21/04/2026
*పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని తిరుపతమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు.*
_పెనుగంచిప్రోలు, ఏప్రిల్ 21: జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శ్రీ సామినేని ఉదయభాను గారి సూచనలు మేరకు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో జనసైనికులు ప్రత్యేక పూజలు నిర్వహించారు._
_ఈ సందర్భంగా అమ్మవారికి కుంకుమార్చన, అభిషేకం నిర్వహించి, పవన్ కళ్యాణ్ గారు త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని ప్రజాసేవలో మరింత చురుగ్గా పాల్గొనాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు._
_ఈ కార్యక్రమంలో రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ తునికిపాటి శివ, నీటి సంఘం అధ్యక్షులు YNR మాస్టర్, దేవస్థానం ఉత్సవ కమిటీ సభ్యులు తన్నీరు గోపినాథ్, జనసేన నాయకులు లగడపాటి శంకర్, నల్లపునేని వెంకటనారాయణ, అంగజాల కాశీ, ప్రొద్దుటూరి రాజాశేఖర్, కాకాని పద్మ, బొమ్మి రాణి, కాశి శేఖర్,కందుకూరి నవీన్ కుమార్, ఉదయ్, పవన్, లింగరాజు తదితరులు పాల్గొన్నారు._
JanaSena Party Pawan Kalyan