26/10/2023
*జీ వీ ఎం సీ పాలక వర్గం మాఫియా గ్యాంగ్- పర్శంటేజీల కోసమే స్టాండింగ్ కమిటీలు*
- టీడీపీ ఫ్లోర్ లీడర్ *పీలా శ్రీనివాసరావు*, జన సేన కార్పొరేటర్ *పీతల మూర్తి యాదవ్*
జీవీఎంసీ టీడీపీ ఫ్లోర్ లీడర్ ఛాంబర్ లో టీడీపీ, జన సేన కార్పొరేటర్లు మీడియా సమావేశం గురువారం జరిగింది. జివియంసి *టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు* మాట్లాడుతూ, ఇది స్టాండింగ్ కమిటీ బుక్ కాదు వై వీ సుబ్బారెడ్డి బుక్కు అని ఎద్దేవా చేశారు. జీ వీ ఎం సీ పాలక వర్గం మాఫియా గ్యాంగ్ అని మండి పడ్డారు. స్పోర్ట్స్ డైరెక్టర్, ఏ డీ సి శ్రీనివాస్ కుంభకోణాలు చేయడం రివాజుగా మారుతోందని అన్నారు. చాలా అంశాలు స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆమోదించడం ఆనవాయితీ గా మారిపోయింది.
వైసీపీ కార్పొరేటర్లు నిలదీసిన సిగ్గు లేదా అని ప్రశ్నించారు. రూ.15 లక్షల నిధులు డ్రా చేశారు. చర్య తీసుకోకుండా ఈ మొత్తం వెచ్చిస్తున్నారు.న్యాయ పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. వేసవి శిబిరాలు అంటూ పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం చేశారు.
22 వ వార్డు జనసేన కార్పొరేటర్
పీతల మూర్తి యాదవ్ మాట్లాడుతూ, జీ వీ ఎం సీ స్టాండింగ్ కమిటీ బేరాలు కుదుర్చుకోవడం కోసమే మేయర్ డైరెక్షన్ లో నలుగురు షాడో మేయర్లు నిధులు వేసివి శిబిరాలు అంటూ ఏకంగా రూ. 1.46 కోట్లు ఖర్చు చేశారు. దీనిపై వైసీపీ గాజువాక కార్పొరేటర్లు సైతం కౌన్సిల్ లో నిలదీశారు. టీడీపీ, జనసేన కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తే విచారణ చేస్తామన్నారు. రూ.15 లక్షలు తో పరికరాలు కొనుగోలు చేశారు అవి ఎక్కడ ఉన్నాయి చెప్పాలి అని డిమాండ్ చేశారు. ఇప్పుడు రూ. 5.46 లక్షలకు బిల్లు పెట్టారు అన్నారు.
పారిశుధ్య వాహనాలు ట్రాకింగ్ సిస్టం నిమిత్తం గతంలో రూ. 240 బిల్లు ఇచ్చే వారు ఇప్పుడు మూడు రెట్లు అంటే రూ. 650 బిల్లు ఇవ్వడం విడ్డూరం గా వుందని, సాక్షాత్తు కమిషనర్ మిత్రుడు కాంట్రాక్టర్ అని పేర్కొన్నారు.
వినాయక చవితి, శివరాత్రి, చందనోత్సవం, బీచ్ గజ ఈతగాళ్లు వేతనాలకు 15.60 లక్షలు, చందనోత్సవం లో నీరు కోసం భక్తులు అగచాట్లు పడినా సరే, రూ.6 లక్షల బిల్లు పెట్టారు. ఎన్సిసీ సంస్థ 24 గంటల నీరు సరఫరా కోసం 5.20 కోట్ల పనులు ఆమోదం చేసుకున్నారు. కౌన్సిల్ లో టీడీపీ, జన సేన అడ్డుకుంటాయి అన్న నెపంతో చిన్న చిన్న పనులు గా విభజించి స్థాయీ సంఘం సమావేశంలో ఆమోధించుకుంటున్నారని అన్నారు.