Dr. Kadiyam Kavya

Dr. Kadiyam Kavya In Dr. Kavya, Warangal finds not just a candidate, but a compassionate, educated, and dedicated leader committed to fostering positive change.

Dr. Kavya leads impactful projects focused on education and women's health, menstrual hygiene and health initiatives.
Dr. Kavya's Story

Meet Dr. Kavya, an accomplished MD in Pathology, whose vibrant spirit and dedication to community well-being are reshaping Warangal's future. Her journey is a testament to the power of passion and expertis

e coming together for positive change.

🌿 Local Roots and Political Aspirations 🌿
Hailing from Warangal, Dr. Kavya's roots run deep in the soil of her community. Inspired by her father's political legacy, she aspires to serve as a voice for the people, blending local insight with a forward-thinking vision for progress.

👩‍⚕️ Versatile Leadership and Professional Excellence 👩‍⚕️
Beyond her role as a Lead Pathologist, Dr. Kavya's leadership extends into rural communities, addressing societal challenges with holistic initiatives. Her commitment to uplifting every aspect of the constituency reflects her dedication to making a difference.

📝 Prolific Writing and Advocacy 📝
Dr. Kavya's influence goes beyond the medical field. Her writings and advocacy highlight a deep understanding of societal needs, guiding local governance and championing women's health issues with insight and compassion.

🌐 Chairperson of Kadiyam Foundation 🌐
As Chairperson, Dr. Kavya leads impactful projects focused on education and women's health, leaving a lasting legacy in menstrual hygiene and health initiatives.

🩸 Menstrual Hygiene Activism 🩸
A tireless advocate for menstrual hygiene, Dr. Kavya breaks taboos and empowers adolescent girls through awareness programs and distribution campaigns, ensuring essential hygiene products reach those in need.

🤰 Maternal and Child Health Initiatives 🤰
Dr. Kavya's passion for healthcare extends to pregnant women, providing nutrition awareness and support for healthy deliveries, exemplifying her commitment to maternal and child well-being.

🦸‍♀️ Frontline Warrior during COVID-19 🦸‍♀️
Amid the pandemic, Dr. Kavya emerged as a frontline warrior, collaborating with local administration to provide relief activities and support to COVID-affected individuals, demonstrating her unwavering dedication to community welfare.

📚 Youth Empowerment 📚
Dr. Kavya's support extends to the youth, offering financial aid and educational support programs, ensuring every child has access to quality education and opportunities for success.

💙 Mental Health and Social Welfare 💙
Known for her compassionate initiatives, Dr. Kavya supports mental health facilities and provides aid to vulnerable individuals, spreading warmth and kindness to those in need. Her journey inspires us all to embrace the power of community and compassion, for she truly embodies the spirit of progress Warangal deserves. Wishing you all the best! May your dedication and commitment to the people of Warangal lead you to success in the career path.

మీకు,మీ కుటుంబ సభ్యులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు..
04/09/2026

మీకు,మీ కుటుంబ సభ్యులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు..


03/09/2026

హనుమకొండ కనకదుర్గ కాలనీలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో గురువారం వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని 11 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.6.50 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య గారు పంపిణీ చేశారు..



హనుమకొండతేది: 03-09-2026సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులతో నిరుపేదలకు భరోసా..11 మంది లబ్ధిదారులకు రూ.6.50 లక్షల చెక్కులు పంపిణీ చేసి...
03/09/2026

హనుమకొండ
తేది: 03-09-2026

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులతో నిరుపేదలకు భరోసా..

11 మంది లబ్ధిదారులకు రూ.6.50 లక్షల చెక్కులు పంపిణీ చేసిన వరంగల్‌ ఎంపీ డా. కడియం కావ్య..

అనారోగ్యంతో బాధపడుతూ ఖరీదైన వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత లేని నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) అండగా నిలుస్తోందని వరంగల్‌ పార్లమెంట్‌ సభ్యురాలు డాక్టర్‌ కడియం కావ్య అన్నారు. వైద్య ఖర్చులతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ప్రభుత్వం సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా చేయూత అందిస్తోందని తెలిపారు..

