ఏన్ఆర్ఐతెలుగుదేశం కువైట్

ఏన్ఆర్ఐతెలుగుదేశం కువైట్ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు

*కార్యకర్తల బాధ్యత నాది, పార్టీ కోసం కష్టపడిన వారి ఇంటికి పెద్దకొడుకులా అండగా ఉంటా**-వైసీపీ హయాంలో హత్యకు గురైన రొంపిచర్...
21/05/2025

*కార్యకర్తల బాధ్యత నాది, పార్టీ కోసం కష్టపడిన వారి ఇంటికి పెద్దకొడుకులా అండగా ఉంటా*

*-వైసీపీ హయాంలో హత్యకు గురైన రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డి*

*-బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యులను పిలిపించుకుని మాట్లాడిన మంత్రి లోకేష్*

*-కుటుంబానికి జీవితాంతం అండగా ఉంటానని భరోసా*

*-ఇకపై కార్యకర్తలను నేరుగా కలుసుకోవాలని మంత్రి లోకేష్ నిర్ణయం*

*ఉండవల్లిః*
తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం అని, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల బాధ్యత తాను తీసుకుంటానని, ఇంటికి పెద్దకొడుకులా అండగా ఉంటానని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం అహర్నిశలు కృషిచేస్తున్న మంత్రి నారా లోకేష్.. తన నియోజకవర్గ పర్యటనలో ముందుగా కార్యకర్తల సమావేశమై వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరిస్తున్నారు. ఇకపై ఉండవల్లి నివాసంలో కార్యకర్తలను నేరుగా కలుసుకుని వారికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ గూండాల చేతిలో హత్యకు గురైన పల్నాడు జిల్లా రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ వెన్నా బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యులను ఉండవల్లి నివాసానికి పిలిపించుకుని వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

కార్యకర్తే అధినేత హామీని నిలబెట్టుకుంటున్న మంత్రి లోకేష్

అలవాల గ్రామానికి చెందిన వెన్నా బాలకోటిరెడ్డి నాలుగు దశాబ్దాలుగా పార్టీ పటిష్టత, ప్రజా సంక్షేమ కోసం పనిచేశారు. దీనిని ఓర్వలేని వైసీపీ గూండాలు అప్పటి వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అండతో ఇంట్లో నిద్రిస్తున్న వెన్నా బాలకోటిరెడ్డిని తుపాకీతో కాల్చి చంపారు. హత్యకు ఆరు నెలల ముందు కత్తులతో దాడికి యత్నించగా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. రక్షణ కోసం పోలీసులకు పలుమార్లు ఫిర్యాదుచేసినప్పటికీ పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వంలో కార్యకర్తే అధినేత అనే లక్ష్యంతో పనిచేస్తున్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. వైసీపీ విధ్వంస పాలనను ఎదుర్కొని తీవ్రంగా నష్టపోయిన కార్యకర్తల కుటుంబాలకు అన్ని విధాల అండగా నిలుస్తున్నారు.

హత్య కేసు నిందితులను కఠినంగా శిక్షించాలి

దివంగత వెన్నా బాలకోటిరెడ్డి సతీమణి వెన్నా నాగేంద్రమ్మ, బాలకోటిరెడ్డి సోదరుని కుమారులు వెన్నా నరసింహారెడ్డి, వెన్నా రామకృష్ణారెడ్డిలను కలుసుకున్న మంత్రి లోకేష్.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హత్య పూర్వాపరాలు, వెన్నా నాగేంద్రమ్మ ఆరోగ్యపరిస్థితిపై వాకబు చేశారు. హత్య కేసు నిందితులు స్వేచ్ఛగా సంచరిస్తున్నారని, కేసును పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యులు మంత్రి నారా లోకేష్ కు విజ్ఞప్తి చేశారు. ఆర్థికంగా చాలా నష్టపోయామని, ఉపాధి హామీ, గృహనిర్మాణం బిల్లులు పెండింగ్ లో ఉండటంతో పాటు తాము నివసిస్తున్న ఇల్లు తాకట్టులో ఉందని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

