Ward 54corporator YSRCP Nellore City

Ward 54corporator YSRCP Nellore City Die hard fans Aky �
(3)

నెల్లూరు నగరంలోని ఎన్‌టిఆర్‌ నగర్‌ చెరుకుతోట వద్ద నెల్లూరు నగర నియోజకవర్గ రెడ్డి సంక్షేమ సంఘము కార్యాలయాన్ని, ఫ్రీజర్‌ బ...
13/01/2024

నెల్లూరు నగరంలోని ఎన్‌టిఆర్‌ నగర్‌ చెరుకుతోట వద్ద నెల్లూరు నగర నియోజకవర్గ రెడ్డి సంక్షేమ సంఘము కార్యాలయాన్ని, ఫ్రీజర్‌ బాక్సులను నగర శాసనసభ్యులు డా॥ పి.అనీల్‌కుమార్‌ ప్రారంభించారు. గతంలో రామమూర్తినగర్‌కు ఓ అసోసియేషన్‌ను స్థాపించి అధ్యక్షులుగా చంద్రశేఖర్‌రెడ్డి వున్నారని, ప్రస్తుతం రెడ్డి సంక్షేమ సంఘము అధ్యక్షులుగా వుంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. రెడ్డి సామాజిక వర్గం అనేది వుండాలన్న ఆలోచనతో సంక్షేమ సంఘాన్ని ప్రారంభించి పేదవారికి సహాయసహకారాలు అందించే విధంగా సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నానన్నారు.



02/01/2024
18/12/2023

ఓటు వేసే వాళ్లకే మేము అభివృద్ధి చేస్తాం అంటే అది రాజకీయం...
భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని చరిత్రలో నిలిచిపోయే విధంగా అభివృద్ధి చేయడం నాయకుడి లక్షణం..

నెల్లూరు నగరంలో చరిత్రలో నిలిచే విధంగా జగనన్న ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన నెల్లూరు నగర శాసనసభ్యులు డాక్టర్ పి. అనీల్ కుమార్ యాదవ్ గారు.



10/12/2023

నెల్లూరు..

నగర నియోజకవర్గ పరిధిలోని 13వ డివిజన్ ప్రాంతంలో పర్యటించిన మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ గారు.

నెల్లూరు నగర నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం..

తుఫాన్ లలో కానరాని టిడిపి నేతలు..ప్రభుత్వం పై నోటికొచ్చిన విమర్శలు చేయడం తగదు అని మండిపాటు..

- 2015లో విపత్తు సంభవిస్తే ఆనాడు మేము ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రభుత్వంతో కలసి పని చేశామని.. ఎలాంటి విమర్శలు చేయలేదని గుర్తు చేసిన అనిల్ కుమార్ యాదవ్ గారు...


నెల్లూరు నగరంలోని 4వ డివిజన్‌ మైపాడు గేటు సెంటర్‌ వద్ద రూ.4 కోట్లతో నిర్మిస్తున్న మైపాడురోడ్డుకు సంబంధించి ఇరువైపులా డ్ర...
30/11/2023

నెల్లూరు నగరంలోని 4వ డివిజన్‌ మైపాడు గేటు సెంటర్‌ వద్ద రూ.4 కోట్లతో నిర్మిస్తున్న మైపాడురోడ్డుకు సంబంధించి ఇరువైపులా డ్రెయిన్లు, 4 లైన్‌ రోడ్డుకు సెంట్రల్‌ లైటింగ్‌ పనులకు నగర శాసనసభ్యులు డా॥ పి.అనీల్‌కుమార్‌ శంకుస్థాపన చేశారు. వచ్చే వారం రూ.2 కోట్లతో జాఫర్‌సాహెబ్‌కాలువ పొడుగునా వాకింగ్‌ ట్రాక్‌, పార్కు పనులకు సంబంధించి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుందని, త్వరలో 3వ డివిజన్‌కు సంబంధించి రూ.2 కోట్లతో రోడ్లు, డ్రెయిన్‌ పనుల పనులు ప్రారంభిస్తామన్నారు. నగరంలో అన్నీరకాలుగా అభివృద్ధి పనులు చేస్తున్నామని, అభివృద్ధిలో ఎక్కడా రాజీపడకుండా ముందుకెళ్తున్నామన్నారు.


