16/06/2023
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జిల్లా కేంద్రంలోని కొండా భూదేవి గార్డెన్ లో పట్టణ ప్రగతి దినోత్సవం లో పాల్గొన్న గౌరవ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారు , MP కొత్త ప్రభాకర్ రెడ్డి గారు.
మంత్రి హరీశ్ రావు గారు మాట్లాడుతూ.
- స్వచ్ఛ పూదోట మన సిద్దిపేట.
- పని తీరులో అభివృద్ధి పేట.. స్వచ్ఛత లో శుద్ధి పేట మన సిద్దిపేట.
- స్వచ్ఛతకు మేటి సిద్దిపేట.. సిద్దిపేట అంటేనే స్వచ్ఛత.. స్వచ్చత అంటేనే సిద్దిపేట గా పెరు తెచ్చుకున్నాము.
- స్వచ్ఛత లో సిద్దిపేట.. ప్రగతికి అభివృద్ధి పేటగా మారింది.
- పందులను నిర్మూలించడంతో సిద్దిపేట స్వచ్ఛతకు మొదటి బాటలు పడ్డాయి.
- ఒక్క పార్కు లేని సిద్దిపేటలో ఎన్నో పార్కులు చేసుకున్నాం.. కోమటి చెరువు కోటి అందాలతో వెలుగొందుతున్నది.
- ఒకప్పుడు మున్సిపాలిటీలు అంటే మొర్లు, పందులు, కుక్కలు, చెత్త కుప్పలుగా ఉండేది.
- దేశంలో ఎక్కడా లేని విదంగా రైతు మార్కెట్లు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, చక్కటి వైకుంఠ దామాలు ఏర్పాటు చేసుకున్నాం
- ఇదివరకు సర్కారు దవాఖానాకు వెళ్తే ముక్కుపుటాల అదిరిపోయేవి.
- ఒక్కటి కాదు రెండు కాదు స్వచ్ఛతలో, హరితహారంలో సిద్దిపేటకు 22 అవార్థులు వచ్చాయి.
- సిద్దిపేట పేట పేరు లేకుండా కేంద్రం నుంచి గాని, రాష్ట్రం నుంచి కానీ అవార్డులు ఉండవు.
- చెత్త దైవత్వంతో సమానమన్న మహాత్ముడి మాటను నిజం చేసింది సిద్దిపేట.
- సమాజానికి చెత్త సేకరణలో గొప్ప సంస్కారం చూపారు సిద్దిపేట ప్రజలు.
- విద్యానిలయంగా సిద్దిపేటను మార్చుకున్నాం.. ఆరోగ్య నిలయంగా మార్చుకోబోతున్నాం.
- ఆరు నెలల తరువాత రంగనాయకసాగర్ చూస్తే దేశం అబ్బుర పడబోతున్నది..
- దేశ పటంలో సిద్దిపేట స్థానాన్ని నిలపబోతున్నాం.
- సిద్దిపేట స్వచ్ఛబడి రాష్ట్రానికి స్ఫూర్తి గా మారింది.