హనుమకొండ కనకదుర్గ కాలనీలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో గురువారం వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని 11 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.6.50 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య పంపిణీ చేశారు..

ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య మాట్లాడుతూ...
పేద ప్రజలకు అత్యవసర సమయంలో వైద్య సహాయం అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా ఆర్థిక సహాయం అందించడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వ సహాయం అందేలా తన వంతు కృషి చేస్తానని ఎంపీ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా ఆర్థిక సహాయం అందడంతో లబ్ధిదారులు ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య గారికి కృతజ్ఞతలు తెలిపారు. వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం అందించిన ఈ సహాయం తమ కుటుంబాలకు ఎంతో ఊరటనిచ్చిందని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు..



స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంతేదీ: 02.09. 2026స్టేషన్‌ఘన్‌పూర్‌ కాంగ్రెస్ కు కంచుకోట..కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేయాలి..సీ...
02/09/2026

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం
తేదీ: 02.09. 2026

స్టేషన్‌ఘన్‌పూర్‌ కాంగ్రెస్ కు కంచుకోట..

కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేయాలి..

సీఎం రేవంత్‌రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేయడమే మన లక్ష్యం..

కొత్తగా ఎంపికైన మండల, గ్రామ పార్టీ అధ్యక్షులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలి...

కొత్త పాత అనే తేడా లేకుండా అందరిని కలుపుకొని పోవాలి...

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలం పెరిగింది...

గత మూడు ఎన్నికలలో తిరుగులేని విజయం సాధించాం...

రాబోయే రోజులలో ఏ ఎన్నికలు వచ్చినా నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండానే ఎగరాలి...

ప్రజలలో ఉంటూ పార్టీ కోసం కష్టపడి పని చేసేవారికే ప్రాధాన్యత ఉంటుంది...

మన లక్ష్యం అభివృద్ధి, పేద ప్రజల సంక్షేమంపైనే ఉండాలి...

కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను బిఆర్ఎస్, బీజేపీలు ఓర్వలేకపోతున్నాయి...

బిఆర్ఎస్, బీజేపీ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసే దాడిని తిప్పికొట్టాలి...

నిరసనల పేరుతొ వచ్చే బిఆర్ఎస్ నాయకులను ఎందుకు నిరసనలు చేస్తున్నారో ప్రజలు నిలదీయాలి...

బీజేపీ కులతత్వ, మతతత్వ రాజకీయాలతో ప్రజల మధ్య చిచ్చు పెడుతుంది...

ప్రధాని మోడీ తెలంగాణపై సవతి ప్రేమ చూపెడుతూ అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తున్నారు...

తెలంగాణ అభివృద్ధి చెందడం బీజేపీకి ఇష్టం లేదు...

అధికారం కోల్పోయమని బిఆర్ఎస్, అధికారంలోకి రావాలని బీజేపీ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై అబద్దపు, తప్పుడు ఆరోపణలతో విష ప్రచారం చేస్తున్నాయని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు, మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మండిపడ్డారు..

రఘునాథపల్లి మండల కేంద్రంలోని ఖిలాషాపూర్‌ రోడ్డులో గల కేఎన్‌ఎన్‌ గార్డెన్స్‌లో నిర్వహించిన రఘునాథపల్లి మండల, గ్రామ నూతన కమిటీల పరిచయ కార్యక్రమానికి వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య గారు, ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు..

ఈ సందర్బంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్బంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు ఘనంగా నివాళులు అర్పించారు. రైతులు, పేద ప్రజల సంక్షేమానికి వైస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశ పెట్టిన అనేక సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే గారు గుర్తు చేశారు..

ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ...
స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గాన్ని కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటగా మార్చేందుకు నాయకులు, కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేయాలని వరంగల్‌ పార్లమెంట్‌ సభ్యురాలు డా. కడియం కావ్య పిలుపునిచ్చారు. రాబోయే ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్‌ జెండా నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో రెపరెపలాడేలా క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ను తన సొంత ఇంటిగా భావిస్తున్నానని తెలిపారు. నియోజకవర్గ ప్రజలు తనను కుటుంబ సభ్యురాలిగా ఆదరిస్తున్నారని, వారి ప్రేమాభిమానాలను ఎప్పటికీ మరువలేనన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గ అభివృద్ధికి తన ఎంపీ ల్యాడ్స్‌ నుంచి ఎంపీ పదవీకాలంలో ఇప్పటివరకు రావాల్సిన సాధారణ నిధుల కంటే అధికంగా నియోజకవర్గానికి నిధులు అందించినట్లు తెలిపారు.

