05/09/2026
ఉపాధ్యాయులను గౌరవించుకోవడం అంటే మన సంస్కృతిని, మన విలువలను గౌరవించుకోవడమే. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి సారథ్యంలో విద్యారంగంలో సమూల సంస్కరణలకు శ్రీకారం చుడుతూ, విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న ప్రతి గురువుకు గురుపూజోత్సవం సందర్భంగా పాదాభివందనం తెలియజేస్తున్నాను. సమాజానికి జ్ఞానాన్ని, విద్యార్థుల జీవితాలకు దిశానిర్దేశాన్ని అందించే గురువుల సేవలు చిరస్మరణీయం.
గురువులందరికీ హృదయపూర్వక గురుపూజోత్సవ శుభాకాంక్షలు…. హ్యాపీ టీచర్స్ డే!