నెల్లూరు నగరంలోని 39వ డివిజన్‌ పాములమాన్యం, గాయికసాయివీధి, తిరిసిపేట, గచ్చుకాలువ, తదితర ప్రాంతాలలో నగర శాసనసభ్యులు డా॥ ప...
30/11/2023

నెల్లూరు నగరంలోని 39వ డివిజన్‌ పాములమాన్యం, గాయికసాయివీధి, తిరిసిపేట, గచ్చుకాలువ, తదితర ప్రాంతాలలో నగర శాసనసభ్యులు డా॥ పి.అనీల్‌కుమార్‌ అధికారులతో కలిసి పర్యటించి, స్థానిక సమస్యలను అడిగి తెలుసుకొని వెంటనే సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. 39, 40 డివిజన్లకు సంబంధించి దాదాపు అన్నీ పనులు పూర్తి చేసుకున్నామని, బాద్‌షాపేటలో రూ.10 లక్షలకు సంబంధించి చిన్న చిన్న ప్యాచ్‌ వర్క్‌లు వున్నాయని, వచ్చేవారంలో ఆ పనులు కూడ ప్రారంభిస్తామన్నారు.


12/11/2023

Any Doubts...అంటున్న నెల్లూరు నగర ప్రజలు! మళ్ళీ మళ్ళీ నెల్లూరు నగర ప్రజలు గెలిపించుకొనేది అనీల్ అన్ననే..దాంట్లో ఎటువంటి డౌట్స్ లేవు.. ఇది పక్క!

09/11/2023

నెల్లూరు నగర నియోజకవర్గo 39వ డివిజన్ లో డా. పి. అనీల్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన రాజా రామ్ మోహన్ రాయ్ పార్క్. అక్కడ ఏర్పాటు చేసిన సౌకర్యాలు గురించి ఆనందం వ్యక్తం చేస్తున్న స్థానికులు.


నెల్లూరు నగరంలోని 42వ డివిజన్‌కు చెందిన టిడిపి నాయకులు షేక్‌ యజ్దాని, వారి మిత్రబృందం దాదాపు 300 మంది నగరంలోని ఇస్కాన్‌ ...
08/11/2023

నెల్లూరు నగరంలోని 42వ డివిజన్‌కు చెందిన టిడిపి నాయకులు షేక్‌ యజ్దాని, వారి మిత్రబృందం దాదాపు 300 మంది నగరంలోని ఇస్కాన్‌ సిటీ నందు గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నగర శాసనసభ్యులు డా॥ పి.అనీల్‌కుమార్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరగా, వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి అందిస్తున్న సంక్షేమం, చేస్తున్న అభివృద్ధిని చూసి ఆకర్షితులై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి, మాకు మద్దతుగా పార్టీలో చేరినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. పార్టీలో చేరినవారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. నగర నియోజకవర్గంలో అనేక ప్రాంతాల వారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సిద్ధంగా వున్నారన్నారు. పార్టీలో చేరిన వారిలో షబ్బీర్‌, ఖలీల్‌, మాబాషా, రిజ్వాన్‌, ఇస్మాయిల్‌, రఫి, షఫీ, తదితరులు వున్నారు.