ప్రజలు, కార్యకర్తలు ఏ సమస్యను తన దృష్టికి తీసుకొచ్చినా పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని స్పష్టం చేశారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ రైల్వే స్టేషన్‌లో ముఖ్యమైన రైళ్లకు హాల్ట్‌ కల్పించాలనే ప్రజల డిమాండ్‌పై కేంద్ర రైల్వే శాఖ దృష్టికి తీసుకెళ్తామని ఎంపీ తెలిపారు. ముఖ్యంగా ఇంటర్‌సిటీ, ఇతర కీలక రైళ్లకు స్టేషన్‌ఘన్‌పూర్‌లో నిలుపుదల కల్పించేందుకు రైల్వే బోర్డుకు ప్రాతినిధ్యం ఇస్తామని చెప్పారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా రైల్వే సౌకర్యాలను మెరుగుపరిచేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు సంబంధిత అధికారులను పదేపదే సంప్రదిస్తున్నట్లు పేర్కొన్నారు.

రాబోయే రోజుల్లో మహిళలకు రాజకీయాల్లో మరిన్ని అవకాశాలు లభించనున్నాయని, మహిళా రిజర్వేషన్‌ నేపథ్యంలో గ్రామస్థాయి నుంచే మహిళలు నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు ముందుకు రావాలని వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య పిలుపునిచ్చారు. పార్టీ నిర్మాణంలో మహిళల భాగస్వామ్యాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. గత పదేళ్ల పాలనలో స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎదుర్కొన్న పరిస్థితులను, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని ఎంపీ డా. కడియం కావ్య అన్నారు. కాంగ్రెస్ పాలనలో సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఇతర సంక్షేమ పథకాల ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.

రాబోయే రోజుల్లో వరంగల్‌ ప్రాంత అభివృద్ధికి అనేక కీలక ప్రాజెక్టులు రానున్నాయని ఎంపీ తెలిపారు. మామునూరు విమానాశ్రయం 2028లో అందుబాటులోకి వచ్చే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని, రైల్వే తయారీ యూనిట్‌, మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ వంటి ప్రాజెక్టులతో ఉమ్మడి వరంగల్‌ ప్రాంత ఆర్థిక, పారిశ్రామిక రూపురేఖలు మారనున్నాయని చెప్పారు.నూతనంగా ఎన్నికైన మండల, గ్రామ కమిటీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు వ్యక్తిగత విభేదాలకు, చిన్నచిన్న తగాదాలకు, గ్రూపు రాజకీయాలకు దూరంగా ఉండాలని ఎంపీ డా. కడియం కావ్య సూచించారు.పదవులు రాలేదని నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని, పార్టీ కోసం నిజాయితీగా పనిచేసే ప్రతి కార్యకర్తకు భవిష్యత్‌లో అవకాశాలు వస్తాయని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి గ్రామానికి, ప్రతి కుటుంబానికి చేరవేయాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసాగేందుకు పార్టీ శ్రేణులంతా కష్టపడాలని కోరారు.

ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ...
మనందరి ఏకైక ఎజెండా అభివృద్ధి, సంక్షేమ ఫలాలను పేద ప్రజలకు చేర్చడం, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మనతో కలిసి రావడానికి ఇష్టంగా ఉన్న ఇతర పార్టీల నాయకులను పార్టీలోకి ఆహ్వానించాలని తెలిపారు.స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ప్రజల మధ్యలో ఉంటూ పార్టీ కోసం పని చేసే వారికే ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరే విధంగా మనందరం కలిసి కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయాలని పిలుపునిచ్చారు. ఏ కార్యకర్తకు ఏ అవసరం ఉన్నా నేరుగా నన్ను కలువవచ్చని, మీ పనిలో న్యాయం ఉంటే తప్పకుండా చేసేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తానని వెల్లడించారు. నియోజకవర్గంలో ప్రతీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలి, రేవంత్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి కావాలని అందుకు ప్రతీ కార్యకర్త కట్టుబడి పనిచేయాలని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి బిఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఓర్వలేక పోతున్నాయని ఆరోపించారు. బిఆర్ఎస్, బీజేపీ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసే దాడిని గట్టిగా తిప్పికొట్టాలని సూచించారు. 10ఏళ్ల బిఆర్ఎస్ పాలనలో అక్రమంగా సంపాదించిన సొమ్ము పంపకాలలో వచ్చిన గొడవ వల్లే తండ్రి కొడుకులు కవితను వెళ్లగొట్టారని విమర్శించారు. బిఆర్ఎస్ పై కవిత చేసే ఆరోపణలకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు ఏమాత్రం సిగ్గు ఉన్నా, తెలంగాణ పౌరుషం ఉన్నా వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును బీజేపీ వ్యతిరేకించిందని తెలంగాణ అభివృద్ధి చెందడం ప్రధాని మోడీకి ఇష్టం లేదని అందుకే తెలంగాణపై సవతి ప్రేమ చూపెడుతూ అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. పక్క రాష్ట్రాలకు వేల కోట్ల నిధులు ఇస్తుంటే తెలంగాణ నుండి ఇద్దరు మంత్రులు, 8మంది ఎంపీలు ఉండి ఎం చేస్తున్నారని ప్రశ్నించారు. 12ఏళ్లలో తెలంగాణకు ఇచ్చారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కులతత్వ, మతతత్వ రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య చిచ్చు పెట్టడమే బీజేపీకి తెలుసని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాంబాబు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇందిరా, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు జగదీష్ రెడ్డి, సీనియర్ నాయకులు లింగాజీ, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు క్రాంతి, మండల పార్టీ అధ్యక్షులు మహేందర్, కోళ్ల రవి, నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు, మండల అనుబంధ సంఘాల అధ్యక్షులు, సర్పంచులు, నూతనంగా ఎన్నికైన గ్రామ పార్టీ అధ్యక్షులు, మండల సమన్వయ కమిటీ సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..


హనుమకొండతేది: 02-09-2026అధికారం పోయిందన్న అక్కసుతోనే బీఆర్‌ఎస్‌ విమర్శలు..రెండుమూడేళ్లు కూడా ఓపిక పట్టలేకపోతున్నారు.. ప్...
02/09/2026

హనుమకొండ
తేది: 02-09-2026

అధికారం పోయిందన్న అక్కసుతోనే బీఆర్‌ఎస్‌ విమర్శలు..

రెండుమూడేళ్లు కూడా ఓపిక పట్టలేకపోతున్నారు.. ప్రజా తీర్పును గౌరవించాలి..

నిర్మాణాత్మక విమర్శలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధమే..

అసెంబ్లీకి రాకుండా కాలయాపన చేయడం సరైన పద్ధతి కాదు..

విద్యార్థులను ఉద్యమానికి వాడుకున్నారు.. విద్యకు ఏం చేశారు?

విద్యారంగంపై పదేళ్లలో సీఎం స్థాయిలో సమీక్ష చేశారా?

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పేరుతో పదేళ్లు కథలు చెప్పారు..

అసంపూర్తి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు బీఆర్‌ఎస్‌ పాలనకు నిదర్శనం..

కాంగ్రెస్‌ పాలనను చూసి బీఆర్‌ఎస్‌కు వెన్నులో వణుకు పుడుతుంది..

1000 రోజుల కాంగ్రెస్‌ పాలనే మా ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌.. చెప్పినవి చేస్తున్నాం.. చెప్పనివీ చేస్తున్నాం..

__డా. కడియం కావ్య
ఎంపీ,వరంగల్

హనుమకొండ డిసిసి కార్యాలయంలోని మీడియా సమావేశంలో శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి గారితో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు..

మీడియా సమావేశంలో వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య మాట్లాడుతూ...

