12/08/2026
"ఘర్ ఘర్ తిరంగా" కార్యక్రమానికి శ్రీకారం — రాష్ట్రవ్యాప్తంగా లక్ష జాతీయ జెండాల పంపిణీకి MHPS రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ పిలుపు
మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి — MHPS ఆధ్వర్యంలో, రాష్ట్ర అధ్యక్షులు ముహమ్మద్ ఫారూఖ్ షిబ్లీ నేత్రుత్వంలో “ఘర్ ఘర్ తిరంగా” కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
మొగల్రాజపురంలోని సదర్న్ స్పైస్ కాన్ఫరెన్స్ హాలులో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా లక్ష జాతీయ జెండాలను పంపిణీ చేసి, ప్రతి ఇంటినీ ‘ఘర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నిర్ణయించింది.
ఈ సందర్బంగా.. MHPS వ్యవస్థాపకులు, అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ మాట్లాడుతూ..
“ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలి… ప్రతి హృదయంలో దేశభక్తి వెలుగులు నిండాలి…” అనే సంకల్పంతో ఈ మహత్తర కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళుతున్నట్టు తెలిపారు.
కులమతాలకతీతంగా ప్రజలందరినీ ఏకం చేసే త్రివర్ణ పతాకం మన గౌరవం, మన గుర్తింపు, మన దేశభక్తికి ప్రతీక అని MHPS నాయకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నేడు నిర్వహించిన MHPS రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 500 మంది నాయకులు, సభ్యులు హాజరయ్యారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ 200 జాతీయ జెండాలను అందజేసి, వారందరినీ “ఘర్ ఘర్ తిరంగా” కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా MHPS అధ్యక్షులు మహమ్మద్ ఫారూఖ్ షిబ్లీ మాట్లాడుతూ, “మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ‘ధర్మం కోసం — దేశం కోసం’ అనే సంకల్పంతో ‘ఘర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి. దేశభక్తి ప్రతి హృదయంలో వెలుగొందాలి” అని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంతో జాతీయ గీతానికి గౌరవంతో పాటూ మత విశ్వాసాలకు కూడా గౌరవం పెరుగుతుందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న “ఘర్ ఘర్ తిరంగా” కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తి భావాన్ని చాటాలని షిబ్లీ పిలుపునిచ్చారు. ఎంహెచ్పిఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టినట్టు ఆయన తెలిపారు.
కార్యక్రమంలో రాష్ట్రంలోని 65 నియోజకవర్గాల నుంచి ఎంహెచ్పీఎస్ ప్రతినిధులు, మత పెద్దలు హాజరయ్యారు.