YSR Congress Party-YSRCP Tirupati

YSR Congress Party-YSRCP Tirupati YSR Congress Party_Tirupati

18/08/2026

చంద్రబాబు గారు మీరు ఇలాంటి రౌడీ కి పదవి ఇచి మా యాదవుల పై దాడులు చేపిస్తున్నారా ?

18/08/2026

యాక్షన్ అనగానే నటించడం కాదు అన్నా…
కెమెరా ముందు కంటిన్యూటీ కూడా చూసుకోవాలి!

17/08/2026

JB శ్రీనివాస్ రౌడీయిజానికి తాట తీసే రోజులు దగ్గరపడ్డాయి

“తిరుపతిలో JB శ్రీనివాస్ చేస్తున్న రౌడీయిజానికి, అరాచకాలకు తెరపడే రోజులు దగ్గరపడ్డాయి. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారు. ప్రజా వ్యతిరేక చర్యలకు ప్రజలే తగిన సమాధానం చెబుతారు.”

— ఉదయ్ వంశీ,
ఉమ్మడి చిత్తూరు–తిరుపతి జిల్లాల యువజన విభాగం అధ్యక్షులు,
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.

17/08/2026

*యాదవ బిడ్డనైన నేను నిరాహారదీక్షకు సిద్ధం - రేణుక యాదవ్ అమ్మ*.

తబూన్ టీ అంగిట్లో టీ తాగితే 307 హత్యాయత్నం కేసులు పెడతారా . చంద్రబాబు నాయుడు గారు మీరేమన్నా చెప్పారా యాదవులపై దాడి చేయమని అందుకనేనా ఒక ఎర్రచందనం స్మగ్లర్కి తిరుపతి ఇన్చార్జి పదవి ఇచ్చింది. ఇంటి సీసీటీవీ కెమెరాలు చూపించమంటే ఎక్కడో టీ బంకు కాడ ఉండే వీడియోలు చూపిస్తారా అంటూ రేణుక యాదవ్ అమ్మ జేబీ శ్రీనివాసులకు గట్టి వార్నింగ్ .

17/08/2026

రౌడీలా కాదు… హుందాతనంగా రాజకీయాలు చెయ్యి శీనా.
ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు.
ఈ రోజు నువ్వు… రేపు మేము. జాగ్రత్త!

మల్లం రవిచంద్ర రెడ్డి
వైఎస్సార్‌సీపీ తిరుపతి నగర అధ్యక్షులు

17/08/2026

దీనికి ఏం సమాధానం చెప్తావ్ JB శ్రీనివాస్?

17/08/2026

ఏంది అయ్యా జేబీ మైండ్ ఏమైనా దొబ్బిందా ఏంది?...మేము అడగతాండాది ఏంది, నువ్వు చెప్తావుండేది ఏంది? నీకు పోయేకాలం దగ్గర పడుండాదిలే..!

15/08/2026

*మళ్లీ రౌడీయిజం పడగ విప్పిన జేబీ శ్రీనివాస్!*

వాసు యాదవ్‌పై అక్రమ కేసు వ్యవహారంలో తిరుపతి యాదవుల ఆగ్రహం ఇంకా చల్లారకముందే… జేబీ శ్రీనివాస్ మరోసారి బెదిరింపుల రాజకీయాలకు తెరలేపారు..

వైసీపీ 14వ వార్డు అధ్యక్షుడు ఇరగం అనిల్‌రెడ్డి తండ్రికి ఫోన్ చేసి—

*“నీ కొడుకును పందిని కోసినట్లు కోస్తాను… కొర్లగుంట యువకులను వైసీపీలోకి తీసుకెళ్లే ప్రయత్నం ఆపకపోతే మీ కుటుంబాన్నే టార్గెట్ చేస్తాను. వాసు, జర్నలిస్ట్ సునీల్ రాయల్ విషయంలో ఏం జరిగిందో చూశావుగా… మీకూ అదే గతి పడుతుంది. మీ అంతు చూస్తాను, మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు… పోలీసులే నా రౌడీలు!”*

అంటూ అత్యంత దారుణమైన పదజాలంతో బెదిరించారని అనిల్‌రెడ్డి ఆరోపించారు.

ఒక రాజకీయ కార్యకర్తను ఎదుర్కోలేక అతని వృద్ధ తండ్రికి ఫోన్ చేసి కుటుంబం మొత్తాన్ని అంతం చేస్తామంటూ బెదిరించడం రాజకీయమా? లేక వీధి రౌడీయిజమా?

