02/05/2024
నెల్లూరు నగరంలోని 6వ డివిజన్ జీనిగల వీధి, పప్పులవీధి ఆంజనేయ స్వామి గుడి రోడ్డు, వై.వి.ఎం.స్కూల్ వీధి, అరుంధతీయపాళెం, అలాగే 8వ డివిజన్ ముకుందపురం, ఆర్.కె.నగర్, బుజ్జమ్మతోట, గాండ్లవీధి, తదితర ప్రాంతాలలో నగర నియోజకవర్గ అభ్యర్థి ఎండి.ఖలీల్‌అహ్మద్ గారు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిన మేలును వివరిస్తూ, కరపత్రాలను పంచుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గడప గడపకు పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యంలో జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారన్నారు. వైఎస్‌ఆర్‌సిపిని బలపరచి మీ బిడ్డగా *నన్ను*, నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి అయిన *వేణుంబాక విజయసాయిరెడ్డి* గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మద్దినేని మస్తానమ్మ, మొగళ్ళపల్లి కామాక్షీదేవి, నుడా ఛైర్మన్ ముక్కాల ద్వారకనాథ్, వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు దొంతాల రఘు, తదితరులు పాల్గొన్నారు.