అధికారం కోల్పోయామన్న అక్కసుతోనే బీఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై పదేపదే విమర్శలు చేస్తున్నారని వరంగల్‌ పార్లమెంట్‌ సభ్యురాలు డా. కడియం కావ్య మండిపడ్డారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌.. ప్రజలు ఇచ్చిన తీర్పుతో ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కనీసం రెండుమూడేళ్లు కూడా ఓపికగా ఉండలేకపోతోందని విమర్శించారు. “మా సమయం వస్తుంది” అని ఓపికగా వేచి చూడకుండా.. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ఓర్వలేక ప్రతిరోజూ ఏదో ఒక అంశంపై విమర్శలు చేయడం వారి అధికార దాహాన్ని బయటపెడుతోంది అని అన్నారు..

“పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలు గుర్తుకు రాలేదు. ఇప్పుడు అధికారం కోల్పోయిన రెండుమూడేళ్లకే ఓపిక నశిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులకు ప్రజలు తీర్పు ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంటే ఓర్వలేక విమర్శలు చేస్తున్నారు. ఇది ప్రజలపై ప్రేమ కాదు.. అధికారం కోల్పోయామన్న అక్కసు, తిరిగి అధికారం కోసం పడుతున్న ఆరాటం” అని వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య వ్యాఖ్యానించారు..

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు రెండున్నరేళ్లలోనే తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో గణనీయమైన మార్పు తీసుకొచ్చిందని ఎంపీ తెలిపారు. విద్యార్థి ఏడాది చదువుకున్న తర్వాత తన ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ను చూసుకున్నట్లే.. కాంగ్రెస్‌ ప్రభుత్వ 1000 రోజుల పాలనకు తాము చేసిన పనులే ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ అన్నారు..

“మేము నోటి మాటగా చెప్పడం లేదు. ఏం చేశామో.. ఎంత చేశామో గణాంకాలతో సహా ప్రజల ముందుంచాం. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనకు, కాంగ్రెస్‌ రెండున్నరేళ్ల పాలనకు తేడాను ప్రజలే గమనిస్తున్నారు” అని చెప్పారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని భారీ అప్పుల భారంలోకి నెట్టి వెళ్లినా.. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమాన్ని ఆపకుండా, అభివృద్ధి కార్యక్రమాలను సమాంతరంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. “అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్‌ ప్రభుత్వానికి రెండు కళ్ల లాంటివి. ఆరు గ్యారంటీలను అమలు చేస్తూనే రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన కార్యక్రమాలను చేపడుతున్నాం” అని స్పష్టం చేశారు..

బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేశారని ఎంపీ విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థులను ఉపయోగించుకున్నారని, తెలంగాణ కోసం 1200 మందికి పైగా విద్యార్థులు ప్రాణత్యాగాలు చేశారని పేర్కొన్నారు “విద్యార్థులను ఉద్యమానికి ఉపయోగించుకున్న బీఆర్‌ఎస్‌.. అధికారంలోకి వచ్చిన తర్వాత వారి భవిష్యత్‌ కోసం ఏం చేసింది? యూనివర్సిటీలకు వైస్‌ ఛాన్సలర్లను నియమించారా? ముఖ్యమంత్రి స్థాయిలో విద్యాశాఖపై ఎప్పుడైనా సమీక్ష చేశారా?” అని ప్రశ్నించారు..

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశ్వవిద్యాలయాలకు వైస్‌ ఛాన్సలర్ల నియామకాలు చేపట్టడంతో పాటు తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌, రెసిడెన్షియల్‌ పాఠశాలల అభివృద్ధికి చర్యలు తీసుకుంటోందన్నారు..

విద్యార్థులకు పాఠశాలలు ఉండటం మాత్రమే కాకుండా నాణ్యమైన బోధన అందించేందుకు తగినంత మంది ఉపాధ్యాయులు ఉండాలని ప్రభుత్వం భావించిందన్నారు. అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసి సుమారు 10 వేల మంది ఉపాధ్యాయులను నియమించినట్లు తెలిపారు..

“తెలంగాణ వస్తే మన ఉద్యోగాలు మనకే వస్తాయని చెప్పారు. కానీ పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం రెండున్నరేళ్లలోనే వివిధ శాఖల్లో సుమారు 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్‌ ప్రభుత్వం” అని అన్నారు.

