Collectorntr

Collectorntr Official Administrative handle of Collector and District Magistrate, NTR District

రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్...
03/09/2026

రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, IASతో కలిసి కంటెంట్ క్రియేషన్ Studio, Academy, Lab ఏర్పాటుపై సమీక్షించారు. సృజనాత్మకత, డిజిటల్ మీడియా, సంస్కృతి, పర్యాటక రంగాలను అనుసంధానించి యువత, మహిళలకు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని మంత్రి తెలిపారు.

ఎన్‌టీఆర్ జిల్లాలోని పర్యాటక, చారిత్రక, సాంస్కృతిక, వారసత్వ విశేషాలను Videos, Reels, Documentaries ద్వారా విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు స్థానిక కళలు, సంప్రదాయాలు, వంటకాలను డిజిటల్‌గా భద్రపరచాలని సూచించారు. **“Local Talent – Local Income”**కు మార్గం సుగమం చేస్తూ, ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచేలా ఈ కార్యక్రమాన్ని అభివృద్ధి చేయాలని మంత్రి పేర్కొన్నారు.

ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, IAS జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో నిర్మాణంలో ఉన్న MSME పార్క్‌ను ఆకస్మికంగా త...
03/09/2026

ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, IAS జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో నిర్మాణంలో ఉన్న MSME పార్క్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి అంతర్గత రహదారులు, డ్రెయిన్లు తదితర మౌలిక వసతుల పనుల పురోగతిని పరిశీలించారు. పనుల్లో జాప్యం లేకుండా నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులో పూర్తి చేయాలని AP​IIC అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి వర్చువల్ ప్రారంభోత్సవం నాటికి పార్క్‌ను అన్ని మౌలిక వసతులతో సిద్ధం చేయాలని, పరిసరాలను పరిశుభ్రంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సూచించారు. MSME పార్క్ ద్వారా జగ్గయ్యపేట ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి, చిన్న–మధ్యతరహా పరిశ్రమలకు మరింత ప్రోత్సాహం లభించేలా శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.

ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, IAS జగ్గయ్యపేట ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి డయాలసిస్ సెంటర్, ల్యాబ...
03/09/2026

ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, IAS జగ్గయ్యపేట ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి డయాలసిస్ సెంటర్, ల్యాబొరేటరీ, OP విభాగం, వార్డులు తదితరాలను పరిశీలించారు. రోగులతో నేరుగా మాట్లాడి వైద్య సేవలు, మందులు, పరీక్షలు, వైద్యుల అందుబాటు తదితర అంశాలపై ఆరా తీశారు.

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేదలు, సామాన్య ప్రజలకు సకాలంలో నాణ్యమైన, సమర్థవంతమైన, మానవతా దృక్పథంతో వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, వైద్య సేవల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు.

ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, IAS జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో VBG RAM G పథకం కింద చేపట్టిన ఫారం పాండ్స్, ...
03/09/2026

ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, IAS జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో VBG RAM G పథకం కింద చేపట్టిన ఫారం పాండ్స్, ఉద్యానవన పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనులు నాణ్యతా ప్రమాణాలతో, రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరేలా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

రైతులు నీటి కుంటల ద్వారా భూగర్భ జలాలను పెంపొందించుకోవడంతో పాటు, ఉద్యానవన పంటల్లో అంతర పంటల సాగుతో అదనపు ఆదాయం పొందాలని సూచించారు. అర్హులైన రైతులు పథకం ద్వారా అందుతున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

03/09/2026

NTR District collector Dr G Lakshmisha IAS visit Highlights of 02-09-2026

02/09/2026

NTR District collector Dr G Lakshmisha IAS visit Highlights of 01-09-2026

ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, IAS విజయవాడ బావాజీపేటలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులతో మ...
01/09/2026

ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, IAS విజయవాడ బావాజీపేటలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులతో మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

జిల్లాలో 2,24,235 మంది లబ్ధిదారులకు రూ.97.16 కోట్ల విలువైన ఎన్‌టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన లబ్ధిదారులకు ఇంటి వద్దకే నేరుగా పింఛన్లు అందిస్తూ ప్రభుత్వం సామాజిక భద్రతకు భరోసా కల్పిస్తోందన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

01/09/2026

NTR District collector Dr G Lakshmisha IAS visit Highlights of 31-08-2026

ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, IAS రాష్ట్రస్థాయి పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి 13 స్వర్ణం, 12 రజత పతకాలు స...
31/08/2026

ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, IAS రాష్ట్రస్థాయి పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి 13 స్వర్ణం, 12 రజత పతకాలు సాధించిన జిల్లా క్రీడాకారులను అభినందించారు.

ఆగస్టు 24–27 వరకు తిరుపతిలో జరిగిన Amaravati State Level Championshipలో అథ్లెటిక్స్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్, యోగా తదితర క్రీడాంశాల్లో క్రీడాకారులు పతకాలు సాధించారు.

క్రీడాకారుల ప్రతిభను అభినందించిన కలెక్టర్, క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించి NTR జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

Address

Collectrate, NTR District
Vijayawada
520010

Alerts

Be the first to know and let us send you an email when Collectorntr posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share