03/09/2026
🚔 **విద్యార్థులే రేపటి సమాజం – ట్రాఫిక్, సైబర్ భద్రత & మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన**
విజయవాడ నగర పోలీస్ కమిషనర్ **శ్రీ ఎస్.వి. రాజశేఖర బాబు, IPS** గారి సూచనల మేరకు, ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ **శ్రీ తిరుమలేశ్వర్ రెడ్డి, IPS** గారి ఆదేశాల ప్రకారం, త్రీ డివిజన్ ట్రాఫిక్ ఏసీపీ **శ్రీమతి శ్రీ వేద** గారు మరియు త్రీ ట్రాఫిక్ సీఐ **శ్రీ సుధాకర్** గారి ఆధ్వర్యంలో ప్రభాస్ కాలేజీలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
🚦 **ట్రాఫిక్ అవగాహన:** హెల్మెట్ ధరించడం, డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలు, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం, ట్రిపుల్ రైడింగ్ మరియు డ్రంక్ డ్రైవింగ్‌కు దూరంగా ఉండటం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
📱 **సైబర్ భద్రత:** ఫేక్ లింక్స్, ట్రాఫిక్ చలాన్ల పేరుతో వచ్చే APK ఫైల్స్, ఫ్రీ ఆఫర్లు మరియు అనుమానాస్పద ఆన్‌లైన్ లింక్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
🚫 **మత్తు పదార్థాల నిర్మూలన:** యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, సక్రమమైన మార్గంలో తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. మత్తు పదార్థాల విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు అందించాలని కోరారు.
📲 **AP Astram Citizen App:** యాప్ డౌన్‌లోడ్, ఇన్‌స్టాలేషన్, రిజిస్ట్రేషన్ మరియు వినియోగ విధానంపై విద్యార్థులు, కళాశాల సిబ్బందికి ప్రాక్టికల్‌గా అవగాహన కల్పించారు.
👮♂️ విద్యార్థులు రేపటి బాధ్యతగల పౌరులుగా ఎదిగి, సురక్షితమైన సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని అధికారులు ఆకాంక్షించారు.
Dgp Andhra Pradesh Andhra Pradesh Police