Tadigadapa Municipality

Tadigadapa Municipality Tadigadapa Municipality was newly Constituted Municipality in the year 01/01/2021 by merging the Tadigadapa, Poranki, Kanuru & Yanamalakuduru Panchayat's.

It comes under Penamaluru Constituency of Krishna District.

తాడిగడప పురపాలక సంఘం ప్రజలకు విజ్ఞప్తి:"నీటి బొట్టు... జీవన మూలం!నీటిని పొదుపుగా వాడుకుందాం – భవిష్యత్తు తరాలకు ప్రాణదాన...
18/10/2026

తాడిగడప పురపాలక సంఘం ప్రజలకు విజ్ఞప్తి:
"నీటి బొట్టు... జీవన మూలం!
నీటిని పొదుపుగా వాడుకుందాం – భవిష్యత్తు తరాలకు ప్రాణదానం చేద్దాం.
నల్లాలు తెరిచి ఉంచవద్దు, లీకేజీలను వెంటనే అరికట్టండి. ప్రతి బొట్టునూ కాపాడుకోవడం మన అందరి సామాజిక బాధ్యత.

కమీషనర్
తాడిగడప పురపాలక సంఘం

04/10/2026

📢 *AP పింఛన్ల పంపిణీలో కొత్త విధానం - నవంబర్ 1 నుంచి అమలు!*

ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ల పంపిణీ విధానంలో కీలక మార్పులు రానున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలను వేర్వేరు పద్ధతుల్లో లబ్ధిదారులకు అందించనున్నారు.

📌 *ముఖ్య వివరాలు:*
• *కేంద్ర వాటా:* నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.
• *రాష్ట్ర వాటా:* గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు లబ్ధిదారుల ఇంటి వద్దే నగదు రూపంలో అందజేస్తారు.

💰 *కేటగిరీల వారీగా వాటా వివరాలు:*
• *వృద్ధులు, ఒంటరి మహిళలు (మొత్తం ₹4,000):*
- కేంద్ర వాటా: *₹200* (బ్యాంక్ ఖాతాలో)
- రాష్ట్ర వాటా: *₹3,800* (ఇంటి వద్ద నగదు)

• *దివ్యాంగులు (మొత్తం ₹6,000):*
- కేంద్ర వాటా: *₹300* (బ్యాంక్ ఖాతాలో)
- రాష్ట్ర వాటా: *₹5,700* (ఇంటి వద్ద నగదు)

⚠️ *ముఖ్య గమనిక:*
కేంద్ర వాటా మొత్తం జమ కావాలంటే బ్యాంక్ ఖాతాకు *ఆధార్ లింక్* తప్పనిసరి. లింక్ లేకపోతే కేంద్ర వాటా జమ కాకపోవచ్చు.

📢 *ఏపీ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) షెడ్యూల్ మార్పు!*ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) గడువును ...
02/10/2026

📢 *ఏపీ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) షెడ్యూల్ మార్పు!*

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. తాజా వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:

🗓️ *సవరించిన ముఖ్య తేదీలు:*
* క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారానికి తుది గడువు: *అక్టోబర్ 10*
* తుది ఓటర్ల జాబితా (Final Roll) ప్రచురణ: *అక్టోబర్ 16*

📢 *ఆంధ్రప్రదేశ్ పింఛన్ల పంపిణీ విధానంలో కీలక మార్పులు!*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ద్...
23/09/2026

📢 *ఆంధ్రప్రదేశ్ పింఛన్ల పంపిణీ విధానంలో కీలక మార్పులు!*

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా వికలాంగులు, వృద్ధులు మరియు వితంతువుల పింఛన్ల పంపిణీ విధానంలో మార్పులు చేస్తూ తాజా ఉత్తర్వులు (Memo No.3336974) జారీ చేసింది.

🔹 ముఖ్యమైన మార్పులు ఇవే:

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. పింఛన్ మొత్తాన్ని రెండు భాగాలుగా విభజించి పంపిణీ చేయనున్నారు.

కేంద్ర ప్రభుత్వ వాటా (NSAP Share): లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా జమ అవుతుంది.

రాష్ట్ర ప్రభుత్వ వాటా (NTR భరోసా): మిగిలిన అమౌంట్ ఎప్పటిలాగే మీ ఇంటి వద్దకే వచ్చి నగదు రూపంలో అందిస్తారు.