నెల్లూరు నగరంలోని 49వ డివిజన్ సంతపేట ఈద్గా మిట్ట, నారాయణరావుపేట,  తదితర ప్రాంతాలలో నగర శాసనసభ్యులు డాక్టర్ పి. అనీల్ కుమ...
30/10/2023

నెల్లూరు నగరంలోని 49వ డివిజన్ సంతపేట ఈద్గా మిట్ట, నారాయణరావుపేట, తదితర ప్రాంతాలలో నగర శాసనసభ్యులు డాక్టర్ పి. అనీల్ కుమార్ గారు అధికారులతో కలిసి పర్యటించి, స్థానిక సమస్యలు అడిగి తెలుసుకొని, వెంటనే సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ముందుగా స్థానిక ప్రాంతంలో రూ.20 లక్షలతో నిర్మిస్తున్న సి.సి.రోడ్డు పనులకు శంకుస్థాపన చేసారు.

28/10/2023

*వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలలో నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్*...
*ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి*....

*ఎమ్మెల్యే అనిల్ మాట్లాడినాక నేను మాట్లాడిన కూడా బలహీనమే* ....

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి గారు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రాలలో నాకు ఇష్టమైన చిన్న తమ్ముడు అనిల్...
అనిల్ ఎంత మంచోడో ఒక ఉదాహరణ చెప్తా కొత్తగా మంత్రి అయ్యాడు నేను ప్రొద్దుటూరు నియోజకవర్గం పనులపై సచివాలయానికి వెళ్లాను అప్పుడే అనిల్ ఒక పది ,పదిహేను పోలీస్ కార్లతో సచివాలయం నుంచి వెళ్తున్నాడు నన్ను చూసి నేరుగా కారు దిగి నన్ను ఆలింగనం చేసుకొని "అన్నా" అని ఆప్యాయంగా పలకరించి ఒక 15 నిమిషాలు మాట్లాడాడు ఎంత పెద్ద పదవి వచ్చినా కూడా ఒదిగి ఉండే లక్షణాలున్న వ్యక్తి నా తమ్ముడు అనిల్...

నెల్లూరు నగరంలోని 13వ డివిజన్ సింహపురి హాస్పిటల్‌ సమీపంలోని బలిజపాళెం నందు రూ.90 లక్షలతో నూతనంగా నిర్మించిన ప్రైమరీ స్కూ...
28/10/2023

నెల్లూరు నగరంలోని 13వ డివిజన్ సింహపురి హాస్పిటల్‌ సమీపంలోని బలిజపాళెం నందు రూ.90 లక్షలతో నూతనంగా నిర్మించిన ప్రైమరీ స్కూల్‌ భవనాలను, అలాగే పాత మిట్టపాళెంలో రూ.70 లక్షలతో నిర్మించిన పార్కును నగర శాసనసభ్యులు డా॥ పి.అనీల్‌కుమార్‌ ప్రారంభించారు. స్థానిక డివిజన్ లోని యలమవారిదిన్నె, పాత మిట్టపాళెం, బలిజపాళెం ప్రాంతాలలో ఇప్పటికే రూ.2 కోట్లకు పైగా పార్కులను, అలాగే స్కూల్స్‌, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, అభివృద్ది చేసి, సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

నెల్లూరు నగరంలోని 40వ డివిజన్ కోనేటిమిట్ట, కొండదిబ్బ, మునిసిపల్ క్వార్టర్స్, తదితర ప్రాంతాలలో నగర శాసనసభ్యులు డాక్టర్ పి...
23/10/2023

నెల్లూరు నగరంలోని 40వ డివిజన్ కోనేటిమిట్ట, కొండదిబ్బ, మునిసిపల్ క్వార్టర్స్, తదితర ప్రాంతాలలో నగర శాసనసభ్యులు డాక్టర్ పి. అనీల్ కుమార్ గారు అధికారులతో కలిసి పర్యటించి, స్థానిక సమస్యలు అడిగి తెలుసుకొని, వెంటనే సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ముందుగా నగర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపి, అమ్మవారి ఆశీస్సులతో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారు, నగర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు.