బాలకోటిరెడ్డి కుటుంబానికి జీవితాంతం అండగా ఉంటానని భరోసా

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. వెన్నా బాలకోటిరెడ్డి కుటుంబానికి జీవితాంతం అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పెండింగ్ బిల్లులను చెల్లించడంతో పాటు పార్టీ పరంగా ఇంటిని తాకట్టు నుంచి విడిపిస్తానని హామీ ఇచ్చారు. హత్య కేసు నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. వైసీపీ దాష్టీకాలకు ఎదురొడ్డి నిలిచిన అంజిరెడ్డి తాత, మంజులారెడ్డి, తోట చంద్రయ్యలే మనకు స్ఫూర్తి అని.. ఇంటికి పెద్దకొడుకులా బాధ్యత తీసుకుంటానని వారికి ధైర్యం చెప్పారు. తమకు మంత్రి లోకేష్ అండగా నిలబడటం పట్ల బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

ఎన్.ఆర్.ఐ తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో జరుగు " ప్రవాసాంద్ర గర్జన " అతిధుల మొదటి పోస్టర్ విడుదల చెయ్యడం జరిగింది.
19/05/2025

ఎన్.ఆర్.ఐ తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో జరుగు " ప్రవాసాంద్ర గర్జన " అతిధుల మొదటి పోస్టర్ విడుదల చెయ్యడం జరిగింది.

చంద్రబాబు అంటే ఒక బ్రాండ్.. చంద్రబాబు అంటే కష్ట జీవి.. చంద్రబాబు అంటే రాజకీయ చాణక్యుడు... ఆలాంటి వ్యక్తిని  53రోజులు జైల...
19/05/2025

చంద్రబాబు అంటే ఒక బ్రాండ్.. చంద్రబాబు అంటే కష్ట జీవి.. చంద్రబాబు అంటే రాజకీయ చాణక్యుడు... ఆలాంటి వ్యక్తిని
53రోజులు జైల్లో ఉంచడం అంటే ఎంతో ఆలోచించాల్సిన విషయం.