👉 లబ్ధిదారులకు అందే పూర్తి వివరాలు:

👴 వృద్ధాప్య పింఛన్ (60-79 సం||లు):
బ్యాంకులో: ₹200 + చేతికి: ₹3800 = మొత్తం: ₹4,000

👵 వృద్ధాప్య పింఛన్ (80 సం||లు పైబడిన వారు):
బ్యాంకులో: ₹500 + చేతికి: ₹3500 = మొత్తం: ₹4,000

వితంతు పింఛన్ (40-79 సం||లు):
బ్యాంకులో: ₹300 + చేతికి: ₹3700 = మొత్తం: ₹4,000

వితంతు పింఛన్ (80 సం||లు పైబడిన వారు):
బ్యాంకులో: ₹500 + చేతికి: ₹3500 = మొత్తం: ₹4,000

♿ వికలాంగుల పింఛన్ (18-79 సం||లు):
బ్యాంకులో: ₹300 + చేతికి: ₹5700 = మొత్తం: ₹6,000

♿ వికలాంగుల పింఛన్ (80 సం||లు పైబడిన వారు):
బ్యాంకులో: ₹500 + చేతికి: ₹5500 = మొత్తం: ₹6,000

📌 గమనిక: పింఛన్ మొత్తం రూపాయి కూడా తగ్గదు, మీకు వచ్చే పూర్తి పింఛన్ (₹4000 లేదా ₹6000) యథావిధిగా అందుతుంది. కానీ కొంత భాగం బ్యాంకులో, మరికొంత భాగం చేతికి వస్తుంది.

లబ్ధిదారులందరికీ చేరేలా ఈ సమాచారాన్ని షేర్ చేయండి! 🙏

మన ఇంటి పైకప్పుపై పడిన వర్షపు నీరు డ్రెయిన్‌లోకి వృథాగా పోకుండా... ఇంకుడు గుంతల ద్వారా భూమిలోకి చేరేలా చేసి, భూమికి ఊపిర...
31/07/2026

మన ఇంటి పైకప్పుపై పడిన వర్షపు నీరు డ్రెయిన్‌లోకి వృథాగా పోకుండా... ఇంకుడు గుంతల ద్వారా భూమిలోకి చేరేలా చేసి, భూమికి ఊపిరి పోదాం!
🔹 వర్షపు నీటిని ఇంకుడు గుంతల ద్వారా నేరుగా భూమిలోకి పంపడం వల్ల భూగర్భ జలాలు రీచార్జ్ అవుతాయి.
🔹 దీని వల్ల వేసవి కాలంలో బోర్లు, బావులు ఎండిపోకుండా ఎక్కువ కాలం నీటి లభ్యత పెరుగుతుంది.
🔹 వర్షపు నీటిని ముందుగానే వృథా కాకుండా సద్వినియోగం చేసుకోవడం ద్వారా వేసవిలో ఎదురయ్యే తీవ్రమైన నీటి కొరతను తగ్గించుకోవచ్చు.
🔹 భవిష్యత్ తరాలకు నీటి భద్రతను కల్పించి, నీటి కొరత లేని సురక్షితమైన భవిష్యత్తును నిర్మించవచ్చు.
మన ఇళ్లలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకుందాం... వర్షపు నీరు వృథాగా పోకుండా ప్రతి బొట్టునూ ఒడిసి పట్టి, భూగర్భ జలాలను సంరక్షిద్దాం!

జీవనధారను కాపాడుకుందాం – తాడిగడపను సస్యశ్యామలం చేద్దాం! 💧🌱​తాడిగడప పురపాలక సంఘ పరిధిలోని గౌరవనీయులైన నివాసితులకు విన్నపం...
14/07/2026

జీవనధారను కాపాడుకుందాం – తాడిగడపను సస్యశ్యామలం చేద్దాం! 💧🌱
​తాడిగడప పురపాలక సంఘ పరిధిలోని గౌరవనీయులైన నివాసితులకు విన్నపం:
​మన నగర పరిధిలో భూగర్భ జలాలు అంతరించిపోకుండా, రాబోయే నీటి ఎద్దడిని నివారించడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిన సమయం వచ్చింది. మన పరిసరాల్లో భూగర్భ జలమట్టాన్ని పెంచడానికి ఈ క్రింది సులభమైన పద్ధతులను పాటిద్దాం:
​ఇంకుడు గుంతల నిర్మాణం: ప్రతి ఇంటి ఆవరణలోనూ, అపార్ట్‌మెంట్లలోనూ తప్పనిసరిగా ఇంకుడు గుంతలను (Rainwater Harvesting Pits) ఏర్పాటు చేసుకుందాం.
​కృత్రిమ రీఛార్జ్ పద్ధతులు: ఖాళీ స్థలాలు, పార్కులు మరియు ప్రభుత్వ ప్రాంతాలలో వర్షపు నీరు భూమిలోకి ఇంకేలా ప్రత్యేక ఏర్పాట్లు చేద్దాం.
​నీటి వృథాకు అడ్డుకట్ట: ట్యాంకులు నిండి వృథాగా పోయే నీటిని, రోజువారీ అవసరాలకు వాడే నీటిని రోడ్లపైకి వదలకుండా జాగ్రత్త పడదాం.
​కాంక్రీట్ పక్కన కాస్త చోటు: ఇళ్ల ముందు పూర్తిగా కాంక్రీట్ లేదా టైల్స్ వేసేయకుండా, వర్షపు నీరు భూమిలోకి వెళ్లేలా కొంత ఖాళీ స్థలాన్ని వదులుకుందాం.

