Vijay Chandra Bonela

Vijay Chandra Bonela MLA - Parvathipuram (Andhra Pradesh) | | | Join me in making a positive change in society!

Vijay Chandra Bonela - "Empowering Youth, Creating Employment, Eradicating Poverty - Together we Rise!"

Passionate about community development, corporate social responsibility, and electronic media. Dedicated to motivating youngsters to be leaders and entrepreneurs, and work towards eradicating poverty. Let's inspire and empower the present and future generation.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సందడిపార్వతీపురం: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్వతీపురం నియోజకవర్గ తె...
15/08/2026

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సందడి

పార్వతీపురం: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్వతీపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ప్రత్యేక కార్యక్రమాలను ఉత్సాహభరితంగా నిర్వహించారు. శాసనసభ్యులు బోనెల విజయచంద్ర గారి సతీమణి శ్రీమతి అనూష గారి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, మహిళలకు క్విజ్, లెమన్ అండ్ స్పూన్, మ్యూజికల్ చైర్ తదితర పోటీలు నిర్వహించి సందడి చేశారు.

స్వాతంత్ర్య దినోత్సవ స్ఫూర్తిని ప్రతిబింబించేలా నిర్వహించిన క్విజ్ పోటీల్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపన, పార్టీ ప్రస్థానం, పార్టీ సిద్ధాంతాలు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్రంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులు తదితర అంశాలపై ప్రశ్నలు అడిగారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని తమ అవగాహనను, విషయ పరిజ్ఞానాన్ని ప్రదర్శించారు.

అనంతరం నిర్వహించిన లెమన్ అండ్ స్పూన్ పోటీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహిళలు, పార్టీ నాయకులు ఉత్సాహంగా పాల్గొని పోటీపడుతూ సందడి చేశారు. అనంతరం నిర్వహించిన మ్యూజికల్ చైర్ పోటీలోనూ పాల్గొన్న వారు ఉత్సాహంగా పోటీపడి కార్యక్రమాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చారు.

దేశభక్తి భావంతో పాటు పార్టీ శ్రేణుల్లో స్నేహభావం, ఐక్యత, ఆత్మీయతను పెంపొందించేలా ఈ కార్యక్రమాలను నిర్వహించారు. ఆటపాటలతో సాగిన ఈ వేడుకలు పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళల్లో ఆనందాన్ని, ఉత్సాహాన్ని నింపాయి.

ఈ సందర్భంగా శ్రీమతి అనూష గారు మాట్లాడుతూ, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశం కోసం త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకోవడంతో పాటు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అందరూ ఒకే వేదికపై కలుసుకుని ఆనందంగా గడపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలిపారు. పార్టీ శ్రేణుల్లో ఐక్యత, ఆత్మీయత మరింత బలోపేతం కావడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు.

పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న ప్రతి ఒక్కరినీ అభినందించిన అనూష గారు, కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

*రాష్ట్ర స్థాయిలో మెరిసి పార్వతీపురం పేరు నిలబెట్టాలి**గెలుపోటములను సమానంగా స్వీకరించడమే క్రీడా స్ఫూర్తి**ఎమ్మెల్యే బోనె...
11/08/2026

*రాష్ట్ర స్థాయిలో మెరిసి పార్వతీపురం పేరు నిలబెట్టాలి*

*గెలుపోటములను సమానంగా స్వీకరించడమే క్రీడా స్ఫూర్తి*

*ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర*

క్రీడలు మనుషుల్లో డిసిప్లిన్, లీడర్‌షిప్ క్వాలిటీస్‌తో పాటు గెలుపోటములను సమానంగా స్వీకరించే మనస్తత్వాన్ని నేర్పిస్తాయని పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయ చంద్ర అన్నారు. మంగళవారం స్థానిక ఎస్ వి డి కళాశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి అమరావతి ఛాంపియన్ షిప్ 2026 పోటీలను ప్రారంభించారు. కార్యక్రమం లో శాసనసభ్యులు మాట్లాడుతూ పార్వతీపురం నియోజకవర్గం నుంచి క్రీడల్లో రాణిస్తున్న విద్యార్థులు, క్రీడాకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గ స్థాయిలో మంచి ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయికి చేరుకున్న క్రీడాకారులంతా అదే స్ఫూర్తితో రాష్ట్ర స్థాయిలో కూడా మెరిసి పథకాలు సాధించాలని పిలుపునిచ్చారు.