అప్పటి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు గారిని రాజకీయాలకు దూరం చేయాలన్న కుట్రలు చేశారు.. చoద్రబాబు గారు రాజకీయాల్లో ఉన్నంతవరకు తమ కుర్చీకి ప్రమాదం గానే kcr,జగన్ భావించారు. అడ్డు తొలగించుకోవడానికి ఉన్న అవకాశాలు అన్నీ వెతికారు,..kcr ప్లాన్ జగన్ అమలు చేశాడు.ఇరువురు కలిసి ఆడిన నాటకమే బాబు గారి 53 రోజుల జైలు..వాళ్ళ కుట్రలకు న్యాయవ్యస్థలు తోడు నిలిచాయి..కేంద్రం తమ స్వార్ధం కోసం మౌనం వహించింది...
న్యాయం కంటిని కాపాడాల్సిన కనురెప్ప కాటేసినట్లు గా మారింది.
ఎన్నో సంచలన తీర్పులు ఇచ్చిన జస్టిస్ బేలా త్రివేది గారు చంద్రబాబు గారీ విషయం లో ఎవరి వత్తిడి లేకుండా న్యాయం చెప్పారు అని జనం ఈరోజు కు నమ్మడం లేదు..
న్యాయ వ్యవస్థకు అది ఒక మరక అని తెలిసినా మేధావులు మౌనం వహించారు..
చంద్రబాబు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పారు..
ఎక్కువ కాలం బీజేపీతో స్నేహం చేశాడు...
కష్టకాలంలో బీజేపీ కి అండగా ఉన్నాడు..
ఒకే ఒక ఎన్నికలో కాంగ్రెస్ కోసం పని చేయడమే కాంగ్రెస్ పార్టీతో జత కట్టడమే చంద్రబాబు గారి తప్పుగా బీజేపీ భావించింది..రాజకీయాలలో శాశ్వత శత్రువులు ఉండరు అని అంటారు...కానీ చంద్రబాబు గారి విషయంలో kcr జగన్ వైఖరిని మాత్రం బాబు గారిని శాశ్విత శత్రువుగానే చూడటం విచిత్రం.చంద్రబాబు గారు నేరం చేశారా లేదా అనేది న్యాయవ్యవస్థలు పరిశీలన కంటే చంద్రబాబు గారిని ఎక్కువ రోజులు జైల్లో ఉంచడం ద్వారా మానసికం గా హింసించాలి అన్నదే ఉద్దేశం గా కనిపించింది...కొన్ని ఏళ్లుగా గా ఆయన సంపాదించిన పేరు నాశనం చేయాలన్నదే వారి లక్యం గా కనిపించింది.కేంద్రం లో ఏ రాష్ట్ర నాయకులైనా..పార్టీలకు అతీతం గా చంద్రబాబు అంటే గౌరవం.
చంద్రబాబు అరెస్ట్ సమయంలో దేశంలోనే కాదు ప్రపంచ దేశాలలో జనం స్పందించి రోడ్ల మీదకు వచ్చారు అంటే అదే బాబుగారు గొప్ప తనం....
అలాంటి చంద్రబాబు గారికి జరిగింది అన్యాయం అని అందరికీ తెలుసు. కర్మ ఎవరిని వదలదు.అదే కర్మ ఫలితం kcr,జగన్ అనుభవిస్తున్నారు...కానీ
న్యాయవ్యవస్థకు అంటుకున్న మచ్చ పోవాలాలంటే ఏ తప్పు చేయని బాబు గారిని 53 రోజుల జైల్లో పెట్టిన న్యాయ మూర్తులు....
జగన్ విషయంలో ఉదాసీనత ఎందుకో ఆలోచన చేయాలి..ప్రపంచం లో ఏ దేశం లో
ఏ న్యాయస్థానంలో లేని వెసులుబాటు జగన్ కు ఎందుకు ఇస్తున్నారో న్యాయమూర్తులు చెప్పాలి..
ఒక ఆర్థిక నేరస్తుడి అక్రమ సంపాదన న్యాయస్థానాల న్యాయమూర్తుల నోళ్ళు మూఇస్తాయా...?
జగన్ కోసం కొత్త చట్టాలు చేశారా...?
ఒక నేరగాడు బెయిల్ మీద ఉండి అన్ని వ్యవస్థలను పబ్లిక్ గా బెదిరిస్తూ...సాక్షుల ను అంతం చేస్తూ..స్వంత మీడియాలో తప్పు కథనాలతో జనాన్ని నమ్మిస్తుంటే చట్టాలు...నాయకులు ఎంతకాలం చోద్యం చూస్తూ కూర్చుంటారు...

ఈరోజు సుప్రీం కోర్టు లో 23 రోజుల ముందుగా రిటైర్ మెంట్ తీసుకొన్న చీఫ్ జస్టిస్ బేలా త్రివేది గారికి సెండ్ ఆఫ్ పార్టీ ఇవ్వడానికి న్యాయ వాదుల రెండు సంఘాలు నిరాకరించడo న్యాయ వ్యవస్థలకు అవమానం కాదా...??
జగన్ లక్షల కోట్ల అక్రమ సంపాదన..
kcr కాళేశ్వరం..
ఫోన్ ట్యాపింగ్ లాంటి కేసులు సుమోటోగా న్యాయస్థానాలు స్వీకరించి ప్రజల సొమ్ము ప్రజలకు చెందే తీర్పులు చెపితే మన న్యాయ స్థానాల తీర్పులు ప్రపంచానికి మార్గదర్శ కాలు అవుతాయి..
140 కోట్ల మంది జనం న్యాయమూర్తులను దేవుండ్లుగా చూస్తారు..న్యాయస్థానాలు దేవాలయాలుగా చూస్తారు..
ఆ తీర్పులకోసం ఆశగా ఎదురు చూసే ఆశాజీవిగా ఎదురు చూస్తుంటాం