నెల్లూరు నగరంలోని ఉడ్‌హౌస్‌ సంఘం నందు గల తవ్వా రంగయ్య కళ్యాణ మండపం నందు 6, 7, 8వ డివిజన్లకు సంబంధించిన వై.ఎస్‌.ఆర్‌.సి.ప...
17/10/2023

నెల్లూరు నగరంలోని ఉడ్‌హౌస్‌ సంఘం నందు గల తవ్వా రంగయ్య కళ్యాణ మండపం నందు 6, 7, 8వ డివిజన్లకు సంబంధించిన వై.ఎస్‌.ఆర్‌.సి.పి. నాయకులు, కార్యకర్తలతో నగర శాసనసభ్యులు డాక్టర్‌ పి. అనీల్‌ కుమార్‌ గారు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్‌రెడ్డి గారు ఇచ్చిన హామీలనే కాకుండ మరిన్ని పథకాలు రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు అందిస్తున్నారని, అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. స్థానిక ప్రాంతంలో సర్వేపల్లి కాలువకు ఇరువైపులా రీటైనింగ్‌ వాల్‌ నిర్మిస్తున్నామని, దీంతో కాలువ గట్టుపై నివసిస్తున్న ప్రజలకు ఇబ్బందులు లేకుండ చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధి, అందిస్తున్న సంక్షేమాలను ప్రజల వద్దకు తీసుకెళ్ళాలని నాయకులకు, కార్యకర్తలకు సూచించారు.

నెల్లూరు నగరంలోని 54వ డివిజన్‌ భగత్‌సింగ్‌ కాలనీలో 2వ నెంబరు జగనన్న లేఅవుట్‌లో నిర్మిస్తున్న ఇళ్ళ నిర్మాణాలను నగర శాసనసభ...
17/10/2023

నెల్లూరు నగరంలోని 54వ డివిజన్‌ భగత్‌సింగ్‌ కాలనీలో 2వ నెంబరు జగనన్న లేఅవుట్‌లో నిర్మిస్తున్న ఇళ్ళ నిర్మాణాలను నగర శాసనసభ్యులు డా॥పి.అనీల్‌కుమార్‌ అధికారులతో కలిసి పరిశీలించారు. నగర నియోజకవర్గానికి సంబంధించి నిర్మిస్తున్న పది వేల ఇళ్ళ పనులు త్వరితగతిన పూర్తి చేసి డిసెంబర్‌ 21వ తేదీన ప్రజలకు అందించాలన్న ఆలోచనతో ముందుకెళ్తున్నామని తెలిపారు. అనంతరం టిడ్కో ఇళ్ళలో మౌలిక సదుపాయాలు పరిశీలించి స్థానికంగా నివసిస్తున్న కుటుంబాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

నెల్లూరు నగరంలోని జనార్ధన్‌రెడ్డికాలనీ టిడ్కో కమ్యూనిటీ హాల్‌ నందు 53, 54వ డివిజన్లకు సంబంధించిన వై.ఎస్‌.ఆర్‌.సి.పి. నాయ...
15/10/2023

నెల్లూరు నగరంలోని జనార్ధన్‌రెడ్డికాలనీ టిడ్కో కమ్యూనిటీ హాల్‌ నందు 53, 54వ డివిజన్లకు సంబంధించిన వై.ఎస్‌.ఆర్‌.సి.పి. నాయకులు, కార్యకర్తలతో నగర శాసనసభ్యులు డాక్టర్‌ పి. అనీల్‌ కుమార్‌ గారు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. 53, 54వ డివిజన్లు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి అడ్డా అని, అలాంటి డివిజన్లను ప్రత్యేకంగా తీసుకొని ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధి, అందిస్తున్న సంక్షేమాలను ప్రజల వద్దకు తీసుకెళ్ళాలని నాయకులకు, కార్యకర్తలకు సూచించి, 2024లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

నెల్లూరు నగరంలోని వి.పి.ఆర్. కన్వెన్షన్ సెంటర్ నందు జరిగిన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ సమీక్ష సమ...
13/10/2023