ఒకప్పుడు అర్జున అవార్డు గ్రహీతలు, ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ ప్రతినిధులు ఉన్న మన జిల్లా చరిత్రను గుర్తుచేస్తూ, నాటి క్రీడాకారులను ఆదర్శంగా తీసుకొని ప్రస్తుత తరం ముందుకు సాగాలన్నారు. అలనాటి గౌరవ క్రీడాకారులు ఎస్. సీవా జయరామ్ (1987లో బాక్సింగ్‌లో అర్జున అవార్డు గ్రహీత)ను బోనెల విజయ్ చంద్ర గారు సన్మానించి ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు క్రీడాకారులకు పిలుపునిచ్చారు. మైదానంలో నేర్చుకునే ప్రతి పాఠం జీవితంలో విజయం సాధించడానికి బలమైన పునాదిగా మారుతుందని, గెలుపును ఆస్వాదించడమే కాకుండా ఓటమిని సైతం స్వీకరించి రాబోయే విజయానికి తొలిమెట్టుగా మార్చుకోవాలని సూచించారు. విద్యార్థులు బాగా చదువుకుంటూనే, బాగా ఆడాలని, మంచి ఆహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పేర్కొన్నారు. అమరావతిలో జరిగే పోటీలకు వెళ్లే పార్వతీపురం క్రీడాకారులంతా కప్పులు సాధించి వస్తే వారందరికీ ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తామని, వారి విజయం కోసం పూర్తి అండగా ఉంటామని హామీ ఇస్తూ, క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

తల్లి బిడ్డ అంబులెన్స్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర..పార్వతీపురం : పార్వతీపురం కేంద్ర ప్రభుత్వ ఆసు...
11/08/2026

తల్లి బిడ్డ అంబులెన్స్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర..

పార్వతీపురం : పార్వతీపురం కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి బిడ్డ అంబులెన్స్ ఎక్స్ప్రెస్ వాహనాన్ని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర మంగళవారం ప్రారంభించారు. పార్వతీపురం జిల్లా ఆసుపత్రి కి ప్రభుత్వం కొత్తగా తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాలు మంజూరు చేయగా, ఆసుపత్రి ఆవరణలో కొత్త వాహనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి ఆసుపత్రిలో కాన్పునిచ్చిన ఒక బాలింతరాలని, నవ జాత శిశువుతో కలిసి ఎక్స్ప్రెస్ లో ఎక్కించి. తగు ఆరోగ్య సూచనలు ఇచ్చి వారి ఇంటికి సాగానంపారు. అంతకుముందు బాలింతలతో మాట్లాడి ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్పొరేట్ ఆస్పత్రికి మించి నాణ్యమైన వైద్య సేవలను చంద్రబాబు ప్రభుత్వం అందిస్తుందని ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ఉద్భోదించారు. ఉచితంగా అందుతున్న నాణ్యమైన వైద్య సేవలతో తల్లులకు బిడ్డలకు పూర్తి రక్షణ కలుగుతుందని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, వైద్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రభుత్వాసుపత్రిలో అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారని వివరించారు.

*రూ. 86.14 కోట్లతో పార్వతీపురం మున్సిపాలిటీకి శాశ్వత మంచినీటి పరిష్కారం**ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర*​పార్వతీపురం మున్సిపా...
11/08/2026

