CPM Samalkot

CPM Samalkot Voice of the People l Fight for Rights l Stand for equality l build the Future

విద్యుత్ ఉద్యమ అమరవీరులకు జోహార్లు..          Nara Chandrababu Naidu Pawan Kalyan Nara Lokesh
28/08/2026

విద్యుత్ ఉద్యమ అమరవీరులకు జోహార్లు..
Nara Chandrababu Naidu Pawan Kalyan Nara Lokesh

16/08/2026

భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రం వద్ద 80 వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు
సామర్లకోట, ఆగస్ట్ 15:- సామర్లకోట భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రం వద్ద 80 వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా జాతీయ పతాకాన్ని సిపిఎం పట్టణ కార్యదర్శి బాలం శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి 80 ఏళ్ళు పూర్తయినా అందరికి విద్య వైద్యం అందని ద్రాక్ష గానే ఉందని ఇల్లు లేని పేదలు, కరంటు లేని గ్రామాలు నేటికీ ఉన్నాయని పేద ధనిక తారతమ్యాలు తీవ్రమవుతున్నాయని పాలక పార్టీ లు పేదల గురించి కాకుండా ధనికుల కోసం పనిచేస్తున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు, శాఖ కార్యదర్శి కరణం గోవిందరాజు, భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రం అధ్యక్షులు బాలం హరిబాబు, ఐద్వా జిల్లా కార్యదర్శి కే వరలక్ష్మి, సీఐటీయూ నాయకురాలు టి నాగమణి, పట్టణ అభివృద్ధి వేదిక నాయకులు కరణం ఏడుకొండలు, బాలం సత్తిబాబు, డి వై ఎఫ్ ఐ నాయకులు కొత్తూరు తులసి దాస్, ప్రవీణ్, అక్షయ్ పాల్గొన్నారు

16/08/2026

సీపీఎం కార్యాలయం వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎస్ఐఆర్ ప్రక్రియ గడువు పొడిగించడం హర్షణీయం        ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) గడువును జూల...
15/07/2026

ఎస్ఐఆర్ ప్రక్రియ గడువు పొడిగించడం హర్షణీయం

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) గడువును జూలై 24 వరకు పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం పట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ హర్షం వ్యక్తం చేస్తున్నది. ఓటర్లకు తగిన అవగాహన లేకపోవడం, అవసరమైన పత్రాలు సమర్పించడానికి తగిన సమయం కావాలని, గడువు పొడిగించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ గతంలోనే ఎన్నికల సంఘాన్ని కోరింది. అందుకనుగుణంగా గడువు పొడిగించడం వలన ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారాలను సమర్పించడానికి మరింత వీలు కలుగుతుందని సిపిఐ(యం) భావిస్తున్నది. ఇప్పటికీ లక్షల ఫారాలు తిరిగి రావాల్సి ఉన్నందున అవసరమైతే మరికొంతకాలం గడువు పొడిగించాలని కోరుతున్నది.
ఎన్నికల సంఘం ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు గురికాకుండా ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగా పారదర్శకంగా, వివక్ష లేకుండా ఎసఐఆర్ ప్రక్రియ నిర్వహించాలని సిపిఐ(యం) కోరుతున్నది. సాంకేతిక కారణాలతో ఓటు హక్కును తిరస్కరించకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరుతున్నది.

(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి

సరిగ్గా 49 సంవత్సరాల క్రితం1977 జూన్ 21న, పశ్చిమ బెంగాల్ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఆ రోజు తొలి వామపక...
21/06/2026

