03/08/2026
*ప్రచురణార్ధం !*
*మహిళా రిజర్వేషన్ అమలులో కేంద్ర ప్రభుత్వ విధానంలో మార్పు కావాలి ..పంచదార్ల దుర్గాంబ*
కేంద్రంలోని బిజెపి నేతృత్వంలోని మోడీ ప్రభుత్వం బోడి గుండుకు మోకాలికి ముడి పెడుతున్న చందంగా మహిళా రిజర్వేషన్లకు అర్థంపర్థం లేని అంశాలతో ముడి పెడుతూ మహిళా రిజర్వేషన్కు మోకాలడ్డుతూ మహిళలను మోసం చేస్తుందని మహిళా సమాఖ్య నగర కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ ఆగ్రహం వ్యక్తం చేసారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానంపై ప్రజలను చైతన్యం పరిచేందుకు సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో నగర వ్యాప్తంగా జరగనున్న ప్రజా పాదయాత్రలు జయప్రదం చేసేందుకు పిలుపునిస్తూ మహిళా సమాఖ్య నాయకురాలు దుర్గాసి రమణమ్మ అధ్యక్షతన మహిళా సమాఖ్య ముఖ్య కార్యకర్తల సమావేశం ఈ రోజు స్థానిక దాసరి భవన్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భముగా దుర్గాంబ మాట్లాడుతూ
కేంద్రంలోని బిజెపి నేతృత్వంలోని మోడీ ప్రభుత్వం మోసపూరిత విధానాలు విడనాడి ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని లేని పక్షంలో మీ ప్రభుత్వాన్ని ఇంటిదారి పట్టించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. గత 12 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న మోడీ ఇచ్చిన హామీలని నెరవేర్చడంలో పూర్తిగా విఫలం చెందారని,మణిపూర్ లో మహిళలను వివస్త్రాలను చేసి ఊరేగించిన మోడీ గుడ్డి వాడిగా ప్రవర్తిచారని,దేశ వ్యాప్తముగా మహిళపై దాడులు పెరిగిపోతున్న వాటిని అరికట్టడంలో ఉన్న చట్టాలను పటిష్టంగా అమలు చేయడంలో చేతకాని ప్రధానిగా పేరుగాంచారని ఎద్దేవా చేసారు. 2023లోనే మహిళలకు చట్ట సభలలో 33% శాతం రిజర్వేషన్ కల్పించే ఉద్దేశంతో బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిన దానికి జనగణన, డీలిమిటేషన్ వంటి వివాదాస్పద అంశాలను ముడి పెడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించకుండా కల్లబొల్లి మాటలతో మహిళాను మోసం చేస్తన్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మేము ఏది తక్కువ కాదు అన్నట్లు సూపర్ సిక్స్ పధకంలో భాగమైన ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలెండర్ పథకం క్రింద రెండు సంవత్సరాలకు గాను 6 ఉచిత సిలెండర్లను ఇవ్వాల్సి ఉండగా ఈ పథకం అర్హులైన అభ్యర్థులకు అందరికీ అందుబాటులోకి తీసుకు రాలేదని,18 సంవత్సరాల దాటిన మహిళలకు ప్రతి నెల ఇస్తాను అన్న 1500 రూపాయల ఆడబిడ్డ నిధి పథకం ఏమైనదని ఎద్దేవా చేసారు.ఇప్పటికైనా పాలక పక్షాలు దరల నియంత్రకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని హితవు పలికారు.
సిపిఐ నగర సహాయ కార్యదర్శి నక్క వీరభద్రరావు పాలకులు ఇటువంటి
ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యపరచి బలమైన ప్రజా ఉద్యమాలు నిర్వహించడం కోసం సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో నగర వ్యాప్తముగా చేప్పట్టనున్న ప్రజా పాదయాత్రకు మహిళలు పూర్తీ సంఘీభావం తెలియజేస్తూ, పాదయాత్రలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని జయప్రదం చేయటం ద్వారా పాలకుల వైఖరిలో మార్పుకు శ్రీకారం చుడతామని తెలియజేసారు.
ఈ సమావేశంలో మహిళా సమాఖ్య నగర అధ్యక్షురాలు ఓర్సు భారతి, కమిటీ సభ్యులు ఇజ్జడ లక్ష్మి, డి.సీతా రావమ్మ,డి.పుష్ప, లంకా నాగమణి,అండిమాని నాగమణి, భాగ్య లక్ష్మీ,బీసు శాంత,Sk.నాగర్ బి తదితరులు పాల్గొన్నారు.