*రూ. 86.14 కోట్లతో పార్వతీపురం మున్సిపాలిటీకి శాశ్వత మంచినీటి పరిష్కారం*

*ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర*

​పార్వతీపురం మున్సిపాలిటీ ప్రజల దశాబ్దాల కల అయిన మంచినీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం చూపేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని స్థానిక శాసనసభ్యులు బోనెల విజయచంద్ర తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా యూఐడీఎఫ్ (UIDF) పథకం కింద రూ. 86.14 కోట్ల అంచనా వ్యయంతో 13.50 MLD కెపాసిటీ గల నూతన తాగునీటి సరఫరా పథకానికి అంచనాలు మంజూరయ్యాయని, అందులో భాగంగా బెలగాం ట్యాంక్ వద్ద 500 KL సర్వీస్ రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
​ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత 40-50 ఏళ్ల క్రితం నిర్మించిన వాటర్ స్కీమ్ శిథిలావస్థకు చేరడంతో పట్టణ ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొన్నారని, ఎన్నికల ముందు ప్రతి ఇంటికీ మంచినీరు అందిస్తామని ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టిందని తెలిపారు. రాబోయే 20 సంవత్సరాల జనాభా పెరుగుదల మరియు మైగ్రేషన్‌ను దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుతం అవసరమైన నీటి పరిమాణం కంటే దాదాపు రెట్టింపు స్థాయిలో సరఫరా జరిగేలా ఈ పథకాన్ని డిజైన్ చేసినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు టెండర్‌ను ఎన్సీసీ (NCC) సంస్థ దక్కించుకుందని, పనులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి వేగంగా పూర్తి చేయాలని వారిని ఆదేశించామన్నారు. ఇదే తరహాలో మరొక రెండు వాటర్ రిజర్వులను పార్వతీపురంలో మంజూరు చేయడం జరిగిందని, రాబోయే 8 నుండి 9 నెలల వ్యవధిలోనే పనులు పూర్తి చేసి ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా స్వచ్ఛమైన మంచినీరు అందిస్తామని, దీనితో వేసవితో సహా ఏ కాలంలోనూ నీటి కష్టాలు ఉండవని ధీమా వ్యక్తం చేశారు.
​రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పార్వతీపురం మంచినీటి సమస్య తీవ్రతను గుర్తించి వెంటనే స్పందించి నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రికి నియోజకవర్గ ప్రజల తరఫున, మున్సిపాలిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతిపక్షాల ఫేక్ ప్రచారాలను నమ్మవద్దని, మాట ఇచ్చిన ప్రకారం చెప్పిన సమయానికి పనులు పూర్తి చేసి ప్రాజెక్టును మున్సిపాలిటీకి అంకితం చేస్తామని ఎమ్మెల్యే విజయచంద్ర స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

*కుంకీ ఏనుగులతో మన్యం జిల్లాలో ఇకపై ఏనుగుల దాడి బెడదకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు**ప్రజల ప్రాణాలు, పంటల రక్షణే ప్రభుత...
29/07/2026

*కుంకీ ఏనుగులతో మన్యం జిల్లాలో ఇకపై ఏనుగుల దాడి బెడదకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు*

*ప్రజల ప్రాణాలు, పంటల రక్షణే ప్రభుత్వ లక్ష్యం*

*ఏనుగుల దాడుల నివారణకు కుంకీ ఏనుగులు కీలకం*

*కుంకీ ఏనుగుల ఆగమనంతో మన్యం ప్రజలకు ఊరట*

*ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర*

మన్యం జిల్లాలో ఏనుగుల బెడదకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని, పలమనేరు నుంచి తీసుకొచ్చిన కుంకీ ఏనుగులు ఈ సమస్య నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర అన్నారు. జిల్లాకు చేరుకున్న కుంకీ ఏనుగులకు ఆయన ఘనంగా స్వాగతం పలికారు.
మన్యం జిల్లాలో అడవి ఏనుగుల దాడుల కారణంగా ఇప్పటివరకు 13 మంది ప్రాణాలు కోల్పోయారని, వందల ఎకరాల్లో పంటలు ధ్వంసమై రైతులు తీవ్రంగా నష్టపోయారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులను, పంటలను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కట్టుబడి ఉందని తెలిపారు.
ఉత్తరాంధ్ర ప్రాంతంలో మానవ-ఏనుగుల సంఘర్షణను తగ్గించి, ప్రజలకు మరియు పంటలకు రక్షణ కల్పించడమే తమ ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి మరియు అటవీ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలో గుచ్చిమి ఎలిఫెంట్ క్యాంప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి జూమ్ మీటింగ్ లో పాల్గొన్నారు. గుచ్చిమిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర మహిళాశిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖా మాత్యులు గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్యే జయకృష్ణ, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పార్వతీపురం జిల్లా కలెక్టర్ డా ఎన్ ప్రభాకర రెడ్డి హాజరైయారు.

ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏనుగుల సమస్యను శాసనసభలో ప్రస్తావించిన వెంటనే ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి ప్రత్యేక చర్యలు చేపట్టారని, కుంకీ ఏనుగులను జిల్లాకు పంపించడం ప్రజల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. ఇందుకు ఉప ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అడవి ఏనుగులు గ్రామాల్లోకి ప్రవేశించకుండా రాత్రింబవళ్లు గ్రామాల సరిహద్దుల్లో అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్న అటవీ శాఖ అధికారులు, సిబ్బంది సేవలను ఎమ్మెల్యే ప్రశంసించారు. వారి కృషి వల్ల ప్రజలకు గణనీయమైన భరోసా కలుగుతోందని అన్నారు.

