IP - CVR

25/09/2024

అతి త్వరలో ప్రారంభంబోయే న్యూస్ ఛానల్ లో పని చేయడానికి వీడియో ఎడిటర్స్ కావలెను ,,,,,,

15/08/2024

చాలా మందికి కేరళ అదీ మున్నార్,అలెప్పీ వెళ్ళటం అనేది డ్రీమ్
ఎలా వెళ్లాలి అక్కడ ఏం చూడాలి అనేదానికి ఈ పోస్ట్..

మున్నార్ ఎలా వెళ్లాలి?

రెండు మార్గాలు ఒకటి ట్రైన్ రెండు కార్/బస్

ట్రైన్ అయితే Aluwa అనే స్టేషన్ కి టికెట్ తీసుకోండి స్టేషన్ బయటకు రాగానే మున్నార్ కి నంబర్ ఆఫ్ బస్సెస్, కమాండర్ జీప్ లు ఉంటాయి.Aluwa నుండి మున్నార్ వెళ్ళే రోడ్ అయితే పిచ్చి ఎక్కిస్తుంది.ఆ రోడ్ లో ఆ డ్రైవర్ లు చేసే విన్యాసాలకు తోడు దూరంగా మేఘాలు,జలపాతాలు అసలు దేన్నీ చూడాలో దేన్నీ వదిలేయాలో అర్థం కాని కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యి మున్నార్ అందాలను చూడటానికి మానసికంగా ప్రిపేర్ చేస్తుంది ఈ రోడ్..

బస్సు లేదా కార్ లో వెళ్ళే వాళ్లు అయితే మదురై మీదుగా వెళ్తే తక్కువ దూరం తో చేరుకోగలరు.ఆ రూట్ లో మరిన్ని చూడదగ్గ ప్రదేశాలు ఉంటాయి కాబట్టి లేదు అంటే మీ ఇష్టం ఎలా వెళ్ళినా ఒకే కానీ Theni మీదుగా నేను వెళ్లాను Theni దాటగానే మున్నార్ వాతావరణం స్టార్ట్ అయ్యి చలి స్వాగతం పలుగుతుంది...

నా సలహా అయితే Train కి వెళ్ళండి అప్పుడే డ్రైవింగ్ సమస్య లేకుండా పూర్తీగా ఎంజాయ్ చేయవచ్చు. హిల్ స్టేషన్ లో పెద్దగా ఇబ్బందులు పడరు.దాదాపు ప్రతీ ఆటో డ్రైవర్ కి అక్కడ ఒక చిన్న రిసార్ట్ మరొక కమాండర్ జీపు ఉంటుంది కాబట్టి రెండూ కలిసి మాట్లాడుకోవచ్చు.
రూం అయితే తక్కువ లో కావాలి అంటే 900 నుండి దొరుకుతాయి మెయింటనేన్స్ విషయం లో రాజీ ఉండదు మున్నార్ లో ఏ హోటల్ అయినా సరే. హయ్యస్ట్ అంటే ఇక గార్డెన్ వ్యూ రూమ్స్, సర్వీస్ ఇలా కేటగిరీ బట్టి రోజుకు 6,000 ఛార్జ్ చేసే హోటల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.మున్నార్ టౌన్ లోనే స్టే చేయాలి అనే పట్టింపు లేకపోతే చుట్టూ పది కిలోమీటర్ల లోపు ఎక్కడైనా ఉండచ్చు బడ్జెట్ బట్టి.

ఇక సైట్ సీ కోసం 700-900 రోజుకు ఒక మనిషికి ఛార్జ్ చేసి మున్నార్ తిప్పుతారు.కనీసం మూడు రోజులు ప్లాన్ చేసుకోవటం బెస్ట్.ఫుడ్ కాస్ట్ మాత్రం బాగా ఎక్కువే ఉంటుంది.ప్రతీ హోటల్ లో వెజ్,నాన్ వెజ్ దొరుకుతాయి కేరళ స్పెషల్స్ ట్రై చేయండి బాగుంటాయి.నీళ్ళలో అదేదో ఎర్ర కలర్ వేసి ఇస్తారు ఆయుర్వేదం అంట స్కిన్ కేర్ కోసం బాగుంటాయి దాదాపు అన్ని హోటల్స్ లో తాగు నీరు గా మినరల్ వాటర్ ఇస్తారు అదీ వేడి వేడిగా మన దగ్గర లాగా సపరేట్ గా బాటిల్స్ కి డబ్బులు నూకరు..