మహిళా సాధికారతకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ఎంపీ డా. కడియం కావ్య తెలిపారు. మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ వంటి పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. “మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే బీఆర్‌ఎస్‌ నాయకులు ‘ఎవరు అడిగారు?’ అంటూ ఎగతాళి చేశారు. కానీ మా ఉద్దేశం మహిళలకు కేవలం ఉచితాలు ఇవ్వడం కాదు.. వారు ఆర్థికంగా ఎదిగి, వ్యాపారవేత్తలుగా మారాలి” అని అన్నారు.

మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా సుమారు రూ.60 వేల కోట్ల రుణాలు అందించినట్లు తెలిపారు. పెట్రోల్‌ బంకులు, సోలార్‌ పవర్‌ ప్లాంట్లు తదితర రంగాల్లో మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. మహిళలను ఆర్టీసీ బస్సులకు యజమానులుగా తీర్చిదిద్దే దిశగా కూడా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పేరుతో పేదలకు ఎన్నో హామీలు ఇచ్చినా.. అనేక ప్రాంతాల్లో ఇళ్లు అసంపూర్తిగా వదిలేసిందని ఎంపీ విమర్శించారు. “డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పేరుతో పదేళ్లు కథలు చెప్పారు. పేదలకు పూర్తిస్థాయిలో ఇళ్లు అందించలేకపోయారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే తొలి దశలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది” అని తెలిపారు.

లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ పక్షపాతం లేదని స్పష్టం చేశారు. అర్హత ఆధారంగా కలెక్టర్ల పర్యవేక్షణలో ఎంపిక జరుగుతోందని, కాంగ్రెస్‌ కార్యకర్తలకే పథకాలు దక్కాలనే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదన్నారు.

మాజీ సీఎం కేసీఆర్‌కు రాజకీయ అనుభవం ఉందని, ఆయన నిర్మాణాత్మక విమర్శలు చేస్తే ప్రభుత్వం స్వీకరించేందుకు సిద్ధంగా ఉందని కావ్య అన్నారు. “కేసీఆర్‌ గారికి అనుభవం ఉంది. అభివృద్ధికి ఉపయోగపడే సూచనలు చేస్తే సీఎం రేవంత్‌రెడ్డి గారు సానుకూలంగా స్పందిస్తారు. కానీ ప్రతిరోజూ రాజకీయ విమర్శలు చేయడం, కాలయాపన చేయడం వల్ల తెలంగాణకు ప్రయోజనం ఉండదు” అని పేర్కొన్నారు.

ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలని, అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించేందుకు ప్రతిపక్షాలు ముందుకు రావాలని కోరారు.

“ప్రజలు ఒక పార్టీకి అధికారం ఇచ్చారు.. మరో పార్టీకి ప్రతిపక్ష బాధ్యత ఇచ్చారు. ఆ బాధ్యతను గౌరవించాలి. రెండుమూడేళ్లు కూడా ఓపిక పట్టలేకపోవడం ఎందుకు? ‘మా సమయం వస్తుంది’ అని ప్రజల్లో ఉండి పనిచేయాలి. అంతే తప్ప అధికారం పోయిందన్న అక్కసుతో ప్రభుత్వంపై బురదజల్లడం సరైన రాజకీయ విధానం కాదు” అని అన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూనే.. ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త కార్యక్రమాలను కూడా చేపడుతోందని ఎంపీ డా. కడియం కావ్య తెలిపారు.

“బీఆర్‌ఎస్‌ పదేళ్లలో చేయలేని అనేక పనులను కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండున్నరేళ్లలో చేసి చూపించింది. ప్రతి వర్గానికి, ప్రతి రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నాం. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం. చెప్పినవి చేస్తున్నాం.. చెప్పనివి కూడా చేస్తున్నాం. కాంగ్రెస్‌ ప్రభుత్వ 1000 రోజుల పాలనకు ఇదే మా ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారు” అని ఎంపీ డా. కడియం కావ్య స్పష్టం చేశారు.

అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతిని పురస్కరించుకుని హన్మకొండలోని డీసీసీ కార్యాలయంలో వరంగల్ ఎంపి డా.కడియం కావ్య ఘనంగా నివాళులర్పించారు..


