23/11/2024
🟧అల్తూరుపాడు రిజర్వాయర్ రైతులకు నష్టపరిహారం త్వరితగతిన చెల్లించండి...
🟩తేది:-23/11/2024,జడ్పీ కార్యాలయం,నెల్లూరు...
🟧ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశంలో డక్కిలి మండలం,అల్తూరుపాడు రిజర్వాయర్ కి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్,ఎస్టిమేషన్స్ గురించి ఎప్పుడూ సమావేశాల్లో చెప్పుకుంటుంటాము.కానీ ఇప్పుడు ఉన్న సమస్యలన్నీ పరిష్కరించకుండా అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్ ఎలా వెళ్తారని నీటి పారుదల అధికారులని ప్రశ్నించడం జరిగింది...
🟩డక్కిలి మండలం,అల్తూరుపాడు రిజర్వాయర్ కి సంబంధించి 250 ఎకరాలు అడవి పోరంబోకు భూమిలో ఉన్న రైతులకు పరిహారం ఎంత చెల్లిస్తారు లేక భూమికి బదులుగా ఇంకో చోట భూమిని ఇస్తారని నీటి పారుదల అధికారులను అడగడం జరిగింది...
🟧ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ మరియు ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు,నెల్లూరు జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ గారు,ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు,జడ్పీటీసీలు,మండల పరిషత్ అధ్యక్షులు,నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ గారు,ఉమ్మడి నెల్లూరు జిల్లాల వివిధ శాఖ అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు...