21/08/2015
సెప్టెంబరు 2 సార్వత్రిక సమ్మె డిమాండ్ -7
కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల వాటాల అమ్మకాన్ని (డిజిన్వెస్ట్మెంట్ ను), ప్రయివేటీకరణను ఆపాలి.
1991లో పి.వి.నరసింహారావు ప్రభుత్వము సరళీకరణ-ప్రయివేటికరణ-ప్రపంచికరణ విధానాలను ప్రకటించిన తరువాత గతఏ ప్రభుత్వమూ చేపట్టనంత పెద్ద ఎత్తున ప్రభుత్వ రంగ సంస్థల వాటాల అమ్మకానికి, ప్రయివేటికరణకు మోడీ ప్రభుత్వము ఉపక్రమించింది.
కేంద్రం లో వున్న వివిధ ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థల వాటాల అమ్మకం మరియు ప్రయివేటికరణ ద్వారా సమకూర్చిన సొమ్ము:
1991-92 నుండి 1997-98 వరకు(కాంగ్రెస్, యునైటెడ్ ఫ్రంట్)---రు.11242.50 కోట్లు
1998-99 నుండి 2003-04 వరకు(వాజపాయి ప్రభుత్వము)---రు. 33655.59 కోట్లు
2004-05 నుండి2008-09 వరకు(యు పి ఎ -1 ప్రభుత్వము)---రు. 8515.94 కోట్లు
2009-10 నుండి 2013-14 వరకు(యు పి ఎ -2 ప్రభుత్వము)---రు. 99367.46 కోట్లు
2014-15 లోమోడీ ప్రభుత్వముమొదటి సంవత్సరం లోనే ------- రు.24328.93 కోట్లు
అంతకు ముందుతో పోలిస్తే 1998-99 నుండి 2003-04 వరకువాజపాయి ప్రభుత్వ హయాములోడిజిన్వెస్ట్మెంట్ బాగా జరిగిందని పై వివరాలు తెలియజేస్తున్నాయి. డిజిన్వెస్ట్మెంట్ మరియు ప్రయివేటికరణ వేగముగా జరిపేందుకు వాజపాయి హయాములో డిజిన్వెస్ట్మెంట్ కు ఒక మంత్రినే విడిగా నియమించటం జరిగింది. వాజపాయి హయాములో వ్యూహాత్మక అమ్మకం పేరుతొ అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ప్రయివేటు పరమయ్యాయి.ప్రభుత్వము మైనారిటి వాటాలను కాని(51 శాతం కు తక్కువ)లేకమెజారిటి వాటాలను(51 లేదా అంతకన్నా ఎక్కువ శాతం) కాని ఒక ప్రయివేటు కంపెనీకి అమ్మి దానికే మేనేజిమేన్టును అప్పగించి ప్రయివేటు పరం చేయతం ఈ వ్యూహాత్మక అమ్మకం సారాంశం.ఈ వ్యూహాత్మక అమ్మకం పేరుతొ వాజపాయి ప్రభుత్వము బాల్కో, హిందూస్తాన్ జింక్, హోటల్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ఆధీనములో వున్న రెండు సెంటార్ హోటల్సు, ఇండియా టూరిజం కార్పోరేషన్ అధినం లో వున్న 18 హోటల్సు, జేస్సోప్, లగాన్జూట్ మెషినరి, మారుతి సుజుకి, మోడరన్ ఫుడ్ ఇండస్ట్రిస్, విఎస్ఎన్ఎల్, హెచ్ టి ఎల్, సిఎంసి, పరదీప్ ఫాస్ఫేట్స్ లనుప్రయివేటు పరం చేసింది. ఈ ప్రయివేటికరణ కార్యక్రమంలో ప్రభుత్వము తన వాటాలను మార్కెట్ రేటుకన్నా చాలా తక్కువకు అమ్మినందున ప్రభుత్వానికి నష్టం వచ్చి ప్రయివేటు కంపెనీలకు భారీ లాభం వచ్చింది.లక్ష్మి విలాస్ పాలస్ హోటల్ ను దాని మార్కేట్ విలువ రు.151 కోట్లు కాగా జరిగిన రు.7.5 కోట్లకే భారత్ హోటల్సు కు అమ్మినట్లు సి బి ఐ ప్రాథమిక విచారణలో నిర్ధారించింది.విఎస్ఎన్ఎల్ ప్రయివేటికరణలో కూడా, ఆ సంస్థను కొన్న టాటాలకు రు. 1200 కోట్ల అనుచిత ప్రయోజనం లభించింది.ప్రభుత్వ రంగ సంస్థల ను ఈ విధముగా వాజపాయి ప్రభుత్వము కారు చవుకగా అమ్మింది.
వాజపాయి హయాముతో పోలిస్తే ఆ తరువాత వచ్చిన యు పి ఎ-1 హయాము లో అతి తక్కువ డిజిన్వెస్ట్మెంట్ జరిగినట్లు పై వివరాలు తెలియజేస్తున్నాయి. ఇందుకు కారణం యు పి ఎ-1 ప్రభుత్వము వామపక్షాల మద్దతు పై ఆధార పడటమే.ఇంతేగాక వామపక్షాల ఒత్తిడి వలన యు పి ఎ-1 ప్రభుత్వముడిజిన్వెస్ట్మెంట్ మంత్రి పదవిని రద్దు చేసింది. వ్యూహాత్మక అమ్మకాల పేరుతొ జరుగుతున్నా ప్రయివేటికరణను ఆపుజేసింది.వామపక్షాలు బలం గా వుంటే ప్రయివేటికరణ కార్యక్రమం ఆగిపోతుందని ఇది రుజువు చేస్తున్నది.
ఇందుకు భిన్నముగా వామపక్షాల మద్దతు అవసరం లేని యు పి ఎ-2 హయాములో పెద్ద ఎత్తున డిజిన్వెస్ట్మెంట్ అమలు జరిగింది.
అంతకన్నా పెద్ద ఎత్తున ఇప్పుడు మోడీ హయాము లో డిజిన్వెస్ట్మెంట్ అమలు జరుగుతున్నది. ఒక్క 2014-15 లోనే రు.24328.93 కోట్లు భారీ స్థాయి డిజిన్వెస్ట్మెంట్ జరిగింది. కోల్ ఇండియా లిమిటెడ్ మరియు సెయిల్ (స్టిల్ అథారిటి ఆఫ్ ఇండియా) లలో వాటాల అమ్మకం ద్వారా ఈ సొమ్ము వచ్చింది. ఈ రెండు కూడా మహారత్న కంపెనీలు. కోల్ ఇండియా లో 10 శాతం వాటాలు అమ్మింది. దిని వలన రు. 11,360.13 కోట్లు వచ్చాయి. కోల్ ఇండియా లో ఈ అమ్మకం అనంతరం ప్రభుత్వానికి ఇంకా మిగిలిన వాటాలు 79.65 శాతం. సెయిల్ లో 5 శాతం వాటాలు రు. 1715కోట్లకు అమ్మింది. ప్రభుత్వానికి ఇంకా మిగిలిన వాటాలు 75 శాతం.
ఈ ఆర్ధిక సంవత్సరం 2015-16లో డిజిన్వెస్ట్మెంట్ ద్వారా రు. 69,500 కోట్ల భారి మొత్తం సంపాదించాలనిమోడీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో రు.41000 కోట్లు మైనారిటి వాటాల అమ్మకం ద్వారా సంపాదించాలని నిర్ణయించింది. మిగతా రు. 28500 కోట్లు వ్యూహాత్మక అమ్మకాల ద్వారా (అంటే మైనారిటిలేదా మెజారిటి వాటాలను కొనే ప్రయివేటు కంపెనీకే మేనేజిమెంటు అప్పగించి వెంటనే ప్రయివేటు పరం చేయటం) సంపాదించాలని నిర్ణయించింది.