ప్రజల కోసం జీవించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత..దివంగత నేత డా.వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి ఘన నివాళు...
02/09/2026

ప్రజల కోసం జీవించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత..
దివంగత నేత డా.వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం..🙏



Today Paper Clippings..
02/09/2026

Today Paper Clippings..


హనుమకొండతేది:01-09-2026స్మార్ట్ రేషన్ కార్డుతో అనేక సంక్షేమ పథకాల ప్రయోజనాలు – వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య..నూతన స్మార్ట...
01/09/2026

హనుమకొండ
తేది:01-09-2026

స్మార్ట్ రేషన్ కార్డుతో అనేక సంక్షేమ పథకాల ప్రయోజనాలు – వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య..

నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు..

హసన్‌పర్తి మండలంలో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజుతో కలిసి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు..

ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య మాట్లాడుతూ...
గత పదేళ్లలో కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్ల కోసం ప్రజలు ఎదురుచూశారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం తదితర సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 1000 రోజులు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డా. కడియం కావ్య కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. చిన్నారులకు ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డు ఇచ్చినట్లే.. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో సాధించిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు.

గతంలో రేషన్ కార్డు ప్రధానంగా ఆసుపత్రుల్లో ఆరోగ్య సేవలకు ఉపయోగపడేదని, ప్రస్తుతం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుతో అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందే అవకాశం కలుగుతోందని డా. కడియం కావ్య వివరించారు. ‘వన్ కార్డు–మెనీ స్కీమ్స్’ విధానంలో ఆరోగ్య సేవలు, రుణాలు, సన్నబియ్యం, విద్య, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను అర్హులైన కుటుంబాలు పొందవచ్చన్నారు. ప్రతి లబ్ధిదారుడు స్మార్ట్ రేషన్ కార్డును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

పేదలకు ఇళ్ల మంజూరు, ఇతర సంక్షేమ పథకాల విషయంలో ఎవరైనా డబ్బులు అడిగినా, మోసాలకు పాల్పడినా వెంటనే ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు దృష్టికి తీసుకురావాలని ఎంపీ సూచించారు. ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలో వర్ధన్నపేట నియోజకవర్గంలో ఇళ్ల మంజూరు విషయంలో ఎలాంటి అక్రమ వసూళ్లు జరగలేదని అధికారులు స్పష్టం చేశారని తెలిపారు.

వర్ధన్నపేట ఎస్సీ నియోజకవర్గం కావడంతో పేదలు అధికంగా ఉన్నారని, అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా ఎమ్మెల్యే నాగరాజు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని చెప్పారు.

పేద కుటుంబాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులకే పేదల కష్టాలు, సమస్యలు మరింతగా అర్థమవుతాయని డా. కడియం కావ్య అన్నారు. ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు ప్రతి సమీక్ష సమావేశానికి పూర్తి సమాచారంతో హాజరవుతూ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్‌లో మంత్రులు, ఉన్నతాధికారులను కలుస్తూ నియోజకవర్గానికి అవసరమైన నిధులు, సంక్షేమ పథకాలను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఆత్మకూర్ మార్కెట్ వైస్ చైర్మన్ శ తిరుపతి, వంగపహాడ్ PACS చైర్మన్ రాకేష్ గౌడ్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రాకేష్ రెడ్డి, సీతానగరం సర్పంచ్ సునీత, అశ్వరావు పల్లి సర్పంచ్ ప్రభాకర్ గౌడ్, సిద్ధాపూర్ సర్పంచ్ హరీష్, బైరాన్‌పల్లి సర్పంచ్ సురేందర్, కొత్తపల్లి సర్పంచ్ సాంబయ్య, MRO, MPDO, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్ కుమార్, 1వ డివిజన్ అధ్యక్షుడు చిత్ర రాము, 2వ డివిజన్ అధ్యక్షుడు పుట్టా తిరుపతి, 55వ డివిజన్ అధ్యక్షుడు గడ్డం అరుణ్ తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు..


Address

Warangal

Alerts

Be the first to know and let us send you an email when Dr. Kadiyam Kavya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Dr. Kadiyam Kavya:

Shortcuts

Share