29/07/2026
పత్రికా ప్రకటన
తేది : 29.07.2026.
అన్నమయ్య జిల్లాలో ఘనంగా "ఇండియా స్కిల్స్ కాంపిటీషన్ 2026-27" పోస్టర్ ఆవిష్కరణ
అన్నమయ్య జిల్లా కలెక్టర్ గౌరవనీయులు శ్రీ నిశాంత్ కుమార్ IAS గారు నేడు "ఇండియా స్కిల్స్ కాంపిటీషన్ 2026-27" పోస్టర్‌ను అధికారికంగా ఆవిష్కరించారు.
&&&
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ, యువత తమ నైపుణ్యాలను ప్రపంచ స్థాయిలో నిరూపించుకునేందుకు ఇండియా స్కిల్స్ కాంపిటీషన్ ఒక అద్భుతమైన వేదిక అని తెలిపారు. జిల్లా,
రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో నిర్వహించే ఈ పోటీల ద్వారా యువత తమ ప్రతిభను చాటుకొని ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను మరింత మెరుగుపరుచుకోవచ్చని పేర్కొన్నారు.
ఈ పోటీలకు ఎటువంటి నిర్దిష్ట విద్యార్హతలు అవసరంలేదు , తత్సంబంధిత నైపుణ్యాలు ఉన్నవారు ఎవ్వరైనా పాల్గొనవచ్చు. అభర్ధులు కనీస వయస్సు 16 సంవత్సరాలు, ఎంచుకునే నైపుణ్యాన్ని బట్టి గరిష్ట వయస్సు 21 లేదా 24 సంవత్సారాలు ఉండవచ్చు.
ఈ పోటీలలో మొత్తం 63 నైపుణ్య విభాగాల్లో పోటీలు నిర్వహించబడతాయని, అర్హత గల యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం యువత నైపుణ్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సంబంధించి ఆసక్తి గల అభ్యర్థులు పోస్టర్‌లో ఉన్న QR కోడ్ను స్కాన్ చేయడం ద్వారా లేదా SIDH పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి, జిల్లా ఉపాధి మరియు నైపుణ్యాల అధికారి శ్రీ. దోణప్ప గారు, జిల్లా విధశాఖఅధికారి శ్రీ. సుబ్రహ్మణ్యం గారు మరియు, జిల్లా నైపుణ్యాబివృద్ది అధికారి శ్రీ. శ్యాం మోహన్ గారు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. యువత పెద్ద సంఖ్యలో ఈ పోటీలలో పాల్గొని తమ నైపుణ్యాలను జాతీయ, అంతర్జాతీయ వేదికలపై చాటుకోవాలని అధికారులు ఆకాంక్షించారు..
మరిన్ని వివరాలకు సంప్రదింపవలసిన నంబర్లు (అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా)
మదనపల్లె: 9553202509, 6301612761
తంబళ్లపల్లె: 8897776368, 9741432931
రాయచోటి: 9550104260, 9177143181
పీలేరు: 7799587687
పుంగనూరు: 7780599208
N.Syam Mohan, ([email protected])
జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ
అన్నమయ్య జిల్లా .