​📢 గుర్తుంచుకుందాం:
నేటి వర్షపు చుక్క – రేపటి మన జీవన రక్ష!
భూగర్భ జలాల సంరక్షణే మన తాడిగడప ప్రగతికి మూలాధారం.

కమీషనర్
​తాడిగడప పురపాలక సంఘం

30/06/2026

ఆస్తి పన్ను చెల్లింపుదారులకు సువర్ణావకాశం!
2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ భాగానికి సంబంధించిన ఇంటి పన్నులు మరియు ఖాళీ స్థలం పన్నులను ఎలాంటి లేట్ పెనాల్టీ లేకుండా చెల్లించేందుకు ఈరోజు (30 జూన్, 2026) ఆఖరి అవకాశం!
గడువు ముగిసేలోపు మీ పన్నులను పురమిత్ర / మనమిత్ర / CDMA వెబ్‌సైట్ ద్వారా వెంటనే చెల్లించి, ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
బాధ్యత గల పౌరుడిగా మన పట్టణాభివృద్ధికి సహకరిద్దాం!

కమీషనర్
తాడిగడప మున్సిపాలిటీ

24/06/2026

ఓటర్లకు గమనిక! మీ ఓటరు నమోదు, వివరాల సవరణ లేదా చిరునామా మార్పుల కోసం ఇప్పుడు మీ బూత్ లెవెల్ అధికారి (BLO) తో సులభంగా కాల్ బుక్ చేసుకోవచ్చు.

*ఎలా బుక్ చేసుకోవాలి?*

1.ECINET యాప్ డౌన్లోడ్ చేసుకోండి (లేదా)

voters.eci.gov.in వెబ్ సైట్ ను సందర్శించండి.

2.అందులో "BOOK A CALL WITH BLO" ఆప్షన్ ను ఎంచుకోండి.

3.మీరు అభ్యర్థన సమర్పించిన 48 గంటల లోపు మీ BLO మీకు తిరిగి కాల్ చేస్తారు.



18/06/2026

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)లో భాగంగా ఓటర్ వివరాలను ధ్రువీకరించుకోవడానికి BLOల కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు. స్మార్ట్ఫోన్ ద్వారా ఇంట్లో కూర్చుని ఆన్లైన్లో ఎన్యూమరేషన్ పూర్తి చేయవచ్చని ఏపీ చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ వెల్లడించారు. 'http://voters.eci.gov.in 3 EPIC నంబర్ నమోదు చేసి OTP ద్వారా లాగిన్ అవ్వండి. ఆధార్ eSign ద్వారా సురక్షితంగా ఫారమ్ను సబ్మిట్ చేయండి' అని తెలిపారు.

15/06/2026

జూన్ 15 నుంచి మీ ఇంటికి BLOలు వస్తే భయపడాల్సిన అవసరం లేదు!

ఇది మీ ఓటు హక్కును కాపాడుకునే ముఖ్యమైన ప్రక్రియ. SIR (Special Intensive Revision) ద్వారా ఓటరు జాబితాను పూర్తిగా పరిశీలించి, నిజమైన ఓటర్ల వివరాలను అప్డేట్ చేస్తారు.

✅ చనిపోయిన వారి పేర్లు తొలగింపు

✅ డూప్లికేట్ ఓట్లు తొలగింపు

✅ వేరే ప్రాంతాలకు వెళ్లిన వారి పేర్లు తొలగింపు

✅కొత్తగా 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు నమోదు

BLOలు మీ ఇంటికి వచ్చినప్పుడు సహకరించండి. మీ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో తప్పకుండా చెక్ చేసుకోండి. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి బలం! --

ఈ సమాచారం ఉపయోగపడితే వీడియోను షేర్ చేయండి...

Address

Oppsite NTR Statue
Poranki
521137

Website

Alerts

Be the first to know and let us send you an email when Tadigadapa Municipality posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share


Other Poranki government services

Show All