TDP Vizianagaram

TDP Vizianagaram Bring Babu Back

10/04/2025
విజయనగరం నియోజకవర్గం తేదీ : 28-12-2023 ఈరోజు విజయనగరం బిసి సంఘం అధ్యక్షులు శ్రీ గదుల వెంకటరావు గారు మరియు బిసి నాయకులు శ...
28/12/2023

విజయనగరం నియోజకవర్గం
తేదీ : 28-12-2023

ఈరోజు విజయనగరం బిసి సంఘం అధ్యక్షులు శ్రీ గదుల వెంకటరావు గారు మరియు బిసి నాయకులు శ్రీ చోడిపల్లి ఆదినారాయణ గారు, మరియు వివిధ కుల సంఘాల నాయకుల ఆధ్వర్యంలో సుమారు 300 కుటుంబాల వారు, అదేవిధంగా విజయనగరం పట్టణం 26వ వార్డుకు చెందిన ముక్కముల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో 50 కుటుంబాల వారు ఈరోజు పార్టీ కార్యాలయం అశోక్ గారి బంగ్లాలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు గారు, నియోజకవర్గ ఇంచార్జ్ పూసపాటి అదితి గజపతి రాజు గారి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది.

ఈ సందర్బంగా బిసిలకు రాజ్యాధికారం తీసుకువచ్చింది తెలుగుదేశం పార్టీ యేనని, ప్రస్తుతం రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుంది, ఈ రాక్షస పాలన నుండి రాష్ట్రాన్ని కాపాడాలంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నామని అన్నారు.

ఈ సందర్బంగా పార్టీ లో చేరిన వారందరికీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు గారు, నియోజకవర్గ ఇంచార్జ్ పూసపాటి అదితి గజపతి రాజు గారి పార్టీ కండువా వేసి ఆహ్వానించడం జరిగింది.

విజయనగరం నియోజకవర్గం తేదీ 27-12-2023విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రి వద్ద జూనియర్ డాక్టర్స్ వారికి స్టైఫండ్ ఇవ్వాలని డిమా...
27/12/2023

విజయనగరం నియోజకవర్గం
తేదీ 27-12-2023

విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రి వద్ద జూనియర్ డాక్టర్స్ వారికి స్టైఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న నిరసన కు సంఘీభావం తెలిపిన విజయనగరం నియోజకవర్గ ఇంచార్జ్ పూసపాటి అదితి గజపతి రాజు గారు మరియు పార్టీ నాయకులు

విజయనగరం నియోజకవర్గం తేదీ 17-12-2023తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారి పాదయాత్ర సందర్భంగా ప...
18/12/2023

విజయనగరం నియోజకవర్గం
తేదీ 17-12-2023

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారి పాదయాత్ర సందర్భంగా పోలిపల్లి లో నిర్వహించు భారీ బహిరంగ సభ విజయవంతం చేయుటకు విజయనగరం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఈరోజు సాయంత్రం పార్టీ కార్యాలయం అశోక్ గారి బంగ్లాలో నిర్వహించడం జరిగింది

ఈ సమావేశంలో పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు గారు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు శ్రీ కిమిడి నాగార్జున గారు, నియోజకవర్గ ఇంచార్జ్ అదితి గజపతి రాజు గారు, రాష్ట్ర పరిశీలకులు శ్రీ గన్ని వీరాంజనేయులు గారు, శ్రీ ఆర్.పి. భంజ్ దేవ్ గారు మరియు నియోజకవర్గ పార్టీ నాయకులు పాల్గొన్నారు

విజయనగరం నియోజకవర్గం తేదీ : 15-12-2023 జిల్లా కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న దీక్ష కు సంఘీభావం తెలిపిన ...
15/12/2023

విజయనగరం నియోజకవర్గం
తేదీ : 15-12-2023

జిల్లా కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న దీక్ష కు సంఘీభావం తెలిపిన విజయనగరం నియోజకవర్గ ఇంచార్జ్ అదితి గజపతి రాజు గారు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు

విజయనగరం నియోజకవర్గం తేదీ 15.11.2023బాబు ష్యూరిటీ  భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సాయంత్రం రాకోడు గ్రామ...
16/11/2023

విజయనగరం నియోజకవర్గం
తేదీ 15.11.2023

బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సాయంత్రం రాకోడు గ్రామంలో పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారు ఇంటింటి ప్రచారం నిర్వహించి అనంతరం రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది

ఈ కార్యక్రమంలో విజయనగరం నియోజకవర్గ పార్టీ నాయకులు పాల్గొన్నారు Nara Chandrababu Naidu Nara Lokesh Aditi Gajapathi Raju Telugu Desam Party Vizianagaram Constituency TNSF Vizianagaram parliament TDP Vizianagaram Telugu Desam Party (TDP)

18/10/2023

విజయనగరం నియోజకవర్గం జై తెలుగుదేశం
తేదీ : 18-10-2023

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా ఈరోజు(18వ తేదీ) సాయంత్రం "బాబుతో నేను" కార్యక్రమంలో భాగంగా పి.డబ్ల్యు.డి. మార్కెట్ లో "బాబుతో నేను" కరపత్రాల పంపిణీ కార్యక్రమం విజయనగరం నియోజకవర్గం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు గారు పాల్గొని ప్రజలకు కరపత్రాల పంపిణీ చేసారు.

Address

Vizianagaram
535 ###

Website

Alerts

Be the first to know and let us send you an email when TDP Vizianagaram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share