07/05/2024
నెల్లూరు నగరంలోని 14వ డివిజన్ ఏ.సి.నగర్, బాలాజీనగర్, పద్మావతి నగర్, శ్రీనగర్, అలాగే 54 డివిజన్ లక్ష్మీపార్వతి నగర్, తదితర ప్రాంతాలలో నగర నియోజకవర్గ అభ్యర్థి *ఎండి.ఖలీల్అహ్మద్* గారు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిన మేలును వివరిస్తూ, కరపత్రాలను పంచుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గడప గడపకు పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యంలో జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచి మీ బిడ్డగా *నన్ను*, నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి అయిన *వేణుంబాక విజయసాయిరెడ్డి* గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కర్తం ప్రతాప్ రెడ్డి, షేక్ సఫియా బేగం, నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు షేక్ జమీర్, వైఎస్ఆర్సిపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.