నెల్లూరు నగరంలోని వి.పి.ఆర్. కన్వెన్షన్ సెంటర్ నందు జరిగిన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ సమీక్ష సమావేశంలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, వై.ఎస్.ఆర్.సి.పి. జిల్లా అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గార్లతో కలిసి నగర శాసనసభ్యులు డాక్టర్. పి. అనీల్ కుమార్ గారు పాల్గొన్నారు. ముందుగా దివంగత నేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

నెల్లూరు నగరంలోని నవాబుపేట షాదీమంజిల్ లో 9, 10, 11వ డివిజన్లకు సంబంధించిన వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు, కార్యకర్తలతో నగర శా...
03/10/2023

నెల్లూరు నగరంలోని నవాబుపేట షాదీమంజిల్ లో 9, 10, 11వ డివిజన్లకు సంబంధించిన వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు, కార్యకర్తలతో నగర శాసనసభ్యులు డాక్టర్ పి. అనీల్ కుమార్ గారు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. నగర నియోజకవర్గంలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా వుందని, నగరంలో అనేక అభివృద్ధి పనులతో పాటు శాశ్వత అభివృద్ధి పనులను కూడా చేసామని, మనం చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని తెలిపారు. 2024 మళ్ళీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకునే విధంగా ప్రతిఒక్కరూ కష్టపడి పని చేయాలని సూచించారు.

నెల్లూరు నగరంలోని 13వ డివిజన్‌ బాలాజీనగర్‌ గ్యాస్‌ గోడౌన్‌ వద్ద రూ.1.40 కోట్లతో నాలుగు పార్కులకు  నగర శాసనసభ్యులు డా॥ పి...
01/10/2023

నెల్లూరు నగరంలోని 13వ డివిజన్‌ బాలాజీనగర్‌ గ్యాస్‌ గోడౌన్‌ వద్ద రూ.1.40 కోట్లతో నాలుగు పార్కులకు నగర శాసనసభ్యులు డా॥ పి.అనీల్‌కుమార్‌ శంకుస్థాపన చేసి, ఈ నాలుగు పార్కులు పూర్తి అయితే మొత్తం నగర నియోజకవర్గంలో వంద శాతం పార్కులు పూర్తి చేసిన వారమవుతామని, అభివృద్ధి అంటే ఈ విధంగా వుంటుందని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండ, వారికి అనుగుణంగా మా ప్రభుత్వంలో అభివృద్ధి చేస్తున్నామని తెలియజేస్తున్నానన్నారు.

నెల్లూరు నగరంలోని 54వ డివిజన్‌ భగత్‌సింగ్‌ కాలనీ వద్ద పెన్నానది రీటైనింగ్‌ వాల్‌ నిర్మాణ పనులను నగర శాసనసభ్యులు డా॥ పి....
29/09/2023

నెల్లూరు నగరంలోని 54వ డివిజన్‌ భగత్‌సింగ్‌ కాలనీ వద్ద పెన్నానది రీటైనింగ్‌ వాల్‌ నిర్మాణ పనులను నగర శాసనసభ్యులు డా॥ పి.అనీల్‌కుమార్‌ అధికారులతో కలిసి పరిశీలించారు. వరదలు వచ్చినప్పుడు ఈ ప్రాంతం ముంపునకు గురవుతున్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా శాశ్వత పరిష్కార దిశగా రీటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టామని, పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు.


నెల్లూరు నగరంలోని 42వ డివిజన్‌ నందు గల *మీరామొహిద్దీన్‌ దర్గాలో నిర్వహించిన గంధ మహోత్సవం* లో నగర శాసనసభ్యులు డా॥ పి.అనీల...
29/09/2023

నెల్లూరు నగరంలోని 42వ డివిజన్‌ నందు గల *మీరామొహిద్దీన్‌ దర్గాలో నిర్వహించిన గంధ మహోత్సవం* లో నగర శాసనసభ్యులు డా॥ పి.అనీల్‌కుమార్‌ పాల్గొని, ప్రత్యేక దువా నిర్వహించారు.

