26/08/2026
నా కళ్లముందే చనిపోయారు:
ప్రయాణికుడు
HYD నుంచి ఏలూరు వెళ్లేందుకు అర్ధరాత్రి బస్సెక్కానని ప్రయాణికుడు నవీన్ తెలిపారు. ప్రమాద సమయంలో చాలామంది నిద్రలో ఉన్నారని చెప్పారు. భారీ శబ్దం రావడంతో ఉలిక్కిపడి లేచేసరికి ఊహించని ఘోరం కనిపించిందన్నారు. తన పక్కన, ముందున్న ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. క్షణాల్లోనే బస్సులో భీతావహ పరిస్థితి నెలకొందని వివరించారు. ప్రమాద దృశ్యాలు తనను తీవ్రంగా కలచివేశాయని తెలిపారు.