ఇప్పుడైతే వర్షాకాలం అంత బాగా చూడలేము మీకు వర్షం ఇష్టం అయితే ఇప్పుడు వెళ్లండి లేదంటే అక్టోబర్ నుండి జనవరి మధ్య ప్లాన్ చేసుకోండి చాలా చాలా ఎంజాయ్ చేస్తారు.ఒంటరిగా కాకుండా ఫ్రెండ్స్ తో వెళ్లండి లైఫ్ లో బెస్ట్ టైం గా మిగులుతుంది మీకు.

అక్కడ టీ తోటలు ఎంత అందంగా ఉంటాయో అసలు

ఇక పోతే చివరగా భాషా సమస్యలు మళయాలం అనగానే అదో భయం ఉంటుంది.కానీ ఆ భయం అస్సలు వద్దు.అక్కడ ఆటో డ్రైవర్ కూడా మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు సో మీ ట్రిప్ చాలా అద్భుతంగా సాగటం లో వీరు సహాయపడతారు.....

ఓ భారతీయుడ , మరిముఖ్యంగా ఓ ఆంధ్రుడా ప్రశ్నించలేని నీ సోమరితనం వలన నేడు నా ఊరు , నా గ్రామం , నా పంచాయితీ , నా మండలం , నా ...
17/04/2024

ఓ భారతీయుడ , మరిముఖ్యంగా ఓ ఆంధ్రుడా ప్రశ్నించలేని నీ సోమరితనం వలన నేడు నా ఊరు , నా గ్రామం , నా పంచాయితీ , నా మండలం , నా నియోజకవర్గం,నా జిల్లా , నా రాష్ట్రం, నా దేశం ఈ అవినీతి రాజకీయ నాయకుల చేతులో అభివృద్ధి నోచుకోకుండా ,కులం , మతం ప్రాంతాల మధ్య వివాదం పెట్టి చోద్యం చూస్తున్నారు తప్ప త్వరగా పరిష్కర మార్గం మాత్రం చూడలేకపోతున్నారు ?
యువతను మద్యం , మాదక ద్రవ్యాల మత్తులో ఉండేలాగా , ప్రజలను ఉచిత పథకాలకు బానిసలుగా చేసి,మేధావులను , దేశ అభివృద్ధి లో నాల్గో స్తంభం అయిన జర్నలిజంను ప్యాకేజి ముసుగులో ఏదీ నిజం ఏదీ అబద్ధం అని ప్రజలు ఆలోచించే లోపే ఈ మేధావులు , జర్నలిజమే రౌడీలను హీరోలు చేస్తుంది ? హీరోలను ఉగ్రవాదులాగా చేస్తారు ? తప్పును ఒప్పు చేస్తుంది ? ఒప్పును తప్పు చేస్తారు , ప్రశ్నించిన వారికి శ్రీకృష్ణ జన్మస్థలం చూపిస్తారు ,ఎదురుతిరిన వాడికి యమదూతను పరిచయం చేసారు నేటి ఈ,నా స్వాతంత్ర భారతదేశంలో.
అవినీతి , దుర్మార్గపు ఆలోచనలు కలిగిలిన రౌడీ రాజకీయాలు వలన నా దేశ సంపద మొత్తం ఇతర దేశాలకు తరలిపోతుంది. ఈ రాజకీయ బంధువులకు , వారి సంస్థలకు , వారి మిత్రులకు వారి పార్టీకి డోనేషన్ ఇచ్చే వ్యక్తులు,సంస్థలకు మాత్రం ఎన్ని లక్షల కోట్ల రూపాయలు మాత్రం రుణమాఫీ జరుగుతుంది కానీ దేశ ప్రజలందరికీ అన్నం పెట్టె రైతన్నకు మాత్రం రుణమాఫీ జరగడం లేదు ఈ నా స్వాతంత్ర భారతదేశంలో ? లక్షల కోట్లు కాజేసిన వారికి ఎమ్మెల్యే , ఎంపీ, సీఎం,పీఎం పదవులు లక్షల రూపాయలు రుణాన్ని చెలించలేని రైతున్నాకు మాత్రం ఉరితాడు.

ఎందుకు వేయాలి ఓటు ?

1. నల్లధనాని స్విస్ బ్యాంక్ ల నుండి తీసుకొని వచ్చి ప్రతి భారతీయుని ఖాతాలో 15లక్షలు జమ చేసినందుకా ?