*మిలాద్‌-ఉన్‌-నబి పండుగ* సందర్భంగా నెల్లూరు నగరంలోని కోటమిట్ట యూసుఫియా మసీదు నుంచి గాంధీబొమ్మ వరకు నిర్వహించిన *ర్యాలీ* ...
29/09/2023

*మిలాద్‌-ఉన్‌-నబి పండుగ* సందర్భంగా నెల్లూరు నగరంలోని కోటమిట్ట యూసుఫియా మసీదు నుంచి గాంధీబొమ్మ వరకు నిర్వహించిన *ర్యాలీ* లో నగర శాసనసభ్యులు డా॥ పి.అనీల్‌కుమార్‌ పాల్గొని, మిలాద్‌`ఉన్‌`నబి శుభాకాంక్షలు తెలిపారు. దేవుని దయవల్ల ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఉండాలని, అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా వుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు.

నెల్లూరు నగరంలోని 3వ డివిజన్‌ సింహపురి కాలనీ, తదితర ప్రాంతాలలో నగర శాసనసభ్యులు డా॥పి.అనీల్‌కుమార్‌ అధికారులతో కలిసి పర్య...
28/09/2023

నెల్లూరు నగరంలోని 3వ డివిజన్‌ సింహపురి కాలనీ, తదితర ప్రాంతాలలో నగర శాసనసభ్యులు డా॥పి.అనీల్‌కుమార్‌ అధికారులతో కలిసి పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకొని, వెంటనే సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు సంబంధించి 90 శాతం సీమన్స్‌ కంపెనీ పెడితే, 10 శాతం ప్రభుత్వం పెట్టాలని, కాని గత ప్రభుత్వం ఒక్క రూపాయి కూడ పెట్టకుండ నేరుగా రూ.371 కోట్లు బ్యాంకుల్లో వేసుకొని పంచుకున్న వైనంతో చంద్రబాబునాయుడు తప్పు చేశారని స్పష్టమైన ఆధారులున్నాయని న్యాయస్థానం చెబుతోందని, ఎవరి అకౌంట్స్‌ నుంచి ఎవరెవరి అకౌంట్స్‌కు మారాయో అన్నింటిపై అసెంబ్లీలో చర్చకు రమ్మంటే అక్కడి నుంచి టిడిపి ఎమ్మెల్యేలు పరారయ్యారన్నారు. 2024లో తెలుగుదేశం పార్టీకి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా వున్నారని తెలియజేస్తున్నానన్నారు.

నెల్లూరు నగరంలోని రంగనాయకులపేట పెన్నా బ్యారేజీ వద్ద నగర శాసనసభ్యులు డా॥పి.అనీల్‌కుమార్‌ అధికారులతో కలిసి గణేష్‌ నిమజ్జన ...
16/09/2023

నెల్లూరు నగరంలోని రంగనాయకులపేట పెన్నా బ్యారేజీ వద్ద నగర శాసనసభ్యులు డా॥పి.అనీల్‌కుమార్‌ అధికారులతో కలిసి గణేష్‌ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించి, నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోనే కాకుండ చుట్టుపక్కల నుంచి ఈ ప్రాంతానికి వచ్చి గణేష్‌ నిమజ్జన కార్యక్రమాలు చేస్తుంటారని, ఈ ఏడాది ఇరుగాళమ్మ గుడి వద్ద గణేష్‌ ఘాట్‌లో నిర్వహిస్తున్న ఏర్పాట్లతో పాటు ఈ ప్రాంతంలో కూడ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. పెన్నా బ్యారేజీ వద్ద మూడు క్రేన్‌లు ఏర్పాటు చేసి, రోడ్లను పరిశుభ్రంగా వుంచే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించామన్నారు. గణేష్‌ నిమజ్జన కార్యక్రమాలకు వచ్చే భక్తులకు ప్రధాన దేవాలయాల వద్ద ప్రసాదాలు అందించే విధంగా కౌంటర్లు ఏర్పాటు చేయాలని తెలిపామన్నారు.