గుచ్చిమి–పార్వతీపురం ప్రాంతంలో అంతరించిపోతున్న వృక్షజాలం, జంతుజాల పరిరక్షణ కోసం బయోడైవర్సిటీ పార్క్ ఏర్పాటు చేయాలని, కుంకీ ఏనుగుల సహాయంతో అడవి ఏనుగులను నియంత్రించే ప్రత్యేక కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని, ఈ ప్రాంతాన్ని ఎలిఫెంట్ శాంచ్యురీతో పాటు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి ప్రతిపాదించినట్లు తెలిపారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎంత క్లిష్టమైన సమస్య అయినా పరిష్కరించి ప్రజల ప్రాణాలు, పంటలను కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపడుతుందని ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర స్పష్టం చేశారు.

ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయ్ చంద్ర గారు.తెలుగుదేశం పార్టీ మరియు కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ...
29/07/2026

ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయ్ చంద్ర గారు.

తెలుగుదేశం పార్టీ మరియు కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న "ఇంటింటికీ తెలుగుదేశం" కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే విజయ చంద్ర గారు బుధవారం పార్వతీపురం మండలం గొచక్క, లిడికివలస గ్రామంలోని విస్తృతంగా పర్యటించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించి , రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అలాగే సూపర్ సిక్స్ హామీల అమలు, మహిళలు, రైతులు, యువత, విద్యార్థులు, వృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందజేస్తున్న పథకాలు ఇంటింటికీ చేరవేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు.

ప్రజలతో నిరంతరం మమేకమవుతూ వారి సమస్యలను పరిష్కరించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

గ్రామ ప్రజలు ఎమ్మెల్యే విజయ్ చంద్ర గారికి ఘన స్వాగతం పలికి, తమ ప్రాంత అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

     #ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యంనర్సిపురం జెడ్పీ ఉన్నత పాఠశాలను...
24/07/2026





#ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం

నర్సిపురం జెడ్పీ ఉన్నత పాఠశాలను ప్రపంచ స్థాయి సౌకర్యాలతో అభివృద్ధి చేస్తాం : పార్వతీపురం ఎమ్మెల్యే శ్రీ బోనెల విజయచంద్ర గారు

పార్వతీపురం, జూలై 24:

రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించి, ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని పార్వతీపురం ఎమ్మెల్యే శ్రీ బోనెల విజయచంద్ర గారు పేర్కొన్నారు.

పార్వతీపురం మండలం నర్సిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ బోనెల విజయచంద్ర గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా పాఠశాలలోని తరగతి గదులు, ప్రయోగశాలలు, మధ్యాహ్న భోజన వంటశాల, ఇతర మౌలిక వసతులను పరిశీలించి, విద్యార్థుల అభ్యాస పరిస్థితులు, పాఠశాల అవసరాలపై ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు.

అనంతరం జరిగిన తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమావేశంలో ఎమ్మెల్యే శ్రీ బోనెల విజయచంద్ర గారు మాట్లాడుతూ, విద్యా రంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేసి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి ప్రపంచ స్థాయి విద్య అందించాలనే సంకల్పంతో విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు చారిత్రాత్మక సంస్కరణలు అమలు చేస్తున్నారని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలలు కూడా కార్పొరేట్ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోకుండా ఉండాలనే లక్ష్యంతో ఆధునిక తరగతి గదులు, డిజిటల్ లెర్నింగ్, మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన విద్యాబోధనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు జెడ్పీ ఉన్నత పాఠశాలను రూ.15 కోట్ల వ్యయంతో ప్రపంచ స్థాయి సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ప్రభుత్వం, అదే తరహాలో పార్వతీపురం మన్యం జిల్లాలో రెండో పాఠశాలగా నర్సిపురం జెడ్పీ ఉన్నత పాఠశాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించిందని తెలిపారు. ఈ పాఠశాలను జిల్లాలోనే ఆదర్శ ప్రభుత్వ విద్యాసంస్థగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసి పోటీ తత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన "షైనింగ్ స్టార్స్" కార్యక్రమం విశేష ఫలితాలు ఇస్తోందన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో నర్సిపురం జెడ్పీ ఉన్నత పాఠశాల నుంచి అత్యధిక సంఖ్యలో విద్యార్థులు షైనింగ్ స్టార్స్‌గా ఎంపిక కావాలని ఆకాంక్షించారు. ఇందుకోసం ఉపాధ్యాయులు నిబద్ధతతో బోధించాలని, తల్లిదండ్రులు పిల్లల చదువుపై నిరంతరం శ్రద్ధ వహించాలని, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో కృషి చేయాలని సూచించారు.

