Telangana State Police

Telangana State Police Interactive page to elicit feedback on modernisation and rebranding of Telangana Police. Emergency
(873)

NO MATTER WHERE YOU SIT — BUCKLE UP
02/09/2026

NO MATTER WHERE YOU SIT — BUCKLE UP

గణేష్ ఉత్సవాలు, నిమజ్జన ఏర్పాట్లపై తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన అధికారిక సమావేశానికి డీజీపీ శ్రీ సీవీ ఆనంద్, IPS హాజరయ్...
01/09/2026

గణేష్ ఉత్సవాలు, నిమజ్జన ఏర్పాట్లపై తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన అధికారిక సమావేశానికి డీజీపీ శ్రీ సీవీ ఆనంద్, IPS హాజరయ్యారు. ఈ సమావేశంలో గణేష్ ఉత్సవ కమిటీలు, ఖైరతాబాద్ గణేష్ వంటి భారీ విగ్రహాల నిర్వాహకులు పాల్గొన్నారు.

రవాణా, బీసీ సంక్షేమం మరియు హైదరాబాద్ ఇన్‌చార్జ్ మంత్రి గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి అన్ని శాఖల ఉన్నతాధికారులు, పోలీస్ మరియు మున్సిపల్ అధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా డీజీపీ గారు మాట్లాడుతూ గణేష్ నిమజ్జనానికి సంబంధించిన విధులలో పాల్గొనడం ఇది 14వసారని, 10 సార్లు సిటీ పోలీస్‌లో డీసీపీ, అడిషనల్ సీపీ, సీపీగా నిమజ్జన బందోబస్తు బాధ్యతలు నిర్వర్తించానని గుర్తుచేసుకున్నారు.
6 దశలలో జరిగే బందోబస్తు, గణేష్ మండపాల నిర్వాహకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విగ్రహాల వద్ద భద్రత, పోలీస్ మరియు మున్సిపల్ అధికారుల మధ్య సమన్వయం, నిమజ్జనం కోసం క్రేన్ల ఏర్పాటు వంటి ముఖ్యమైన అంశాల పై డీజీపీ గారు మాట్లాడారు.

అన్ని శాఖల అధికారులు తమ తమ శాఖలు చేపట్టబోయే ఏర్పాట్లను వివరించారు. గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు తమ సందేహాలను వ్యక్తం చేయగా, అధికారులు స్పందించి వాటిని నివృత్తి చేశారు.

DGP Mr. CV Anand attended the Telangana Government’s official meeting on Ganesh festival arrangements with the Ganesh Utsav Committee and other major idol committees, including the Khairtabad Ganesh Committee. The meeting was chaired by the Hon'ble Minister for Transport, BC Welfare (Hyderabad In-charge minister), and attended by heads of various departments, police officials and municipal commissioners.

On this occasion he shared that he is overseeing Ganesh immersions for the 14th time, including 10 occasions in various capacities as DCP, Addl. CP and CP in the City Police. He spoke about the six phases in which bandobust arrangements have to be made, highlighted the responsibilities of the organisers, precautions to be taken at mandaps, the need for close coordination between the police and municipal commissioners, and arrangements for installing cranes for idol immersion. Officials from all departments briefed the meeting on their respective arrangements, while organisers raised their concerns and received clarifications from the concerned officials.

31/08/2026
31/08/2026

is malicious software that locks your files and systems, then demands money to unlock them. Here are few tips to protect yourself.


29/08/2026

హాఫ్-ఇయర్లీ క్రైమ్ రివ్యూ రెండో రోజు పోలీసింగ్‌లో AI టెక్నాలజీ , NCL, పరిపాలన మరియు నాయకత్వ అంశాల పై దృష్టి సారించారు. భవిష్యత్ పోలీసింగ్‌కు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక పై చర్చ జరిగింది.

యువ IPS అధికారులు డెవలప్ చేసిన AI ఆధారిత అప్లికేషన్స్(బీటా వెర్షన్లు), CCTNSలో AI వినియోగం, టెక్నాలజీ ద్వారా మహిళలను కోర్ పోలీసింగ్ విధుల్లోకి ప్రోత్సహించడం, వివిధ డిజిటల్ పోర్టల్స్ అనుసంధానం చేయడం తదితర అంశాల పై ప్రజెంటేషన్ ఇచ్చారు. వీటిలో డీజీపీ గారు కొన్ని కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. ఇకపై TG-SPARK ఈ అప్లికేషన్లను సమీక్షించి, మరింత బలోపేతం చేసి, ప్రామాణీకరించి, అన్ని యూనిట్లలో అమలులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

NCL అమలు, e-Sakshya, e-Forensic మరియు ICJS అనుసంధానం, జాతీయ పోర్టల్స్‌లో తెలంగాణ ర్యాంక్ మెరుగుపర్చడం, అలాగే ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అంశాల పై కూడా సమీక్షించారు.