వాసు యాదవ్ ను కేసులతో బయటపెట్టాలని చూసారు… జర్నలిస్టులను కొట్టి బెదిరించారు…
ఇప్పుడు వైసీపీ కార్యకర్తల కుటుంబాలనే లక్ష్యంగా చేసుకుంటున్నారా?

ఈ బెదిరింపులకు అనిల్‌రెడ్డి బహిరంగంగానే ధీటైన సమాధానం ఇచ్చారు:
“ *నీ బెదిరింపులకు భయపడేది లేదు… కొర్లగుంటలో వైసీపీ జెండా ఎగరడం ఆగదు! బరిలో తగ్గేదే లేదు—ఏం పీక్కుంటావో పీక్కో!* ”

జేబీ శ్రీనివాస్… అధికారం శాశ్వతం కాదు. పోలీసుల అండ ఉందనే అహంకారంతో ప్రజలను, వారి కుటుంబాలను బెదిరిస్తే—కాలమే కాదు, చట్టం కూడా సమాధానం చెబుతుంది!

15/08/2026

తిరుపతి

ఢిల్లీ కు వెళ్ళి టెట్ సమస్య పై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ను కలిసి వినతి పత్రం ఇచ్చిన ముగ్గురు టీచర్లపై సస్పెన్షన్ వేటు వేయడం పై ఆగ్రహం వ్యక్తం చేసిన భూమన కరుణాకరరెడ్డి

*భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి ,చిత్తూరు జిల్లాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు*

చంద్రబాబు నాయుడు వంచించడం జీవిత ఆశయం గా పెట్టుకున్న వ్యక్తి

టీచర్లు ను నమ్మించి, ఓట్లు దండుకున్న చంద్రబాబు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత నిలువునా మోసం చేశారు

ప్రభుత్వ టీచర్లు భవిష్యత్ తో ఆటలు ఆడుకుంటున్నారు

ఉపాధ్యాయులు మనోభావాలు దెబ్బతీస్తోంది కూటమి ప్రభుత్వం

చంద్రబాబు వైఖరి పై ప్రభుత్వ టీచర్లు చేసే పోరాటానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుంది

ఇన్ సర్వీస్ టీచర్లు కు టెట్ పరీక్ష తీవ్రంగా వ్యతిరేకిస్తోంది

చంద్రబాబు సర్కారు ప్రభుత్వం మెడలు వంచి టీచర్లు పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది

చంద్రబాబు అరాచక పాలన పై పోరాటం సాగిస్తాము

ప్రభుత్వ టీచర్లు కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది

*యండపల్లి శ్రీనివాసులు రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సి.ఈ.సి సభ్యులు కామెంట్స్*

లక్ష అరవై వేలమంది పైగా ప్రభుత్వ టీచర్లు 90 శాతం టీడీపీ కు అనుకూలంగా ఓటు వేశారు

ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ పరీక్ష ఉత్తీర్ణత తప్పనిసరి చేయాలని నిర్ణయం పున:సమీక్ష చేయాలని కేంద్ర మంత్రి ను కలిశారు

ముగ్గురు ప్రభుత్వ టీచర్లను సస్పెన్షన్ వేటు వేయడంపై ఆగ్రహం

ఇది పూర్తిగా అప్రజాస్వామికమైనది, టీచర్లు స్వేచ్ఛ హరిస్తున్నారు.

1983 లో ఇంటర్మీడియట్ వారికి ఎన్టీఆర్ హయంలో టీచర్లు గా నియమించారు..

టీచర్లకు టెట్ పరీక్ష మినహాయింపు ఇవ్వాలి

ఎంపీలు, ఎమ్మెల్సీ లు తో కలిసి వెళ్ళడం సాకుగా చూపిస్తూ సస్పెన్షన్ వేటు వేయడం అప్రజాస్వామికం ,అన్యాయం

డీఎస్సీలో అవినీతి కప్పిపించ్చేందుకు టీచర్లు పై సస్పెండ్ వేటు వేశారు..

Happy Independence Day 🇮🇳🇮🇳🇮🇳
15/08/2026

Happy Independence Day 🇮🇳🇮🇳🇮🇳

Address

Tirupati
517501

Alerts

Be the first to know and let us send you an email when YSR Congress Party-YSRCP Tirupati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share