పిల్లల భవిష్యత్తు నిర్మాణంలో తల్లిదండ్రుల పాత్ర అత్యంత కీలకమని ఎమ్మెల్యే శ్రీ బోనెల విజయచంద్ర గారు పేర్కొన్నారు. పిల్లలు ప్రతిరోజూ పాఠశాలకు హాజరయ్యేలా చూడడం, ఇంటి వద్ద చదువుకు అనుకూల వాతావరణం కల్పించడం, మొబైల్ ఫోన్ల వినియోగాన్ని నియంత్రించడం, ఉపాధ్యాయులతో నిరంతరం సంప్రదింపులు జరపడం ద్వారా వారి విద్యాభివృద్ధికి సహకరించాలని తల్లిదండ్రులకు సూచించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'తల్లికి వందనం' పథకాన్ని ప్రస్తావించిన ఎమ్మెల్యే గారు, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టుకున్నారని అన్నారు. మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్‌కు రెండు రోజుల ముందే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేయడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా జరిగిన మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్‌లలో విద్యార్థులు, తల్లిదండ్రులు విశేషంగా పాల్గొన్నారని పేర్కొన్న ఎమ్మెల్యే గారు, పార్వతీపురం నియోజకవర్గంలో సుమారు 23 వేల మంది విద్యార్థులకు 'తల్లికి వందనం' పథకం ద్వారా దాదాపు రూ.34 కోట్లు వారి తల్లుల ఖాతాల్లో జమయ్యాయని, నర్సిపురం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కుటుంబాలకు మాత్రమే రూ.1.15 కోట్లు అందాయని వెల్లడించారు.

అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావిస్తూ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే గారు తెలిపారు. గత రెండున్నర సంవత్సరాల్లో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకువచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు, విద్య, వైద్యం, మౌలిక వసతులు, సంక్షేమ రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

అనంతరం ఎమ్మెల్యే శ్రీ బోనెల విజయచంద్ర గారు విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనంలో పాల్గొని, పాఠశాల నిర్వహణను అభినందించారు. నర్సిపురం జెడ్పీ ఉన్నత పాఠశాలకు అవసరమైన మౌలిక వసతులన్నీ కల్పించి జిల్లాలోనే ఆదర్శ ప్రభుత్వ విద్యాసంస్థగా తీర్చిదిద్దేందుకు తన సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

    మార్కుల కంటే మంచి వ్యక్తిత్వమే గొప్ప సంపద*ప్రతిభకు చిరునామా లేదు... కష్టపడితే విజయం సొంతం**విద్యార్థుల విజయమే రాష్ట్...
22/07/2026






మార్కుల కంటే మంచి వ్యక్తిత్వమే గొప్ప సంపద

*ప్రతిభకు చిరునామా లేదు... కష్టపడితే విజయం సొంతం*

*విద్యార్థుల విజయమే రాష్ట్ర భవిష్యత్తుకు బాట:*

*126 మంది షైనింగ్ స్టార్స్‌కు ఎమ్మెల్యే చేతుల మీదుగా సత్కారం*

*కష్టానికి దక్కిన గుర్తింపే షైనింగ్ స్టార్స్ పురస్కారం*

*తల్లిదండ్రుల త్యాగాలు, గురువుల కృషిని మరవొద్దు: ఎమ్మెల్యే పిలుపు*

*AI, కమ్యూనికేషన్ నైపుణ్యాలతో భవిష్యత్తుకు సిద్ధం కావాలి*

*మంచి వ్యక్తిత్వం, సామాజిక బాధ్యతతో ఎదగండి*

*ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర*

పార్వతీపురం, విద్యార్థులు మార్కులు సాధించడం మాత్రమే కాకుండా మంచి వ్యక్తిత్వం, సమస్యలను పరిష్కరించే నైపుణ్యం, సామాజిక బాధ్యతను పెంపొందించుకోవాలని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. పార్వతీపురంలో నిర్వహించిన "షైనింగ్ స్టార్స్" పురస్కారాల ప్రదానోత్సవంలో పాల్గొని విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి "షైనింగ్ స్టార్స్"గా ఎంపికైన 126 మంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. ఈ పురస్కారం విద్యార్థులు కష్టపడి చదివిన శ్రమకు, క్రమశిక్షణకు దక్కిన గుర్తింపు అని కొనియాడారు. వరుసగా నాలుగోసారి పార్వతీపురం మన్యం జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలవడం జిల్లాకు గర్వకారణమని పేర్కొంటూ, ఉపాధ్యాయులు, విద్యార్థుల కృషిని ప్రత్యేకంగా అభినందించారు.
పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేస్తారని, ఆ త్యాగాలను విద్యార్థులు జీవితాంతం గుర్తుంచుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు పాఠాలు చెప్పడమే కాకుండా జీవిత విలువలు, ఆత్మవిశ్వాసం, ధైర్యాన్ని నేర్పుతారని చెప్పారు. తనకు జీవిత విలువను నేర్పింది కూడా గురువులేనని ఎమ్మెల్యే గుర్తుచేశారు.