అత్యుత్తమ పనితీరు కనబరిచిన హైదరాబాద్ (క్లస్టర్-1), రామగుండం (క్లస్టర్-2), నల్గొండ (క్లస్టర్-3), సూర్యాపేట (క్లస్టర్-4) యూనిట్స్ అధికారులను అభినందించారు.

పరిపాలనా ప్రాధాన్యతలు, సిబ్బంది, సంక్షేమం, శిక్షణ, ఇతర శాఖలు మరియు న్యాయస్థానాలతో సమన్వయం వంటి అంశాలపై కూడా చర్చ జరిగింది.

2013 బ్యాచ్ మొదలుకుని యువ ఐపీఎస్ అధికారుల కోసం స్వయంగా డీజీపీ శ్రీ సి.వి. ఆనంద్ గారు లీడర్ షిప్ పై సెషన్ తీసుకున్నారు. ముందుండి నాయకత్వం వహించడం, నిజాయితీ, బృందంగా పనిచేయడం వంటి అంశాల ప్రాధాన్యతను వివరించారు.రెండు రోజుల పాటు చర్చించిన ఆలోచనలు, సాంకేతిక పరిష్కారాలు త్వరలోనే అమలులోకి వచ్చి నేరాల నివారణ, నేరాల ఛేదన మరియు ప్రజా భద్రత మరింత మెరుగు పడనుంది.

28/08/2026

Telangana DGP Mr. C. V. Anand conducted the Half-Yearly Crime Review at the State Police Headquarters today, with all CPs, SPs and officers from various wings in attendance. The review included a detailed three-year comparison of crime trends and unit-wise performance. While overall crime had increased by 7.15% over 2023-24, cybercrime and economic offences had declined by 13%. The increase in narcotics cases reflected intensified enforcement.

A detailed, threadbare review was undertaken of district- and commissionerate-specific crime profiles, with particular attention to areas where performance was lagging. Necessary guidance was provided, and unit officers were tasked with preparing specific action plans.

DGP Mr. C. V. Anand directed CPs and SPs to closely analyse their crime figures, identify hotspots and early signals that could indicate issues that have the potential to disrupt law and order, focus on organised crime and gangs across different crime categories, and strengthen basic policing.

DGP Mr. C. V. Anand exhorted officers to give greater attention to narcotics enforcement, cybercrime, economic offences, crimes against women and children, food adulteration, traffic management and road safety.

The Heads of the Cyber Security Bureau, the Eagle Narcotics Wing and Intelligence, along with their teams, briefed the officers on procedural issues, recent trends and operational aspects in their respective areas. The review also covered welfare, budget and performance in basic policing, including visits to police stations, inspections, crime meetings, field policing, day and night patrolling, and response to Dial 112 calls.

Day 2 will include presentations by young IPS officers on various innovations, followed by discussions on the implementation of the new criminal laws, the ICJS and portals such as Nyaya Shruti. The rollout of the latest versions of AI-based CCTNS, TG-COP and Hawkeye will also be taken up.

తెలంగాణ డీజీపీ శ్రీ సి.వి. ఆనంద్ గారు ఈ రోజు రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో అర్ధ-వార్షిక నేర సమీక్షను నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని కమిషనరేట్ల సీపీలు, జిల్లాల ఎస్పీలు మరియు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈ సమీక్షలో నేర ధోరణులు మరియు యూనిట్ల వారీగా పనితీరు పై విశ్లేషణ జరిగింది. 2023-24తో పోలిస్తే మొత్తం నేరాలు 7.15% పెరగగా, సైబర్ నేరాలు మరియు ఆర్థిక నేరాలు 13% తగ్గాయి. మాదకద్రవ్యాలకు సంబంధించిన కేసుల పెరుగుదల కూడా ఉద్ధృతమైన ఎన్ఫోర్స్మెంట్ చర్యలను ప్రతిబింబిస్తోంది.