5కోట్ల మంది ప్రజల గొంతుక...  చారిత్రాత్మక "యువగళం" పాదయాత్రపై యువనేత నారా లోకేష్ అంతరంగం "The voice of  people" పుస్తకాన...
17/05/2025

5కోట్ల మంది ప్రజల గొంతుక... చారిత్రాత్మక "యువగళం" పాదయాత్రపై యువనేత నారా లోకేష్ అంతరంగం "The voice of people" పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోడీజీ....

17/05/2025
16/05/2025

సీఎం చంద్రబాబు గారి బ్రాండ్ తోనే ఆంధ్ర రాష్ట్రానికి బడా పరిశ్రమలు వస్తున్నాయి.




16/05/2025

బ్రేకింగ్ న్యూస్...*

చిలకలూరిపేట రూరల్ CI సుబ్బ నాయుడు గారు మాజీ మంత్రి విడదల రాజనీని బెదిరించారా...??

లేక

మాజీ మంత్రి విడదల రజనీనే చిలకలూరిపేట రూరల్ CI సుబ్బ నాయుడు గారిని బెదిరించిందా

వాస్తవాలతో కూడిన ఫుల్ వీడియోని బయట పెట్టిన iTDP

బెదిరింపులకూ ఓ హద్దుంటుంది పరిధి దాటితే "వేట" మొదలవుతుంది ఇప్పుడు మాజీ మంత్రి విషయంలో అదే జరిగింది.

*కార్యకర్తలకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పిన లోకేష్* ..  1) దయచేసి మీరు గ్రామంలో యూనిటీగా ఉండండి 2) గ్రామస్థాయి లో పని ...
16/05/2025

*కార్యకర్తలకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పిన లోకేష్* ..
1) దయచేసి మీరు గ్రామంలో యూనిటీగా ఉండండి
2) గ్రామస్థాయి లో పని జరగపోతే మండలపార్టీ నాయకుల ద్వారా పనులు చేసుకోండి
3) అప్పటికి అవ్వకపోతే MLA దగ్గరకి వెళ్ళండి
4) అప్పటికి అవ్వకపోతే మీ ఇంచార్జీ మినిస్టర్ దగ్గరికి వెళ్ళండి
5) అప్పటికి అవ్వకపోతే టీడీపీ సెంట్రల్ ఆఫీస్ మంగళగిరికి వచ్చి ఒక అర్జీ ఇవ్వండి...
మన ఇంట్లో ఉంటే పనులు అవ్వవు దయచేసి మీ సొంత పనులు అడగండి, మీకు సమస్యలు లేకపోతే అప్పుడూ తీసుకురండి మిగతావారి పనులు.... ఎక్కడ నిరుత్సాహ పడవద్దు.
అమ్మ మీద నాన్న మీద అలిగినట్టు పార్టీ మీద అలగండి కానీ అమ్మ లాంటి పార్టీ నీ మరచిపోవద్దు..
దయచేసి మూడవవ్యక్తి చెప్పింది నమ్మవద్దు మీరు లైవ్ లో విన్నవి నమ్మండి...
మన MLA వైసీపీ వాళ్ళకి చేస్తున్నాడు అంటా?
లోకేష్ టైమ్ ఇవ్వడం లేదు అంటా?
బాబు గారు అసలు కలవడం లేదు అంటా?
ఇలాంటీ పుకార్లు నమ్మవద్దు... మేము మనసులం కదా!
కొన్ని తప్పులు చేయవచ్చు దయచేసి మీరు చెప్పండి...

మీ
*నారా లోకేష్..*

Address

Kuwait City

Website

Alerts

Be the first to know and let us send you an email when ఏన్ఆర్ఐతెలుగుదేశం కువైట్ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share