తన తండ్రి ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేసేవారని చెబుతూ, సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వారైనా కష్టపడి ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని అన్నారు. ప్రతిభకు ప్రాంతం, ఆర్థిక స్థితి అడ్డంకి కాదని, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం జీవితాన్ని ఉదాహరణగా ప్రస్తావించారు. ప్రతి తరం గత తరంతో పోలిస్తే మరింత అభివృద్ధి సాధించడం నిజమైన ప్రగతి అని వివరించారు.

ప్రభుత్వం ప్రతి విద్యార్థి విద్య, యూనిఫాం, మధ్యాహ్న భోజనం, పాఠశాల సౌకర్యాల కోసం భారీగా ఖర్చు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. విద్యార్థులే రాష్ట్ర భవిష్యత్తు అని, వారు సాంకేతికంగా అభివృద్ధి చెందితే రాష్ట్ర తలసరి ఆదాయం కూడా పెరుగుతుందని ఆకాంక్షించారు.

విద్యార్థులు కేవలం మార్కులకే పరిమితం కాకుండా సమస్యలను పరిష్కరించే నైపుణ్యం, నిజాయితీ, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డిజిటలైజేషన్, గ్రీన్ ఎనర్జీ వంటి ఆధునిక రంగాలపై అవగాహన పెంచుకోవాలని, తెలుగుతో పాటు ఇంగ్లీష్ సహా ఇతర భాషల్లో కమ్యూనికేషన్ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని కోరారు. సోషల్ మీడియాను విద్య, వ్యక్తిత్వ వికాసం వంటి సానుకూల అంశాల కోసం వినియోగించుకోవాలని, దానికి బానిసలు కాకూడదని హెచ్చరించారు.

రేపు డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, శాస్త్రవేత్తలుగా ఎదిగిన తర్వాత కూడా తమ గ్రామాన్ని, పాఠశాలను, తల్లిదండ్రులను మరచిపోకుండా సమాజ శ్రేయస్సుకు సేవ చేయాలని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర విద్యార్థులకు పిలుపునిచ్చారు.

ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయంప్రజాదర్బార్‌లో ఎమ్మెల్యే బోనెల విజయచంద్రప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభ...
22/07/2026

ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయం
ప్రజాదర్బార్‌లో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర

ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, ప్రజలు వినతులు అందించిన వెంటనే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే తమ లక్ష్యమని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు.

మంగళవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా పింఛన్లు, గృహాలు, ఇళ్ల స్థలాలు, విద్యుత్, భూ సమస్యలు తదితర అంశాలపై ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

వినతులను పరిశీలించిన ఎమ్మెల్యే విజయచంద్ర సంబంధిత అధికారులతో తక్షణమే ఫోన్‌లో మాట్లాడి, కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన సమస్యలను కూడా ప్రాధాన్యత ఆధారంగా పరిశీలించి, వీలైనంత త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే విజయచంద్ర ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

18/07/2026

దివ్యాంగుల పాలిట
ఆపద్బాంధవుడు
చంద్రబాబు నాయుడు

దివ్యాంగులకు పెన్షన్ పెంచాలని వైసీపీ నేతగా అధినేత జగన్, సజ్జలను కోరితే కనీసం స్పందించలేదు. సీఎం చంద్రబాబు నాయుడు దివ్యాంగుల పాలిట ఆపద్బాంధవుడిలా పెన్షన్ పెంచి ఇంటికే అందిస్తున్నారు. మా ఇంటిలో ఇద్దరు దివ్యాంగులు, ఒక వృద్ధుడికి కలిపి.. 16000 నెల నెల పెన్షన్ అందుకుంటున్నాం. కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు.






Address

Parvathipurum
Visakhapatnam
530041

Alerts

Be the first to know and let us send you an email when Vijay Chandra Bonela posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Vijay Chandra Bonela:

Shortcuts

Share