2. కుల , మతాల, వర్గవిభేదాలు స్పృష్టించి ప్రాంతాల మధ్య వివాదాలను స్పృష్టించినందుకా ?

3. అధికార దాహంతో , ధనమును చూపించి ఇతర పార్టీల నుండి ఎమ్మెల్యే , ఎంపీ లను కొన్నందుకా ?

4. అవసరం లేని ఉచిత పథకాలు ఇచ్చి ప్రజలను సోమరిపోతులను చేసినందుకా ?

5. ప్రతి సంవత్సరం నిరుద్యోగులకు ఉపాధి , ఉద్యోగులు కల్పించినందుకా ?

6. దేశ ప్రజలందరికీ ఉపాధి కల్పించి వారి జీవితాలలో మార్పు తీసుకొని వచ్చినందుకా ?

7. 67 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఉన్న అప్పును కేవలం 10 సంవత్సరాల మీ పాలనలో మూడు రెట్లు పెంచినందుకా ?

8. మీ మిత్రులకు, మీ బంధువులకు,మీ సంస్థలకు, ఫౌండ్ ఇచ్చే పారిశ్రామికవేత్తలకు రుణమాఫీ చేసినందుకా ?

9. అని రాష్ట్రాలకు సమన్యాయం చేసినందుకా ?

10. ప్రభుత్వ ఆస్తులను అమ్మినందుకా ? తాకట్టు పెట్టినందుకా ? మీ మిత్రులకు ధారాదత్తంగా ప్రభుత్వ ఆస్తులను ఇచ్చినందుకా ?

11. ప్రభుత్వ రంగ సంస్థలు రైల్వే, పోర్టులు,విమానాశ్రయం ప్రవేట్ వ్యక్తులకు ప్రవేటికరణం చేసినందుకా ?

12. ప్రత్యేక హోదా సాదించినందుకా ?

13. పూర్తి మద్యపానం నిషేధించినందుకా ?

14. ప్రభుత్వ అస్టులను అమ్మినందుకా , తాకట్టు పెట్టినందుకా లేదా ప్రవేటికరం చేసినందుకా ?

15. ప్రభుత్వ ఆస్తులు మీద అప్పులు చేసి పాలన చేసినందుకా ?

16. పోలవరాని పూర్తి చేసినందుకా ? పూర్తి కానీ పనులను జాతీయం చేసినందుకా ?

17. రైల్వే జోన్ సాదించినందుకా ? విశాఖ హుకు ని ప్రవేటికరణం కాకుండా అదుకునేందుకా ?

18. మంచి రాజధాని నిర్మిచినందుకా ? ప్రభుత్వ కట్టడాలను కూల్చినందుకా ?

19. ప్రశ్నించిన , ఎదురుతిరిగిన ప్రజలను భయభ్రాంతులకు గురిచేసినందుకా ?

20. బ్యాంక్ లకు లక్షల కోట్లు కాజేసిన వ్యక్తులకు ఎమ్మెల్యే , ఎంపీ , సీట్లు ఇచ్చినందుకా ? వారిని అదుపులోకి తీసుకోకుండా కాపాడునందుకా ?

21. అబద్ధపు , అమలు చేయడం కానీ హామీలు ఇచ్చినందుకా ? వాటి అమలు కోసం ప్రజల మీద పన్ను భారం మోపినందుకా ?

22. ఆంధ్ర రాష్ట్రంలో రైతులుకు పూర్తి రుణమాఫీ చేసినందుకా ? అగ్రిగోల్డ్ బాద్యులకు పూర్తిస్థాయిలో న్యాయం చేసినందుకా ?

23. ఆర్ధిక నేరస్తులను దేశం దాటించినందుకా ? అలాంటి వారికి మీ సహాయ సహకారాలు అందిస్తునందుకా ?

ఎందుకు వేయాలో ఓటు చెప్పండి

30/03/2024
కుదిరితే షేర్ చేయండి,,,,,చలనం లేని వారీగా మాత్రం ఉండదు,,,,
25/03/2024

కుదిరితే షేర్ చేయండి,,,,,చలనం లేని వారీగా మాత్రం ఉండదు,,,,

కుదిరితే షేర్ చేయండి,,,,,చలనం లేని వారీగా మాత్రం ఉండదు,,,,
25/03/2024

కుదిరితే షేర్ చేయండి,,,,,చలనం లేని వారీగా మాత్రం ఉండదు,,,,

Address

Vijayawada
520013

Alerts

Be the first to know and let us send you an email when IP - CVR posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to IP - CVR:

Share