సరిగ్గా 49 సంవత్సరాల క్రితం
1977 జూన్ 21న, పశ్చిమ బెంగాల్ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఆ రోజు తొలి వామపక్ష కూటమి (లెఫ్ట్ ఫ్రంట్) ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసింది.
ఈ మహత్తర సందర్భంగా, ప్రజల ప్రభుత్వ స్థాపనకు కృషి చేసిన వామపక్ష సహచరులకు మరియు పశ్చిమ బెంగాల్ ప్రజలకు మన వందనాలు తెలియజేద్దాం.
1977 నుండి 2011 వరకు సాగిన 34 సంవత్సరాల లెఫ్ట్ ఫ్రంట్ పాలన అభివృద్ధి, పోరాటం మరియు పాలనలో ప్రజల భాగస్వామ్యానికి ప్రతీకగా నిలిచింది. ఆ స్వర్ణయుగానికి శిల్పులైన ప్రజలకు మన సెల్యూట్.
లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వ కార్యక్రమాలు, విధానాలకు పశ్చిమ బెంగాల్ శ్రామిక ప్రజలు అందించిన విశాలమైన, అచంచలమైన మద్దతు లేకుండా ఆ 34 ఏళ్ల విశేష విజయాలు సాధ్యమయ్యేవి కావు.
లెఫ్ట్ ఫ్రంట్ పాలనలోని ముఖ్య విజయాలు అందరికీ తెలిసిందే:
భూ సంస్కరణలు, వీటి ద్వారా లక్షలాది కౌలు రైతులు మరియు ఇతర రైతులు లబ్ధి పొందారు.
పంచాయతీరాజ్ సంస్థల ప్రజాస్వామ్యీకరణ మరియు బలోపేతం.
పశ్చిమ బెంగాల్‌లో అతిపెద్ద పారిశ్రామిక ప్రాజెక్టు అయిన హాల్దియా పెట్రోకెమికల్ కాంప్లెక్స్ స్థాపన.
రాష్ట్రవ్యాప్తంగా మతసామరస్యం మరియు లౌకికవాద వాతావరణం సృష్టించడం.
స్వచ్ఛమైన, పారదర్శక పరిపాలన.
రాజకీయ స్థిరత్వాన్ని నెలకొల్పడం.
పశ్చిమ బెంగాల్ లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వ గౌరవనీయ వారసత్వం నేటికీ దేశవ్యాప్తంగా అభ్యుదయవాద మరియు ప్రజాస్వామ్య శక్తులకు ఒక మార్గదర్శకంగా కొనసాగుతోంది.
కేరళలో ఎన్నికల పరంగా వామపక్షానికి కొన్ని ఎదురుదెబ్బలు తగిలి ఉండవచ్చు. అయినప్పటికీ, దోపిడీ, అసమానతలు, శ్రమ గౌరవం వంటి అంశాలపై అసౌకర్యకరమైన ప్రశ్నలు లేవనెత్తుతూ, దోపిడీ రహిత సమాజం కోసం పోరాడుతున్న శక్తి ఇప్పటికీ వామపక్షమే.
🎯 కార్మిక వర్గానికి సహజ మిత్రుడు, మిత్రపక్షం వామపక్షమే. వామపక్ష శక్తులను బలోపేతం చేద్దాం, మద్దతు తెలుపుదాం.
🚩 ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి!
🚩 లెఫ్ట్ ఫ్రంట్ వారసత్వం వర్ధిల్లాలి!

చమురు మార్కెటింగ్‌ కంపెనీలకు నష్టం వస్తున్నదని పెట్రోలు, డీజిలు, ఇతర ఉత్పత్తుల ధరలను పెంచారు. ఇప్పుడు ధర 97.44 డాలర్లకు ...
17/06/2026

చమురు మార్కెటింగ్‌ కంపెనీలకు నష్టం వస్తున్నదని పెట్రోలు, డీజిలు, ఇతర ఉత్పత్తుల ధరలను పెంచారు. ఇప్పుడు ధర 97.44 డాలర్లకు తగ్గినా వినియోగదారుల నుంచి పెంచిన రేట్లే వసూలు చేస్తున్నారు తప్ప పైసా కూడా తగ్గించలేదు.

15/06/2026
 #గ్లోబల్ పీస్ ఇండెక్స్ లో* మరింత దిగజారిన భారత్* నిరుడు 115వ ర్యాంకు.. ఈసారి 127కు పతనం* భద్రత, శాంతి ప్రమాణాల ఆధారంగా ...
13/06/2026

#గ్లోబల్ పీస్ ఇండెక్స్ లో
* మరింత దిగజారిన భారత్
* నిరుడు 115వ ర్యాంకు.. ఈసారి 127కు పతనం
* భద్రత, శాంతి ప్రమాణాల ఆధారంగా 163 దేశాలకు ర్యాంకులు
* ప్రపంచంలోనే అత్యంత సురక్షిత దేశంగా ఐస్లాండ్

Address

Samalkot
533440

Website

Alerts

Be the first to know and let us send you an email when CPM Samalkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share