ఇప్పటికే మోడీ ప్రభుత్వము ఈ క్రింది ప్రభుత్వ రంగ సంస్థలలో మైనారిటి వాటాల అమ్మకానికి నిర్ణయించింది:
1. ఆయిల్ ఇండియా లిమిటెడ్ (OIL) – ప్రభుత్వానికి వున్న వాటాలు=67.64 శాతం; అమ్మకానికి పెట్టినవి=10 శాతం; ప్రభుత్వానికి ఇంకా మిగిలేది= 57.64 శాతం
2. కంటెయినర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(CCL)-- ప్రభుత్వానికి వున్న వాటాలు=61.80 శాతం; అమ్మకానికి పెట్టినవి=5శాతం; ప్రభుత్వానికి ఇంకా మిగిలేది= 56.8 శాతం
3. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ (NMDC)-- -- ప్రభుత్వానికి వున్న వాటాలు=80 శాతం; అమ్మకానికి పెట్టినవి=10శాతం; ప్రభుత్వానికి ఇంకా మిగిలేది= 70 శాతం;
4. మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పోరేషన్ (MMTC)-- -- ప్రభుత్వానికి వున్న వాటాలు=89.93 శాతం; అమ్మకానికి పెట్టినవి=15శాతం; ప్రభుత్వానికి ఇంకా మిగిలేది= 74.93 శాతం
5. ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పోరేషన్ (ITDC)----- -- ప్రభుత్వానికి వున్న వాటాలు=87.03 శాతం; శాతం; అమ్మకానికి పెట్టినవి=12.03శాతం; ప్రభుత్వానికి ఇంకా మిగిలేది= 75 శాతం
6. నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్ (NTPC)----- -- ప్రభుత్వానికి వున్న వాటాలు=74.96 శాతం; అమ్మకానికి పెట్టినవి=5శాతం; ప్రభుత్వానికి ఇంకా మిగిలేది= 69.96 శాతం
7. ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ (EIL)--- -- ప్రభుత్వానికి వున్న వాటాలు=69.37 శాతం; అమ్మకానికి పెట్టినవి= 10 శాతం; ప్రభుత్వానికి ఇంకా మిగిలేది= 59.37 శాతం
8. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) ------ ప్రభుత్వానికి వున్న వాటాలు=75.02 శాతం; అమ్మకానికి పెట్టినవి=5శాతం; ప్రభుత్వానికి ఇంకా మిగిలేది= 70.02శాతం
9. నేషనల్ అల్యూమినియం కంపెని (NALCO)--- -- ప్రభుత్వానికి వున్న వాటాలు=80.93 శాతం; అమ్మకానికి పెట్టినవి=10 శాతం; ప్రభుత్వానికి ఇంకా మిగిలేది= 70.93 శాతం
10. హిందూస్తాన్ కాపర్ లిమిటెడ్ (HCL) ---- ప్రభుత్వానికి వున్న వాటాలు=89.95 శాతం; అమ్మకానికి పెట్టినవి=15 శాతం; ప్రభుత్వానికి ఇంకా మిగిలేది= 74.95 శాతం
వీటిలో NTPC మహారత్న కాగా BEL, OIL, NMDC, NALCO, EIL, CCL లు నవరత్న కంపెనీలు. బాగా లాభాలతో నడుస్తున్న మహారత్న, నవరత్న సంస్థల వాటాలనుకూడా మోడీ ప్రభుత్వము పెద్ద ఎత్తున అమ్మకానికి పెడుతున్నది.
పైన తెలియ జేసిన పది సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమం ద్వారా సుమారు రు.50000 కోట్లు వస్తాయని అంచనా.
ఈ విధముగా సంవత్సరానికి 5 లేదా 10 శాతం అమ్ముకుంటూ పోతే త్వరలోనే ఈ సంస్థలు ప్రయివేటు పరమవుతాయి.
ఇవి కాక వ్యూహాత్మక వాటాల అమ్మకం జరపాల్సిన ప్రభుత్వ రంగ సంస్థల జాబితానుకూడా తయారు చేసినట్లు ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ 25.3.2015 న అన్నారు. ఈ జాబితా లో వున్న పేర్లు బయటికి రాలేదు. కాని టూరిజం విభాగం లో వున్న ప్రభుత్వ రంగ సంస్థలలో ఇది అమలు చేస్తామని జైట్లీ అన్నారు. అయితే ఈ వ్యూహాత్మక అమ్మకం టూరిజం సంస్థలకే పరిమితమవ్వాలని లేదు. ప్రభుత్వము తన వీలును బట్టి ఏ సంస్థనయినా ఈ వ్యుహాత్మక అమ్మకానికి పెట్టవచ్చు.
వ్యూహాత్మక అమ్మకం పేరుతొ ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటికరణను గతం లోవాజపాయి ప్రభుత్వము పెద్ద ఎత్తున అమలు చేసింది. ఇప్పుడు మోడీ ప్రభుత్వమూ కుడా దీనిని కొనసాగించే పనిలో వున్నది.ఈ విధముగా లాభసాటి సంస్థలలో మైనారిటి షేర్ల అమ్మకం ద్వారా వాటినిక్రమంగా ప్రయివేటు పరం చేయటం, వ్యూహాత్మకఅమ్మకం పేరుతొ కొన్నింటిని వెంటనే ప్రయివేటు పరం చేయటం మోడీ ప్రభుత్వ విదానముగా వున్నది.