జిల్లాలు మరియు కమిషనరేట్ల వారీగా నేర ప్రొఫైళ్లపై సమగ్రమైన, లోతైన సమీక్ష జరిగింది. అవసరమైన మార్గదర్శకత్వం అందించడంతో పాటు, నేరాల నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని యూనిట్ అధికారులను ఆదేశించారు.

నేర గణాంకాలను నిశితంగా విశ్లేషించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశమున్న హాట్‌స్పాట్‌లు మరియు ముందస్తు సంకేతాలను గుర్తించాలని, వివిధ నేర విభాగాల్లో వ్యవస్థీకృత నేరాలు మరియు ముఠాలపై దృష్టి పెట్టాలని, ప్రాథమిక పోలీసింగ్‌ను బలోపేతం చేయాలని డీజీపీ శ్రీ సీవీ ఆనంద్ గారు సీపీలు, ఎస్పీలను ఆదేశించారు.

మాదకద్రవ్యాల నిరోధం, సైబర్ నేరాలు, ఆర్థిక నేరాలు, మహిళలు మరియు పిల్లలపై నేరాలు, ఆహార కల్తీ, ట్రాఫిక్ నిర్వహణ మరియు రోడ్డు భద్రతపై మరింత శ్రద్ధ వహించాలని డీజీపీ శ్రీ సీవీ ఆనంద్ గారు అధికారులకు సూచించారు.

సైబర్ సెక్యూరిటీ బ్యూరో, ఈగిల్ నార్కోటిక్స్ వింగ్ మరియు ఇంటెలిజెన్స్ విభాగాధిపతులు తమ బృందాలతో కలిసి ప్రొసీజర్స్, ఇటీవలి నేర ధోరణులు మరియు ఆపరేషన్స్ పై అధికారులకు వివరించారు. పోలీస్ స్టేషన్ సందర్శనలు, తనిఖీలు, నేర సమావేశాలు, క్షేత్రస్థాయి పోలీసింగ్, పగలు మరియు రాత్రి గస్తీ, డయల్ 112 కాల్స్‌కు స్పందన వంటి ప్రాథమిక పోలీసింగ్‌ అంశాలతో పాటు సంక్షేమం, బడ్జెట్ తదితర అంశాలు కూడా సమీక్షించారు.

రెండో రోజు కార్యక్రమంలో యువ ఐపీఎస్ అధికారులు వివిధ నూతన ఆవిష్కరణలపై ప్రజెంటేషన్లు ఇవ్వనున్నారు, అనంతరం న్యూ క్రిమినల్ లాస్ , ఐసీజేఎస్ మరియు న్యాయ శృతి పోర్టళ్ల పై చర్చలు జరుగనున్నాయి. అలాగే ఏఐ ఆధారిత సీసీటీఎన్ఎస్, టీజీ-కాప్ మరియు హాక్‌ఐ నూతన వెర్షన్ల డెవలప్మెంట్ పురోగతి సమీక్షిస్తారు.

Stay awake, stay alive - never let drowsiness take the wheel
28/08/2026

Stay awake, stay alive - never let drowsiness take the wheel

Happy
28/08/2026

Happy

Telangana DGP Mr.C.V. Anand congratulated renowned Bharatanatyam artiste Dr. Rajeshwari Sainath on receiving the prestig...
27/08/2026

Telangana DGP Mr.C.V. Anand congratulated renowned Bharatanatyam artiste Dr. Rajeshwari Sainath on receiving the prestigious Central Sangeet Natak Akademi Award. Her five-and-a-half decades of dedication to the art, performances in India and abroad, contribution towards training thousands of students through her academy, and her efforts to create awareness on social issues through Bharatanatyam are noteworthy, he said.

తెలంగాణ డీజీపీ సి.వి.ఆనంద్‌ గారు ప్రతిష్ఠాత్మక కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్న ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి డా. రాజేశ్వరి సాయినాథ్ ‌ను అభినందించారు. కళ పట్ల ఐదున్నర దశాబ్దాలుగా ఆమె చూపుతున్న అంకితభావం, దేశ విదేశాల్లో చేసిన ప్రదర్శనలు, తన అకాడమీ ద్వారా వేలాది మంది విద్యార్థులకు శిక్షణ అందించడం, భరతనాట్యం ద్వారా సామాజిక అంశాలపై అవగాహన కల్పించేందుకు చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు.

Address

Director General Of Police
Telangana
500004

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm

Telephone

+91-40-23232831

Alerts

Be the first to know and let us send you an email when Telangana State Police posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telangana State Police:

Shortcuts

Share