11/04/2026
పూలే ఆశయ సాధనే లక్ష్యం: జడ్పీటీసీ మారెడ్డి లతా రెడ్డి
సమాజంలో అణగారిన వర్గాల ఆశాజ్యోతి, గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను పులివెందుల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పులివెందుల జడ్పీటీసీ శ్రీమతి మారెడ్డి లతా రెడ్డి మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మారెడ్డి లతా రెడ్డి మాట్లాడుతూ .. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, దళిత బహుజనుల హక్కుల కోసం, మహిళా విద్యాభివృద్ధి కోసం పూలే చేసిన విశేష కృషిని, ఆయన చేసిన పోరాటాలను కొనియాడారు. కుల వివక్ష లేని సమానత్వ సమాజ స్థాపన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు పూలే అని కీర్తించారు.
ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని, బడుగు బలహీన వర్గాల ఆశయ సాధనకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. పూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో పేద ప్రజల సంక్షేమానికి మరింత కృషి చేస్తామని తెలిపారు..