కూటమికి భారీ బలం చేకూరింది. CPI, CPM పార్టీల మద...
08/05/2026

తమిళనాడులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి...

విజయ్ నేతృత్వంలోని TVK కూటమికి భారీ బలం చేకూరింది. CPI, CPM పార్టీల మద్దతు లభించడంతో TVK మరింత శక్తివంతంగా మారింది. ఇప్పటికే VCK మరియు INC తమిళనాడు మద్దతు ఉన్న నేపథ్యంలో, ఈ కూటమి మొత్తం బలం ఇప్పుడు 118 సీట్లకు చేరింది.

ఇది రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా మారే అవకాశముంది. ప్రభుత్వం ఏర్పాటు దిశగా TVK కూటమి వేగంగా ముందుకు సాగుతోంది.

ఈ నేపథ్యంలో TVK అధినేత విజయ్ ఈ రోజు సాయంత్రం గవర్నర్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు కోసం క్లెయిం చేయనున్నట్లు సమాచారం.

05/05/2026

చిరంజీవి, రజనీకాంత్, పవన్ కళ్యాణ్ వల్ల కాలేదు...

మీడియా సపోర్టు కూడా లేదు, అధికారం అండ లేదు.

రాజకీయ మంత్రతంత్రాలు తెలియదు..

కేవలం తన నమ్ముకున్నది అంబేద్కర్ ,పెరియార్, పూలే సిద్ధాంతాలు మాత్రమే...

దళపతి విజయ్ తమిళ ప్రజల ప్రేమాభిమానాలను మాత్రమే నమ్ముకున్నాడు...

ఒక్కడిగా వచ్చాడు... చరిత్ర సృష్టించాడు ✌️
Single.. it will be King of Jungle 🔥

TVK కు కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలని కోరిన విజయ్ తండ్రి.... రాహుల్ గాంధీ గారితో చర్చల తర్వాత మద్దత్ లాంఛనమే !

కేరళంలో హస్తం హవా... 99 సీట్లలో ఘనవిజయం
05/05/2026

కేరళంలో హస్తం హవా... 99 సీట్లలో ఘనవిజయం

ఇండియా సెంట్రల్ లో మెజారిటీ రాష్టలలో బిజెపి సొంతంగా గెలవలేదు, ప్రాంతీయ పార్టీలే ఆ అవకాశాన్ని ఇచ్చాయి.2021లో "కాంగ్రెస్‌క...
04/05/2026

ఇండియా సెంట్రల్ లో మెజారిటీ రాష్టలలో బిజెపి సొంతంగా గెలవలేదు, ప్రాంతీయ పార్టీలే ఆ అవకాశాన్ని ఇచ్చాయి.

2021లో "కాంగ్రెస్‌కు విలువ లేదు" అని తృణమూల్ ఎగతాళి చేసింది , ఇప్పుడు బెంగాల్‌లో బిజెపి గెలిచింది.

యూపీలో "కాంగ్రెస్ ఒక భారం" అని ఎస్పీ అంది, అక్కడ బిజెపి వరుసగా రెండుసార్లు గెలిచింది.

దేశానికి మేమే ప్రత్యామ్నాయం" అన్న ఆమ్ ఆద్మీ పార్టీ, ఢిల్లీని నిలబెట్టుకోలేకపోయింది, పంజాబ్‌లో పట్టు కోల్పోయింది

ఇక లెఫ్ట్ పార్టీలు పదే పదే తృతీయ కూటమి అంటూ "కాంగ్రెస్ పని అయిపోయింది" అంటే, కేరళ ప్రజలు లెఫ్ట్‌ను పక్కన పెట్టి కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారు.

తమిళనాడులో డిఎంకె కుటుంబ పాలన సాగిస్తుంటే, ఒక కొత్త పార్టీ వారి యువత ఓట్లను తన్నుకుపోయింది.

ఇక్కడ ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. బిజెపిని ఆపడం కంటే కాంగ్రెస్‌ను కూటమికి దూరంగా ఉంచడానికే ఎక్కువ కష్టపడ్డ ప్రాంతీయ పార్టీలన్నీ, ఇప్పుడు ఉనికి కోసం పోరాడుతున్నాయి.

ఈ "థర్డ్ ఫ్రంట్" అనేది ఒక భ్రమ మాత్రమే, అది ఎప్పుడూ బిజెపిని ఓడించలేదు.

కానీ కాంగ్రెస్ మాత్రం కర్ణాటకను గెలిచింది, తెలంగాణను సాధించింది, హిమాచల్‌లో నెగ్గింది. కేరళ నెగ్గింది ఇవాళ కాంగ్రెస్ సొంతంగా కోల్పోయిన రాష్టం అస్సాం మాత్రమే

ఈరోజు పార్లమెంటులో బిజెపికి పూర్తి మెజారిటీ లేకపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీయే. దీనికి ప్రధాన బలం దేశంలోని ప్రతి రాష్ట్రంలో, ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న పటిష్టమైన కేడర్.

ప్రాంతీయ పార్టీలకు లేని విధంగా, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఈ కార్యకర్తల సైన్యమే కాంగ్రెస్‌ను మళ్ళీ నిలబెడుతోంది.

ప్రాంతీయ నాయకులందరూ కాంగ్రెస్‌ను "మునిగిపోయే పడవ" అని విమర్శిస్తున్నా, బిజెపికి ఎదురు నిలిచి ప్రయాణిస్తున్న ఏకైక పడవ కాంగ్రెస్ మాత్రమే.

ప్రాంతీయ పార్టీల సమస్య బిజెపి కాదు, వారి అహంకారం. ఆ అహంకారానికే "థర్డ్ ఫ్రంట్ రాజకీయం" అని పేరు.

బిజెపిని ఢీకొట్టగల ఏకైక జాతీయ పార్టీతో కలిసి నడవాలి, లేదంటే మీ పార్టీలు చరిత్రలో కలిసిపోతాయి. ఇది కాంగ్రెస్ అడుగుతున్న సహాయం కాదు, కాలం చెబుతున్న నిజం.

Address

Nalgonda
508001

Alerts

Be the first to know and let us send you an email when Manohar Gandamalla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Manohar Gandamalla:

Share