నష్టాలలో వున్న ప్రభుత్వ రంగ సంస్థలను, ఖాయిలా పడిన ప్రభుత్వ రంగ సంస్థలను పునరుద్ధరించేందుకు మోడీ ప్రభుత్వమూ మాటలు చెప్పటం తప్ప ఆచరణలో ముందుకు రావటం లేదు. నష్టాలలో వున్న బిఎస్ఎన్ఎల్ ను ముక్కలుగావిభజించి ప్రయివేటు పరం చేసే ఆలోచనలో మోడీ ప్రభుత్వము వున్నది. బిఎస్ఎన్ఎల్ నుండి సెల్ టవర్స్ నివిడగొట్టి ఒక టవర్ కంపెనీని ఏర్పాటు చేసి దానిలో ఒక ప్రయివేటు భాగ స్వామిని తీసుకు రావాలని, ఆ విధముగా డిజిన్వేస్త్మెంటు, ప్రయివేటికరణ అమలు జరపాలని గతం లో యు పి ఎ ప్రభుత్వము ఒక ప్రతిపాదన చేసింది. దీనినే ఇప్పటి మోడీ ప్రభుత్వము కొనసాగిస్తున్నది. 22.7.2015న లోక్ సభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన జవాబులో బిఎస్ఎన్ఎల్ నుండి టవర్ కంపెనీని విడగోట్టేందుకు ప్రణాళిలకని రూపొందిస్తున్నట్లు కమ్యునికేషన్ల మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలియజేసారు.
దీర్ఘ కాలముగా ఖాయిలా పడిన ప్రభుత్వ రంగ సంస్థలు కొన్నింటిని మూసి వేస్తామని మోడీ ప్రభుత్వము ప్రకటించింది.
ఇంతేగాక మోడీ ప్రభుత్వము బొగ్గు గనుల చట్టాన్ని సవరించి బొగ్గు గనులను ప్రయివేటు కంపెనీలకు ఇచ్చే విలు కలిగించింది.. పర్యావరణకి మరియు గిరిజనుల ప్రయోజనాలకు పెద్ద ఎత్తున ముప్పు తెచ్చే విధముగా గనుల చట్టాన్ని సవరించింది. రైల్వేలైన్లు వేయటం మరియు మెయింటెయిన్ చేయటం, వ్యాగన్ల నిర్మాణం, ట్రైన్ లు నడపటం, తదితరాలలో ప్రయివేటు కంపెనీలను అనుమతించాలని మోడీ ప్రభుత్వమూ నియమించిన వివేక్దేవ్ రాయ్ కమిటి సిఫార్సు చేసింది.ఈ విధముగా మోడీ హయాములో ప్రయివేటికరణ కార్యక్రమం అనేక రూపాలలో పెద్ద ఎత్తున అమలు జరుగుతున్నది.
ఇంతకీ ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను ఇంత పెద్ద ఎత్తున అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది?విదేశి, స్వదేశి కార్పోరేట్స్ కు వాటిని అసలుకన్నా తక్కువకి అమ్మి లాభాలు చేకూర్చేందుకు మోడీ ప్రభుత్వము ఈ పని చేస్తున్నది.
అంతకన్నాముఖ్యంగాకార్పొరేట్స్ కు బడ్జెట్ లో సంవత్సరానికి రు.5 లక్షల కోట్లకు మించి యిస్తున్న పన్నుల రాయితీలు, మినహాయింపుల వలన ఏర్పడిన లోటును భర్తీ చేసేందుకు మోడీ ప్రభుత్వము ఈ పని చేస్తున్నది. ఇది కార్పోరేట్సుకు లాభం కలిగించి, దేశ సంపద అయిన ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేసే కార్యక్రమం.
ప్రభుత్వ రంగ సంస్థల డిజిన్వెస్ట్మెంట్ మరియు ప్రయివేటికరణ ను విరమించాలని, నష్టాలలో వున్నబిఎస్ఎన్ఎల్ తదితర ప్రభుత్వ రంగ సంస్థలను, ఖాయిలా పడిన ప్రభుత్వ రంగ సంస్థలను పునరుద్ధరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.