08/12/2025
కోట సత్తమ్మ తల్లి కి శనివారం బోనాల సమర్పించిన రాజమండ్రి ప్రముఖులు
అంగరంగ వైభవం గా అమ్మవారి బోనాలు జాతర
వేలాది భక్తులతో కిటకిటలాడిన ఆలయ ప్రంగాణం
భక్తులకి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నాం... ఆలయ కమిటీ
అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉంటాయి..
బీజేపీ పార్టీ నాయకులు ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డి, ఎమ్మెల్సీ సోము, జిల్లా అధ్యక్షులు నాగేంద్ర..
బీజేపీ ప్రముఖులకి స్వాగతం పలికిన నిడదవోలు బీజేపీ నాయకులు మోర్త ప్రమోద్ కుమార్, లక్కొజు సూర్య సాయి
నిడదవోలు, 07-12-2025:
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో కోరిన కోర్కెలు తీర్చే శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి తిరునాళ్లు ఐదు రోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఐదు రోజులపాటు అమ్మవారు శంకు చక్ర గదా అభయ హస్త యజ్ఞోపదారినిగా, త్రిశక్తి స్వరూపమై, భక్తుల పాలిట కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీర్చే కోట సత్తమ్మగా దర్శనమివ్వనున్నారు. నిడదవోలు పట్టణంలో కోట సత్తమ్మ తల్లి ధరణి మహోత్సవాలు భక్తి భావంతో, పెద్దఎత్తున నిర్వహించబడుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం రాజమండ్రి నుండి బోనాలను ఘనంగా రాగింపజేశారు. హిందూ చైతన్యవేదిక జిల్లా మహిళ ప్రముఖ్, అఖిల భారత తెలుగు సేన ఆంధ్రప్రదేశ్ మహిళా అధ్యక్షురాలు లయన్ జి.ఆదిలక్ష్మి అడ్వకేట్ ఆధ్వర్యంలో భక్తుల పాలిట కల్పవల్లిగా విరాజిల్లుతున్న శ్రీ కోటసత్తెమ్మ అమ్మవారికి రాజమహేంద్రవరం నుండి 101 మంది మహిళలతో చీర - సారె, పసుపు, కుంకుమలు, గాజులు పువ్వులు పలు రకాల పిండి వంటలు వడపప్పు చలివిడ పానకాలను బోనాలుగా సమర్పించారు. వందలాది భక్తులు పాల్గొన్న ఈ బోనాల ఊరేగింపు పట్టణమంతా ఉత్సాహ వాతావరణాన్ని సృష్టించింది. పురోహితులు మంత్రోచ్చారణలు చేస్తూ, మహిళలు సంప్రదాయ దుస్తుల్లో నృత్యాలు చేస్తూ, సాంప్రదాయ డప్పులు, సంగీత బృందాల నడుమ బోనాలు మహోత్సవ ప్రాంగణానికి చేరాయి. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు,హాజరై ధరణి మహోత్సవాల్లో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఊరేగింపుగా వచ్చిన బోనాలను స్వాగతించిన అనంతరం, ఎమ్మెల్యే తల్లి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “కోట సత్తమ్మ తల్లి మహోత్సవాలు నిడదవోలు ప్రాంత ప్రజల మతానుబంధం మాత్రమే కాదు, వారి సాంప్రదాయ సంస్కృతిని ప్రతిబింబించే విశేష పండుగ. ఇక్కడి ప్రజలు ఏకత్వంతో, భక్తి శ్రద్ధలతో ఈ మహోత్సవాలను నిర్వహించడం ఎంతో అభినందనీయం. ప్రజల అభివృద్ధి, ఆరోగ్యం, శాంతి, సమృద్ధి కోసం తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
అలాగే ప్రజల నుండి వచ్చిన స్