15/09/2023

నెల్లూరు నగరంలోని 13వ డివిజన్ యలమవారిదిన్నెలోని వై.ఎస్.ఆర్. అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద *రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని నగర శాసనసభ్యులు డాక్టర్ పి.అనీల్ కుమార్ గారు ఆవిష్కరించారు*. అనంతరం అదే ప్రాంతంలో దాదాపు *రూ.30 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న సి.సి.రోడ్ల పనులకు శంకుస్థాపన* చేసారు. ఇప్పటివరకు నగరంలో ఎక్కడా లేని విధంగా అంబేద్కర్ విగ్రహాన్ని సుందరంగా తీర్చిదిద్దారని తెలిపారు.

నెల్లూరు నగరంలోని 16వ డివిజన్‌ జగదీశ్ నగర్ 3వ వీధి శివాలయం వద్ద రూ.1.90 కోట్లతో నిర్మిస్తున్న రోడ్లు, డ్రెయిన్‌ పనులకు న...
14/09/2023

నెల్లూరు నగరంలోని 16వ డివిజన్‌ జగదీశ్ నగర్ 3వ వీధి శివాలయం వద్ద రూ.1.90 కోట్లతో నిర్మిస్తున్న రోడ్లు, డ్రెయిన్‌ పనులకు నగర శాసనసభ్యులు డా॥ పి.అనీల్‌కుమార్‌ శంకుస్థాపన చేశారు. అలాగే ఇంకేమైనా పెండింగ్ పనులున్నా త్వరలో పూర్తి చేస్తామని, ఇప్పటివరకు 16వ డివిజన్ కు సంబంధించి మొత్తం రూ.8 కోట్లతో అభివృద్ధి పనులు చేసామని తెలిపారు.


నెల్లూరు నగర నియోజకవర్గంలోని 52వ డివిజన్‌ రంగనాయకులపేటకు చెందిన జుబీర్, వారి మిత్రబృందం దాదాపు 100 మంది నగరంలోని రాజన్న ...
08/09/2023

నెల్లూరు నగర నియోజకవర్గంలోని 52వ డివిజన్‌ రంగనాయకులపేటకు చెందిన జుబీర్, వారి మిత్రబృందం దాదాపు 100 మంది నగరంలోని రాజన్న భవన్ నందు నగర శాసనసభ్యులు డా॥ పి.అనీల్‌కుమార్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరగా, వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి నాయకత్వం బలపరిచేందుకు ఆయన చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. పార్టీలో చేరినవారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. పార్టీలో చేరిన వారిలో బాషీద్, జాకీర్, అహ్మద్, బాబు, నౌషాద్, తదితరులు ఉన్నారు.

నెల్లూరు నగరంలోని 48వ డివిజన్ పొర్లుకట్ట ప్రాంతంలో గతంలో ప్రమాదవశాత్తు టపాసులు పేలి 15 మంది మృతి చెందిన వారి కుటుంబ సభ్య...
04/09/2023

నెల్లూరు నగరంలోని 48వ డివిజన్ పొర్లుకట్ట ప్రాంతంలో గతంలో ప్రమాదవశాత్తు టపాసులు పేలి 15 మంది మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు స్థలాలు కేటాయించి నగర శాసనసభ్యులు డాక్టర్ పి. అనీల్ కుమార్ గారు నగరంలోని రాజన్న భవన్ లో ఇళ్ళ పట్టాలు ఇవ్వడం జరిగింది.


Address

Venkateswsrapuram, JanardhanReddy Colony, Bhagath Singh Colony
Nellore
524005

Telephone

+919010990075

Website

Alerts

Be the first to know and let us send you an email when Ward 54corporator YSRCP Nellore City posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Ward 54corporator YSRCP Nellore City:

Videos

Share


Other Political Parties in Nellore

Show All

You may also like